India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
GHMC మేయర్ గద్వాల విజయలక్ష్మి నేడు కాంగ్రెస్ పార్టీలోకి చేరనున్నారు. బంజారాహిల్స్‌లోని మేయర్ క్యాంప్ ఆఫీస్‌లో సాయంత్రం 6 గంటలకు CM రేవంత్ రెడ్డి, దీపాదాస్ మున్షీ సమక్షంలో హస్తం కండువా కప్పుకోనున్నారు. ఇదిలా ఉంటే ఆమెతోపాటు మరికొందరు కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నేతలు సైతం పార్టీ మారుతారని ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఆ పార్టీ మారే నేతలు ఎవరనేది గ్రేటర్ రాజకీయల్లో సర్వత్రా ఉత్కంఠగా మారింది.
ఎయిర్‌గన్ తలకు పెట్టి బెదిరించిన ఇద్దరిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. శుక్రవారం ACP వెంకటేశ్వరరావు కేసు వివరాలు వెల్లడించారు. ఈ నెల 27న మీర్‌చౌక్ PS పరిధి ఎతేబర్ చౌక్‌లోని పెట్రోల్ బంకులో భక్షి అలీ, జాహి అనే ఇద్దరు సిబ్బందితో గొడవపడ్డారు. ఈ క్రమంలోనే తమ వద్ద ఉన్న ఎయిర్‌గన్ తీసి చంపేస్తామని బెదిరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేసినట్లు ACP తెలిపారు.
పార్టీ మార్పు అంశంపై BRS రాజేంద్రనగర్ MLA క్లారిటీ ఇచ్చారు. ఇటీవల తెలంగాణభవన్‌లో జరిగిన చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశానికి హాజరుకాకపోవడంతో ప్రకాశ్ గౌడ్ పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరిగింది. శుక్రవారం ఈ వ్యవహారంపై ఆయన స్పందించారు. ‘మార్చి 31న మనవరాలి పెళ్లి ఉంది. పనుల్లో బిజీగా ఉండడంతో రాలేకపోయాను. అంతమాత్రాన ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం తగదు’ అంటూ ప్రకాశ్ గౌడ్ హెచ్చరించారు.
KTR ప్రధాన అనుచరుడు అలిశెట్టి అరవింద్ కాంగ్రెస్‌లోకి వెళుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. తన రాజకీయ గురువుగా భావించే KK సైతం పార్టీని వీడటంతో అరవింద్ కూడా హస్తం వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమం నుంచి BRS పార్టీ, KTR వెంట నడిచిన అలిశెట్టి ప్రస్తుతం రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయానికి వచ్చినట్లు ఆయన అనుచరులు తెలిపారు.
పార్లమెంట్ ఎన్నికలపై BRS అధిష్ఠానం ఫోకస్ పెట్టింది. సభలు, ర్యాలీలతో పాటు ఈసారి పాదయాత్ర చేసేందుకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR సిద్ధమయ్యారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 30వ తేదీ శనివారం సా.5 గంటలకు KTR పాదయాత్ర HYD అంబర్‌పేట్‌లో జరగనుందని MLA కాలేరు వెంకటేశ్ తెలిపారు. BRS శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావాలని MLA పిలుపునిచ్చారు. సత్తా చాటేందుకు కార్యకర్తలు, నాయకులు సిద్ధం కావాలని అన్నారు.
భువన్ సర్వే పేరుతో ఆస్తిపన్ను మదింపు చేయించిన మున్సిపల్ అధికారులు ఆ సర్వే ప్రకారం ఇళ్ల విస్తీర్ణం ఆధారంగా పన్ను జారీ చేస్తున్నారు. పంచాయతీలుగా ఉన్నప్పటి పన్నుల ప్రకారం లెక్కగట్టి కొంతమేరకు పెంచితే సరిపోతుంది. ఇందుకు విరుద్ధంగా జవహర్‌నగర్, బడంగ్‌పేట, మీర్‌పేట్, నిజాంపేట్, బోడుప్పల్, పీర్జాదీగూడ కార్పొరేషన్లలో ఇంటి పన్నులు పెంచి ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చౌకగా ప్రయాణించే అవకాశం ఉన్నా MMTSలను ప్రజలు అంతగా ఎక్కడం లేదు. రెండోదశలో 95 కి.మీ. తోడైనా ప్రయాణికులు పెరగలేదు. మెట్రోలేని మార్గాలతో పాటు శివార్లను కలుపుతూ నలువైపులా అందుబాటులోకొచ్చినా అదే పరిస్థితి. సమయపాలన పాటించకపోవడంతోనే ప్రయాణికులు దూరమయ్యారని నగర ప్రజలు ఆరోపిస్తున్నారు. మేడ్చల్ – సికింద్రాబాద్ మధ్య 10 సర్వీసులు ప్రతి రోజూ ఆలస్యంగా నడుస్తున్నాయని చెబుతున్నారు.
రంజాన్ నేపథ్యంలో పాతబస్తీలో అత్తర్లఅమ్మకాలు జోరందుకున్నాయి. పాతబస్తీ అనగానే మొదటగా గుర్తొచ్చేది వీటి పరిమళాలే. ఇక్కడ దాదాపు 500 రకాలకుపైగా అత్తర్లు లభిస్తున్నాయి. ఇక్కడి దుకాణాల్లో సహజ సిద్ధంగా తయారు చేసిన అత్తర్లతో పాటు సింథటిక్ అత్తర్లు లభిస్తున్నాయి. 10 మి.లీ రూ.160 నుంచి రూ.4000 ధర పలికే అత్తర్లు ఈ పండగ సీజన్లో వెనువెంటనే అమ్ముడవుతున్నాయని ఇక్కడి వ్యాపారులు చెబుతున్నారు.
HYD, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల BRS శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు మాజీ సీఎం KCR ఫోకస్ పెట్టారని ఆ పార్టీ నేతలు తెలిపారు. ఇందులో భాగంగా ఏప్రిల్ 13న చేవెళ్లలో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేశారని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో BRS ఓడిపోయినా, కొందరు కీలక నేతలు పార్టీని మోసం చేసి వెళ్లినా సరే BRSను గెలిపిస్తామని ఇటీవల ఆ పార్టీ MLAలు అన్నారు. మరి KCR సభతో BRS పుంజుకుంటుందా? మీ కామెంట్?
HYD మూసీ నది వెంట 125 చదరపు కిలోమీటర్ల మేర ప్రత్యేక మాస్టర్ ప్లాన్ సిద్ధం కానుంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా జోన్లను నిర్ణయిస్తూ ఆరు నెలల్లో సిద్ధం చేయాలని MRDCLను ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే మూసీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. మూసీ డెవలప్‌మెంట్ కోసం రూ.5,813 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. మూసీకి ఇరువైపులా సుమారు 1KM మేర మాస్టర్ ప్లాన్ పరిధిలోకి రానుంది.
Sorry, no posts matched your criteria.