Hyderabad

News April 7, 2024

ఓయూ: ఇంటర్, పాఠశాల విద్యార్థులకు ప్రత్యేక తరగతులు

image

ఓయూ క్యాంపస్ ఇంజినీరింగ్ కాలేజీలో కొనసాగుతున్న సెంటర్ ఫర్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ ట్రైనింగ్‌లో ఇంటర్, పాఠశాల విద్యార్థులకు వేసవి ప్రత్యేక శిక్షణ తరగతులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఇంగ్లిష్ కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్ మెంట్ కోర్సుల్లో నెల రోజుల శిక్షణకు ఈ నెల 15 నుంచి తరగతులు ప్రారంభంకానున్నట్లు అధికారులు తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు నేటి నుంచి దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News April 7, 2024

HYD: ట్యాంకర్లకు ఫుల్ డిమాండ్.. ఇదే అదునుగా కమిషన్..?

image

HYDలో ఈ వేసవిలో ట్యాంకర్లకు ఫుల్ డిమాండ్ నెలకొంది. దీనినే అదునుగా చేసుకుని కొంత మంది HMWSSB ట్యాంకర్ డ్రైవర్లు వినియోగదారుల వద్దకు వెళ్లి కమిషన్ అడుగుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. మెహదీపట్నం సెక్షన్ పరిధిలో ఓ వ్యక్తి ట్యాంకర్ బుక్ చేశాడు. ఒక ట్యాంకర్ ఖరీదు రూ.500 కాగా చేతి ఖర్చుల పేరిట రూ.100 అదనంగా వసూలు చేస్తున్నారన్నారు. దీనిపై స్పందించిన HMWSSB అధికారులు అలా చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు.

News April 6, 2024

మల్కాజిగిరి పార్లమెంట్‌లో సమన్వయకర్తలు వీరే!

image

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని BRS పార్టీ అసెంబ్లీ స్థానాల వారీగా ఎన్నికల సమన్వయకర్తలను నియమించింది. మేడ్చల్-శంభీపూర్ రాజు(MLC), మల్కాజిగిరి-నందికంటి శ్రీధర్, కుత్బుల్లాపూర్-గొట్టిముక్కల వెంగళరావు ,కూకట్‌పల్లి-బేతిరెడ్డి సుభాష్ రెడ్డి, ఉప్పల్-జహంగీర్ పాషా, సికింద్రాబాద్ కంటోన్మెంట్ -రావుల శ్రీధర్ రెడ్డి, ఎల్బీనగర్ -బొగ్గరపు దయానంద గుప్త ఎమ్మెల్సీని నియమించారు.

News April 6, 2024

HYD: కేబుల్ బ్రిడ్జ్ వద్దకు వస్తున్నారా..? పోలీసుల హెచ్చరిక 

image

HYD దుర్గంచెరువు వద్దకు వచ్చేవారు సెల్ఫీలు దిగేందుకు కేబుల్ బ్రిడ్జిపైకి  వెళ్లకూడదని మాదాపూర్ సీఐ మల్లేశ్ తెలిపారు. సెల్ఫీల కోసం రోడ్లపైకి రావడంతో తరుచూ ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఎవరైనా సెల్ఫీల కోసం దుర్గంచెరువు మీదకు వస్తే రూ.1000 జరిమానాతో పాటు కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. కేబుల్ బ్రిడ్జిపై శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందిన విషయం తెలిసిందే. SHARE IT

News April 6, 2024

BREAKING: ఉప్పల్ స్టేడియం బిల్లుల పెండింగ్ పై ఒప్పందం!

image

HYD ఉప్పల్ స్టేడియం నిర్వాహకులు దాదాపు రూ.1.63 కోట్ల కరెంట్ బిల్లులు బకాయి ఉండటంతో ఇటీవలే కరెంట్ కట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై తాజాగా శనివారం HCA, TSSPDCL ఎండీ ముషారఫ్‌తో జరిపిన చర్చలు ఫలించాయి. స్టేడియం కరెంట్ బిల్లుల బకాయిలను ఇన్‌స్టాల్‌మెంట్స్ ప్రకారంగా చెల్లిస్తామని HCA ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు తెలపగా ఎండీ అంగీకరించినట్లుగా పేర్కొన్నారు.

News April 6, 2024

గాంధీలో హబ్ అండ్ స్పోక్ కంట్రోల్ కమాండ్ సేవలు

image

డయాలసిస్ సంబంధిత సమస్యతో బాధపడే రోగులకు గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రొ.రాజారావు నెఫ్రాలజీ విభాగం వైద్యులు తీపి కబురు అందించారు. ఇకపై 24 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఆయా రోగులకు కంట్రోల్ కమాండ్ ద్వారా వైద్య సేవలు అందేలా ప్రత్యేకమైన వ్యవస్థను ఏర్పాటు చేశారు. 6న ‘హబ్ అండ్ స్పోక్ కంట్రోల్ కమాండ్’ పేరిట గాంధీ ఆసుపత్రిలోని నెఫ్రాలజీ విభాగంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ప్రారంభించినట్లు తెలిపారు.

News April 6, 2024

HYD: రూ.6,53,35,400 నగదు సీజ్ చేశాం: రోనాల్డ్ రాస్

image

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో HYDలో గడిచిన 24 గంటల వ్యవధిలో నిర్వహించిన తనిఖీల్లో రూ.6,53,35,400 నగదు పట్టుకుని సీజ్ చేసినట్లు HYD ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ తెలిపారు. ఆబ్కారీ శాఖ ద్వారా 80.65 లీటర్ల మద్యాన్ని పట్టుకున్నామన్నారు. రూ.65,390 విలువ గల ఇతర వస్తువులు పట్టుకుని సీజ్ చేసినట్లు తెలిపారు. 14 ఫిర్యాదులు రాగా వాటిని పరిష్కారం చేశామన్నారు.

News April 6, 2024

HYD: డిగ్రీతో పాటు మిలిటరీ ట్రైనింగ్.. మీ కోసమే..!

image

HYD, RR, MDCL, VKB జిల్లాల్లోని యువతులకు గురుకులాల అధికారులు గుడ్ న్యూస్ తెలిపారు. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కాలేజీలో 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్స్ అందిస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. MA(ఎకనామిక్స్)+మిలిటరీ ట్రైనింగ్ అందించనున్నామని పేర్కొన్నారు. దరఖాస్తుకు ఏప్రిల్ 15 చివరి తేదీ కాగా.. మిగతా వివరాలకు tswreis.ac.in వెబ్‌సైట్ చూడాలని HYD గురుకులాల అధికారులు Xలో ట్వీట్ చేశారు.

News April 6, 2024

HYD: శంషాబాద్‌లో MURDER.. నిందితుడి అరెస్ట్

image

ఓ మహిళ హత్యకు గురైన ఘటన HYD శంషాబాద్ పరిధి సంఘీగూడ శివారులో ఈరోజు జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. శంషాబాద్ పరిధి పాలమాకులకు చెందిన యాదమ్మను శంకరయ్య అనే వ్యక్తి హత్య చేసి, మృతదేహాన్ని పాతిపెట్టాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News April 6, 2024

HYD: ఎవరిని ఎవరు తొక్కుతారో చూద్దాం: మంత్రి

image

మాజీ సీఎం KCR వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. శనివారం HYD గాంధీభవన్‌లో మంత్రి మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో రచ్చ చేస్తామని కేసీఆర్ అంటున్నారు. రేపటి నుంచి కాంగ్రెస్ నేతలంతా రోడ్లపైనే ఉంటారు. ఎవరు వస్తారో రండి, చూసుకుందాం. ఎవరిని ఎవరు తొక్కుతారో తేలుతుంది. చేనేత కార్మికులకు బీఆర్ఎస్ పార్టీ చేసిందేమీ లేదు’ అని విమర్శించారు. BRS పని అయిపోయిందని ఎద్దేవా చేశారు.