India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బీఆర్ఎస్ చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్‌ను భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని HYD శేరిలింగంపల్లి MLA ఆరికపూడి గాంధీ అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం వివేకానంద నగర్, కూకట్‌పల్లి డివిజన్లకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్తలు, ముఖ్య నాయకులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యేతో పాటు కాసాని పాల్గొని మాట్లాడారు. జనం KCR వెంటే ఉన్నారన్నారు. BRS హయాంలో HYD ఎంతో అభివృద్ధి చెందిందన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. HYDజూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో కాంగ్రెస్ సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి దానం నాగేందర్‌తో కలిసి మాట్లాడారు. పార్టీ కార్యకర్తలు, నాయకులంతా కలిసి కష్టపడి భారీ మెజారిటీతో కాంగ్రెస్‌ను గెలిపించాలని కోరారు. పలు సూచనలు చేశారు.మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, అజహరుద్దీన్, ఫిరోజ్ ఖాన్, విజయారెడ్డి తదితరులున్నారు.
కాంగ్రెస్ సభకు వెళ్లొస్తూ ఓ వ్యక్తికి రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. చేవెళ్ల మండలం గొల్లగూడ వాసి మహిపాల్ తుక్కుగూడలో గత రాత్రి నిర్వహించిన కాంగ్రెస్ జన జాతర సభకు హాజరై తిరిగి వెళుతున్నాడు. ఈ క్రమంలో చేవెళ్ల ధర్మసాగర్ గేటు వద్ద అతడి బైక్‌ను మరో వాహనం ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన అతడిని గచ్చిబౌలి కాంటినెంటల్ ఆస్పత్రికి తరలించారు. ఈరోజు ఎంపీ రంజిత్ రెడ్డి అతడిని పరామర్శించారు.
ప్రజల కష్టసుఖాలు తెలిసిన ఏకైక పార్టీ కాంగ్రెస్ అని ఆ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి పట్నం సునీతామహేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం మల్కాజిగిరి పార్లమెంట్ పరిధి నిజాంపేట్‌కు చెందిన వివిధ పార్టీల నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి కండువా కప్పి సాదరంగా ఆమె ఆహ్వానించి మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పట్టుదలతో పని చేయాలని సూచించారు.
బీజేపీ HYD పార్లమెంట్ అభ్యర్థి మాధవీలతపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. ఆమె ఇటీవల ఓ జాతీయ మీడియా నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొని తన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. దీనిపై మోదీ స్పందించారు. ”మాధవీలతా జీ.. మీ ఆప్ కీ అదాలత్ ఎపిసోడ్ అద్భుతంగా ఉంది. చాలా కీలక అంశాలను మీరు ఇందులో లేవనెత్తారు. అవి ఎంతో తార్కికంగా ఉన్నాయి. మీకు నా శుభాకాంక్షలు” అంటూ మోదీ ట్వీట్ చేశారు.
HYD కాప్రా మండలం జవహర్‌నగర్ PS పరిధిలో విషాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. స్థానిక బీజేఆర్ నగర్ పరిధి జ్యోతిరావు కాలనీలో 4 రోజుల క్రితం ఇంట్లోని గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో బాలుడు బన్సీ(7)కి తీవ్ర గాయాలు కావడంతో సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న బాలుడు ఈరోజు మృతిచెందాడు. కుమారుడు మృతిచెందడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. కేసు నమోదైంది.
తెలంగాణ ఉద్యమకారుడైన పద్మారావుగౌడ్‌ను గెలిపిద్దామని జూబ్లీహిల్స్ MLA, BRS పార్టీ HYD జిల్లా అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ అన్నారు. ఈరోజు బంజారాహిల్స్‌లోని తెలంగాణ భవన్‌లో BRS సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, ముఠా గోపాల్, BRS సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి టి.పద్మారావుగౌడ్, పార్టీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, మన్నె గోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఓల్డ్ సిటీలోని కబుతర్‌ఖానా వద్ద తుపాకీ పేలిన ఘటనలో పోలీస్ అధికారి చనిపోయిన సంగతి తెలిసిందే. మహబూబ్‌నగర్ 10వ బెటాలియన్‌కు చెందిన TSSP AR SI బాలేశ్వర్ (48) విధుల నిర్వహణలో భాగంగా శనివారం పాతబస్తీకి వచ్చారు. ఆదివారం ఉ. 5.30 గంటలకు తన సర్వీస్ గన్‌తో సూసైడ్ చేసుకొన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.
ఇంటింటి చెత్త సేకరణను 100% విజయవంతం చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ నగరవాసులకు సూచించారు. స్వచ్ఛ ఆటోలకు చెత్త ఇవ్వకుండా, రోడ్లపై పడేస్తే జరిమానా తప్పదని హెచ్చరించారు. వారం రోజుల బస్తీ కార్యాచరణతో సాధ్యమైన ఫలితాలను వివరిస్తూ ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. క్షేత్రస్థాయి సమావేశాలతో 1,87,752 ఇళ్ల యజమానులు స్వచ్ఛ ఆటోలకు చెత్త ఇవ్వట్లేదని.. ఇకనైనా మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని పేర్కొన్నారు.
HYDలో దారుణఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్ వాసి హన్స్‌రామ్(38) కుత్బుల్లాపూర్‌లో ఉంటున్నాడు. భార్య 2 నెలల క్రితం ఊరెళ్లింది. నాటినుంచి జీడిమెట్లలోని బినయ్‌సింగ్ గదిలో ఉంటున్నాడు. మంగళవారం అన్నం వండలేదని బినయ్‌సింగ్‌ను అదే గదిలో ఉండే సందీప్, సోను మద్యం మత్తులో కొట్టారు. హన్స్‌రామ్‌నూ విచక్షణా రహితంగా కొట్టడంతో చనిపోయాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Sorry, no posts matched your criteria.