India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భార్య పుట్టింటికి వెళ్లిందని భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన HYD పటాన్‌చెరు పరిధి అమీన్‌పూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. నారాయణఖేడ్ వాసి కృష్ణ(33) అమీన్‌పూర్ పురపాలక పరిధి మల్లారెడ్డి కాలనీలోని గెరడా అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా 10 రోజులుగా పనిచేస్తున్నాడు. అతడి భార్య పుట్టింటికి వెళ్లి రాకపోవడంతో మనస్థాపానికి గురైన అతడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని నేడు సాలార్‌జంగ్ మ్యూజియం మూసి ఉంటుందని సంబంధిత అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈరోజు పండుగ సెలవు నేపథ్యంలో సాలార్‌జంగ్ మ్యూజియంను సందర్శించడానికి దూర ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలన్నారు.
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు 1,66,475 దరఖాస్తులొచ్చాయి. ఈ మేరకు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్, టెట్ కన్వీనర్ ఎం.రాధారెడ్డి HYDలో ఒక ప్రకటన విడుదల చేశారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తుల సమర్పణకు తుది గడువు బుధవారం వరకే ఉందని తెలిపారు. వచ్చే నెల 20 నుంచి జూన్ 3వ తేదీ వరకు టెట్ రాతపరీక్షలను ఆన్‌లైన్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) విధానంలో నిర్వహిస్తారు.
ఈనెల 15 లోగా మాదిగలకు ఎంపీ సీట్లు కేటాయించకపోతే కాంగ్రెస్ కార్యాలయమైన గాంధీభవన్‌తో పాటు అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో చావు డప్పు మోగిస్తామని టీ ఎమ్మార్పీఎస్ చీఫ్ వంగపల్లి శ్రీనివాస్ మాదిగ హెచ్చరించారు. HYD విద్యానగర్‌లోని ఆ సంఘం స్టేట్ ఆఫీస్‌లో సోమవారం ఆయన మాట్లాడారు. తెలంగాణలో అధిక జనాభా కలిగిన మాదిగలకు ఒక్క ఎంపీ సీటు ఇవ్వకుండా కాంగ్రెస్ మాదిగలను అణగదొక్కే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు.
రోజురోజుకూ ఎండ తీవ్రత పెరిగిపోతోంది. వేసవి ఎండలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీంతో మధ్యాహ్నం రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. సోమవారం HYD, ఉమ్మడి RR జిల్లాల్లో ఎండ దంచికొట్టింది. అత్యధికంగా వికారాబాద్ జిల్లా పుట్టపహాడ్‌లో 40.6 డిగ్రీలు, శేరిలింగంపల్లి ప్రాంతంలో 39.8 డిగ్రీలు, ఉప్పల్ పరిధి మారుతీనగర్‌లో 39.4 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
చేవెళ్ల ఎంపీగా 3 లక్షల ఓట్ల భారీ మెజారిటీతో తాను గెలుస్తానని విశ్వేశ్వర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మొయినాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మోదీ పేరుతో లక్ష ఓట్లు మెజారిటీ, మరో రెండు లక్షల మెజారిటీని మాత్రం కార్యకర్తల పేరుతోనే సాధించనున్నట్లు వెల్లడించారు. ప్రధాని మోదీ అభివృద్ధి ప్రదాత అని అన్నారు. హనుమంతుడి గుడిని కూల్చిన వ్యక్తి జై శ్రీరామ్ అంటే నమ్మేస్థితిలో ఎవరూ లేరన్నారు.
HYD శంషాబాద్ మండలం ముచ్చింతల్ సమీపంలోని చినజీయర్ స్వామి ఆశ్రమంలో హీరో చిరంజీవి నటిస్తోన్న విశ్వంభర సినిమా షూటింగ్ టీమ్ సందడి చేసింది. ఈ సందర్భంగా షూటింగ్ స్పాట్‌కు తమ్ముళ్లు పవన్ కళ్యాణ్, నాగబాబు వచ్చారు. వీరి కలయికను చూసిన టీమ్ సభ్యులు తెగ సంబరపడి పోయారు. సోమవారం ముగ్గురు అన్నదమ్ములు ఒకే దగ్గర ఉన్నారని తెలుసుకున్న అభిమానులు వారిని చూసేందుకు వేలాదిగా తరలివచ్చారు.
HYD బేగంపేట్‌లో హీరోయిన్ రష్మిక సందడి చేశారు. ఓ హోటల్‌లో సోమవారం జరిగిన ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె అనంతరం ఫొటోలకు ఫోజులిస్తూ అభిమానులను కలిశారు. పుష్ప సినిమా హీరోయిన్‌ను చూసేందుకు.. ఆమెతో ఫొటోలు, సెల్ఫీలు తీసుకునేందుకు అభిమానులు ఎగబడ్డారు.
మహిళల సంక్షేమంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఉప్పల్ మాజీ MLA NVSS ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్ మెట్రో, MMTSలోనూ మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాలని డిమాండ్ చేశారు. స్కూల్, కాలేజీ విద్యార్థులకు కూడా ఈ వెసులుబాటు ఉండాలన్నారు. కానీ, ఇవేమీ కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదన్నారు. రాబోయే ఎన్నికలు అభివృద్ధి కోసం జరిగేవని, కాంగ్రెస్‌ను నమ్మి మోసపోవొద్దు అంటూ పేర్కొన్నారు. దీనిపై మీ కామెంట్?
HYDలో విచ్చలవిడిగా నీటిని వినియోగిస్తున్నారు. భూరగ్భజలాలు అడుగంటడంతో ట్యాంకర్లకు డిమాండ్ పెరిగింది. అయినా పబ్లిక్ తీరు మార్చుకోవడం లేదు. నిత్యం రాజధానిలో 448 మిలియన్ గ్యాలన్ల నీరు వాడుతున్నారు. అందులో 30 మిలియన్ గ్యాలన్లు వృథా చేస్తున్నారు. మంజీరా, కృష్ణ నుంచి ఒక్క కిలో లీటర్ నీటిని నగరానికి తరలించాలంటే రూ.45 నుంచి రూ. 50 వరకు ఖర్చువుతోందట. హైదరాబాదీ ఇకనైనా మేలుకో.
SAVE WATER
Sorry, no posts matched your criteria.