India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని HYD ఎన్నికల అధికారి, GHMC కమిషనర్ రోనాల్డ్ రాస్ సంబంధిత అధికారులకు సూచించారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ హాల్‌లో పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారులు, ఏఆర్‌ఓలకు పోస్టల్ బ్యాలెట్‌పై శిక్షణ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ అధికారులకు సూచనలు చేశారు.
రూ.3 కోట్ల విలువైన వజ్రాన్ని రూ.30 లక్షలకే విక్రయిస్తామని ప్రజలను నమ్మిస్తున్న ముఠాను HYD పాతబస్తీ హబీబ్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు.సౌత్‌వెస్ట్ DCP ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపిన వివరాలు.. ముంబైకి చెందిన బాలచంద్ర తులేరే(48), పాతబస్తీకి చెందిన ముస్తాబా అహ్మద్‌ఖాన్, సాజిద్ అలీతో కలిసి నకిలీ వజ్రం విక్రయించేందుకు గురువారం మల్లేపల్లికి వచ్చారు.స్థానికుల సమాచారంతో పోలీసులు వారిని పట్టుకున్నారు.
గ్రేటర్ HYDలో కాంగ్రెస్ బలోపేతానికి ఆ పార్టీ అధిష్ఠానం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే పలువురు కార్పొరేటర్లు ఆ పార్టీలో చేరారు. ఉమ్మడి RR జిల్లాలోని అనేక కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను సైతం కాంగ్రెస్ హస్తగతం చేసుకోగా ఈనెల 30న GHMC మేయర్ గద్వాల విజయలక్ష్మి సహా మరికొందరు కార్పొరేటర్లు ఆ పార్టీలో చేరనున్నారు. దీంతో MIM సహకారంతో GHMCని తమ చేతిలోకి తీసుకోవాలని అధిష్ఠానం నిర్ణయించింది.
HYD ఆధారిత స్పేస్ స్టార్టప్ స్కై రూట్ ఏరోస్పేస్ తన విక్రమ్-1 రాకెట్ కక్షలో స్టేజ్-2 పరీక్ష విజయవంతమైంది. ఆర్బిటాల్ రాకెట్‌కు కలాం-250గా పేరు పెట్టింది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్‌లో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ప్రొపల్షన్ టెస్ట్‌బెడ్ వద్ద నిర్వహించినట్లు తెలిపింది. HYD నగరంలో ఏరోస్పేస్ స్టార్ట్ అప్ స్కై రూట్ పై పలుమార్లు మాజీ మంత్రి KTR ప్రశంసలు కురిపించారు.
ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, GHMC కమిషనర్ రోనాల్డ్ రాస్ అన్నారు. గురువారం బల్దియా ప్రధాన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. 18 సం.లు నిండిన వారందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు. కాని వారు ఏప్రిల్ 15 వరకు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఓటరు జాబితాలో పేరు ఉన్నదీ, లేనిదీ కూడా చెక్ చేసుకోవాలని కమిషనర్ సూచించారు. వెబ్సైట్: https://voters.eci.gov.in
తాను ఎక్కడున్నా ఓ కన్ను కొడంగల్‌పైనే ఉంటుందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నేపథ్యంలో గురువారం ఓటు వేసి అనంతరం కొడంగల్‌లోని తన నివాసం వద్ద అభిమానులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో కొడంగల్ నుంచి కాంగ్రెస్‌కు 50 వేల మెజార్టీ ఇవ్వాలని కోరారు. నియోజకవర్గానికి పరిశ్రమలు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు.
BJP గోషామహల్ MLAను రాజాసింగ్‌ను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. సాయంత్రం ఆయన చెంగిచర్లకు వెళ్తానని ప్రకటించారు. శాంతిభద్రతల దృష్ట్యా రాజాసింగ్‌ను ఆయన నివాసం వద్ద అడ్డుకొన్నారు. పోలీసుల తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ‘కేసీఆర్ పాలనకు, రేవంత్ రెడ్డి పాలనకు తేడా లేదు. కేసీఆర్ హయాంలో జరిగినట్లు.. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కూడా హిందువులపై దాడులు జరుగుతున్నాయి’ అంటూ రాజాసింగ్ మండిపడ్డారు.
HYD, ఉమ్మడి RR జిల్లాల పరిధిలో మరో రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గత 24 గంటల్లో బోరబండ 40.6, మొయినాబాద్ 40.6, కందుకూరు 40.5, యాలాలలో 40.5 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయినట్లుగా TSDPS తెలిపింది. BP, షుగర్, చర్మ వ్యాధులు ఉన్నవారు 11AM నుంచి 4PM మధ్య బయటకురాకపోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. వడదెబ్బ తాకే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ లా కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు ప్రకటనలో తెలిపారు. ఐదేళ్ల బీబీఏ ఎల్ఎల్బీ, ఐదేళ్ల బీకామ్ ఎల్ఎల్బీ, మూడేళ్ల ఎల్ఎల్బీ, మూడేళ్ల ఎల్ఎల్బీ ఆనర్స్ కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.
HYD, RR, MDCL,VKB జిల్లాల రైల్వే ప్రయాణికులకు SCR గుడ్ న్యూస్ తెలిపింది. సికింద్రాబాద్, HYD, బేగంపేట, లింగంపల్లి, హైటెక్ సిటీ, వికారాబాద్ స్టేషన్లలో QR కోడ్ ద్వారా నగదు చెల్లింపుల సౌకర్యాన్ని ఏర్పాటు చేసినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలియజేశారు. బోర్డుపై ఉండే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి టికెట్ కొనుగోలు చేసుకోవచ్చని సూచించారు. త్వరలో మిగతా స్టేషన్లలో అందుబాటులోకి తెస్తామన్నారు.
Sorry, no posts matched your criteria.