Hyderabad

News April 6, 2024

HYD: వామ్మో ఎండ.. AC బస్సుల్లో రద్దీ

image

HYDలో ఎండ దంచి కొడుతోంది. దీంతో నగరంలో ప్రయాణం చేయాలంటేనే ప్రజలు ఆలోచిస్తున్నారు. తప్పని పరిస్థితుల్లో కొందరు మహిళలు సైతం పైసలైనా సరే.. ఏసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఏసీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య వేసవి వేళ పెరుగుతోంది. మరికొంత మంది ప్రయాణికులు మెట్రోను సైతం ఆశ్రయిస్తున్నారు. ప్రయాణికులతో అటు మెట్రో, ఇటు ఏసీ బస్సులు కిటకిటలాడుతున్నాయి.

News April 6, 2024

HYD: KCR హయాంలోనే అభివృద్ధి జరిగింది: రాగిడి

image

HYD నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బండారి లే అవుట్‌లో బీఆర్‌ఎస్ మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి విస్తృతంగా ప్రచారం చేశారు. రాగిడి మాట్లాడుతూ.. KCR హయాంలోనే అభివృద్ధి జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం కల్లబొల్లి కబుర్లు చెబుతూ ప్రజలను మభ్య పెడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వివేకానంద, నిజాంపేట్ మున్సిపాలిటీ డిప్యూటీ మేయర్ ధన్‌రాజ్ పాల్గొన్నారు.

News April 6, 2024

SR నగర్‌లో యువతిని ఢీకొట్టింది ఇతనే..!

image

HYD SR నగర్‌లో ఓ <<13001120>>యువతి స్కూటీని ముగ్గురు<<>> టీనేజర్లు బైక్‌తో ఢీకొట్టగా ఆమె కాలు విరిగి, తలకు తీవ్రగాయాలైన విషయం తెలిసిందే. రోడ్డు ప్రమాదం జరిగిన అనంతరం ఆ ముగ్గురు టీనేజర్లు వెళ్లిపోతుండగా స్థానికులు వారిని వెంబడించి పట్టుకున్నారు. స్పీడ్‌గా బైక్ నడిపిన వ్యక్తిని మందలించారు. కాగా ఈ ప్రమాదంలో ఆ ముగ్గురు అబ్బాయిలకు సైతం గాయాలయ్యాయి. యువతితో పాటు వారిని కూడా ఆస్పత్రికి తరలించారని స్థానికులు తెలిపారు.

News April 6, 2024

కాచిగూడ నుంచి తిరుపతికి ప్రత్యేక రైలు

image

ఆరు వేసవి రైళ్లను మరికొన్ని ట్రిప్పులు పొడిగిస్తున్నట్లు ద.మ. రైల్వే శుక్రవారం తెలిపింది. కాచిగూడ నుంచి తిరుపతికి ప్రతి గురువారం వెళ్లే ప్రత్యేక రైలు (నం.07653) ను మే 1 వరకు, శుక్రవారం.. తిరుపతి -కాచిగూడ (నం.07654) రైలు మే 2 వరకు, బుధవారం.. సికింద్రాబాద్‌ -రామగుండం (నం.07695) రైలును ఏప్రిల్‌ 24 వరకు రైల్వే శాఖ పొడిగించింది.

News April 6, 2024

HYD: నేడు ‘షబ్‌-ఎ- ఖదర్’.. రాత్రంతా జాగారం!

image

రంజాన్ మాసం నేపథ్యంలో ‘షబ్‌-ఎ- ఖదర్’ రాత్రి మరింత మహోన్నతమైంది. రంజాన్‌ మాసంలో 26వ ఉపవాసం(నేడు) రాత్రంతా భక్తి శ్రద్ధలతో ‘షబ్‌ -ఎ- ఖదర్’ జరుపుకుంటారు. HYD, ఉమ్మడి RR జిల్లా వ్యాప్తంగా జగ్నేకి రాత్‌(జాగారం) నిర్వహించుకునేందుకు ముస్లింలు విస్తృత ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. నిన్న రంజాన్ మాసంలో చివరి శుక్రవారం సందర్భంగా మసీదులలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆఖరి జుమాకు అల్విదా పలికారు.

News April 6, 2024

HYD: ఎండ మామూలుగా లేదుగా!

image

HYDలో ఉష్ణోగ్రతలు రోజురోజుకి పెరుగుతున్నాయి. 24 గంటల్లో రాష్ట్రంలో గరిష్ఠంగా కూకట్‌పల్లిలోని వివేకానందనగర్ ఆఫీస్ వద్ద 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. మల్లాపూర్- 43 డిగ్రీలు, కుత్బుల్లాపూర్-42.7, గోల్కొండ, లంగర్ హౌస్, చర్లపల్లిలో-42.6, ముషీరాబాద్-42.3తో పాటు పలు ప్రాంతాల్లో 41 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు పేర్కొంది. ప్రజలు అవసరమైతే బయటకు రావాలని సూచించింది.

News April 6, 2024

SRH VS CSK మ్యాచ్: 35,992 మంది హాజరు

image

ఉప్పల్ స్టేడియంలో శుక్రవారం రాత్రి జరిగిన SRH VS CSK ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌ని 35,992 మంది వీక్షించినట్లు నిర్వాహకులు తెలియజేశారు. గ్రౌండ్ ఫుల్ కెపాసిటీతో నిండిపోయిందని HCA తెలిపారు. హోమ్ గ్రౌండ్లో రెండో మ్యాచ్ గెలవడం పట్ల హెచ్‌సీఏ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు, బృందం సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.

News April 6, 2024

నేడు HYDలో ట్రాఫిక్‌ మళ్లింపు

image

తుక్కుగూడలో కాంగ్రెస్‌ తలపెట్టిన జనజాతర బహిరంగ సభ నేపథ్యంలో సభకు వచ్చే వాహనదారులకు, సాధారణ వాహనదారులకు రాచకొండ సీపీ తరుణ్‌జోషి పలు సూచనలు చేశారు. శనివారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వాహనదారులు నిబంధనలు పాటించాలన్నారు. NH- 44 బెంగళూరు నుంచి వచ్చే వాహనాలు పాలమాకుల, స్వర్ణభారతి ట్రస్టు, పెద్ద గోల్కొండ సర్వీసు రోడ్డు నుంచి ఓల్డ్‌ పీఎం మీటింగ్‌ స్థలం వద్ద పార్కింగ్‌ చేయాలన్నారు.

News April 6, 2024

HYD: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. పెళ్లి చేసుకుంటానని మోసం!

image

ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన యువతిపై ఓ యువకుడు లైంగిక దాడి చేశాడు. పోలీసుల కథనం ప్రకారం.. మల్కాజిగిరికి చెందిన రతన్‌కుమార్‌(22)కు తుకారాంగేట్‌‌కు చెందిన ఓ యువతి ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పరిచయమైంది. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఓయో లాడ్జికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆమె గర్భిణి కావడంతో పెళ్లి చేసుకునేందుకు నిరాకరించగా.. బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అరెస్ట్ అయ్యాడు.

News April 6, 2024

HYD ఓటర్లకు కలెక్టర్ సూచనలు

image

✓ఫారం-12 నింపి, ఓటర్ కార్డు జత చేసి పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ✓పోస్టల్ బ్యాలెట్ దరఖాస్తుకు ఏప్రిల్ 15 లాస్ట్
✓మే 3 నుంచి 8 వరకు పోస్టల్ బ్యాలెట్ అందజేసిన వారికి ఓటు హక్కు వినియోగించుకునే ఛాన్స్
✓18 ఏళ్ల వయసు ఉంటే నూతన ఓటరుగా దరఖాస్తు
✓ఏప్రిల్ 14లోపు నూతన ఓటర్ నమోదు
✓మే 13వ తేదీన లోక్‌సభ ఎన్నికల పోలింగ్
• ఈ మేరకు HYD రిటర్నింగ్ ఆఫీసర్, కలెక్టర్ అనుదీప్ సూచించారు.