Hyderabad

News March 27, 2024

HYD: మోసం చేసి కాంగ్రెస్ గెలుస్తుందా?: మల్లారెడ్డి

image

మేమే గెలుస్తామని కాంగ్రెసోళ్లు అంటున్నారని, మళ్లీ ఎట్లా గెలుస్తారని, మోసం చేసి గెలుస్తారా అని మేడ్చల్ MLA మల్లారెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలకు కౌంటర్ ఇస్తూ ఈరోజు మల్కాజిగిరిలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్, BJP నేతలు ఏం ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు. మల్కాజిగిరిలో BRSదే గెలుపు అని ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడ కాంగ్రెస్‌కు కేడర్ లేదని ఎద్దేవా చేశారు.

News March 27, 2024

HYD: ఆక్రమణలు గుర్తించేందుకు మూసీలో డ్రోన్లతో సర్వే

image

మూసీలో ఆక్రమణలు గుర్తించే పనిపై మూసీ పరీవాహక ప్రాంత అభివృద్ధి సంస్థ (MRDCL) దృష్టి సారించింది. నదికి రెండువైపులా 2 కి.మీ. పరిధిలో డ్రోన్లను ఉపయోగించి ఎక్కడెక్కడ భవనాలు, ఇతర నిర్మాణాలున్నాయో గుర్తిస్తారు. FTLతో పాటు బఫర్ జోన్‌లో ఎన్ని ఆక్రమణలున్నాయో సర్వే చేస్తారు. అవసరమైతే జియో ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (GSI)తో అనుసంధానం చేసి ఆక్రమణలపై దృష్టి సారించనున్నారు.

News March 27, 2024

హైదరాబాద్: ఈ ఆటో.. సీఎం క్యాబ్!

image

ప్రయాణికులు వేసవి తాపానికి గురి కాకూడదని ఓ ఆటో డ్రైవర్ తన వాహనంపై ఏకంగా నారు పెంచుతూ చల్లగా ఉంచుతున్నాడు. HYDలో తిరుగుతున్న ఈ ఆటో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అల్వాల్‌కు చెందిన ఓం ప్రకాశ్‌ తన ఆటోపై వరి విత్తనాలు వేసి, నీళ్లు చల్లుతూ ఆటో లోపల చల్లగా ఉండేలా జాగ్రత్త పడుతూ ప్రయాణికుల ఆదరణ పొందుతున్నాడు. సీఎం క్యాబ్ (కామన్ మ్యాన్) పేరును ఆటో వెనుక రాసుకొని తిరుగుతూ చల్లని సేవలు అందిస్తున్నాడు.

News March 27, 2024

ఓయూలో దరఖాస్తుల ఆహ్వానం

image

ఓయూ క్యాంపస్‌లోని ఆంధ్ర మహిళా సభ కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అండ్ మీడియా ఎడ్యుకేషన్‌లో వివిధ సర్టిఫికెట్ కోర్సులకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ఛైర్‌పర్సన్ డాక్టర్ రమాప్రభ తెలిపారు. ఆరు వారాల న్యూస్ రీడింగ్, వాయిస్ ఓవర్, డబ్బింగ్, యాక్టింగ్ తదితర సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలకు ఏప్రిల్ 1 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News March 27, 2024

మల్కాజిగిరిపై అందరి గురి..!

image

మల్కాజిగిరి MP స్థానంపై BRS, కాంగ్రెస్, BJP స్పెషల్ ఫోకస్ పెట్టాయి. BJP ఈటలను బరిలోకి దించగా కాంగ్రెస్ సునీతారెడ్డిని పోటీలో నిలబెట్టింది. BRS వ్యూహాత్మకంగా లోకల్ క్యాండిడేట్ రాగిడి లక్ష్మారెడ్డిని బరిలోకి దింపింది. ఇప్పటికే మల్కాజిగిరిలో PM మోదీ రోడ్ షో చేయగా KCR, రేవంత్ రెడ్డి సైతం ఇక్కడ ప్రచారం చేస్తారని టాక్. 3 పార్టీలూ మల్కాజిగిరిలో గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. దీనిపై మీ కామెంట్?

News March 27, 2024

సికింద్రాబాద్: ప్రత్యేక రైళ్ల పొడిగింపు

image

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా వివిధ మార్గాల్లో ఏర్పాటు చేసిన 20 ప్రత్యేక రైళ్లను జూన్ చివరి వరకు పొడిగించినట్లు సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వే CPRO రాకేశ్ తెలిపారు. ఈ మేరకు సికింద్రాబాద్-అగర్తల, సికింద్రాబాద్ డిబ్రూగర్, తిరుపతి-సంత్రాగచ్చి, హైదరాబాద్-గోరఖ్‌పూర్, సికింద్రాబాద్-రెక్సాల్, HYD-రెక్సాల్, సికింద్రాబాద్-దానాపూర్, HYD-జైపూర్ మధ్య ప్రత్యేక రైళ్లు జూన్ నెలాఖరు వరకు రాకపోకలు సాగించనున్నాయి.

News March 27, 2024

గ్రేటర్ HYDలో 38.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

image

గ్రేటర్ హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 38.2 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 24.5 డిగ్రీలు నమోదైనట్లు HYD వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. అలాగే గాలిలో తేమ 30 శాతంగా ఉందన్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా నగరవాసులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. బయటకు వెళ్లేటప్పుడు గొడుగుతో వెళ్లాలని సూచిస్తున్నారు.

News March 27, 2024

HYD: ఈనెల 31 వరకు దరఖాస్తుల స్వీకరణ

image

హైదరాబాద్‌ జిల్లాలో 2024లో గ్రూప్‌–1 సర్వీసెస్‌ పరీక్ష రాసే మైనారిటీ అభ్యర్థులకు ఉచిత కోచింగ్‌ దరఖాస్తులు స్వీకరణ గడువును మార్చి 31 వరకు పొడిగించినట్లు జిల్లా మైనారిటీ సంక్షేమాధికారి మహమ్మద్‌ ఇలియాస్‌ అహ్మద్‌ మంగళవారం తెలిపారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు నాంపల్లి హజ్‌హౌస్‌ భవనంలోని 6వ అంతస్తులోని జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

News March 27, 2024

HYD: తాగునీటికి ఇబ్బందులు లేవు: సీఎస్‌

image

రాష్ట్రంలోని మూడు ప్రధాన రిజర్వాయర్లలో సరిపడా నీటి లభ్యత ఉందని, వేసవిలో తాగునీటికి ఇబ్బందులు లేవని సీఎస్‌ శాంతికుమారి స్పష్టం చేశారు. రాష్ట్రంలో తాగునీటి సరఫరాపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాగునీటి సమస్య తలెత్తకుండా ‘సమ్మర్‌ యాక్షన్‌ ప్లాన్‌’కు నిధులు విడుదల చేశామని చెప్పారు. HYDలో ఈ వేసవికి నీటి ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు.

News March 27, 2024

HYD: భిక్షాటన చేస్తున్న వారిని తరలించిన అధికారులు 

image

భిక్షాటనతో చిన్నారుల జీవితాలను నాశనం చేయొద్దని హైదరాబాద్‌ కలెక్టర్‌ అనుదీప్‌ అన్నారు. నగరంలో భిక్షాటన చేస్తున్న వీధి బాలలు, వారి తల్లులను ప్రత్యేక డ్రైవ్‌ ద్వారా గుర్తించారు. HYD కాచిగూడ నింబోలి అడ్డలోని జువైనల్‌ బాలికల హోం నుంచి వారి ప్రాంతాలకు తరలించే కార్యక్రమాన్ని కలెక్టర్‌ జెండా ఊపి ప్రారంభించారు. 19 మంది చిన్నారులు, ఆరుగురు తల్లులను వారి గ్రామాలకు తరలించామన్నారు.