India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు 154 అగ్ని ప్రమాద కేసులు విచారణ ప్రారంభం కాగా.. 71 కేసుల్లో జరిమానాలు, 56 కేసుల్లో న్యాయస్థానం మార్పులు చేసి సమర్పించాలని సూచించింది. 18 కేసులు వేర్వేరు కోర్టుల్లో పెండింగ్‌లో ఉండగా..9 కేసులను ఉపసంహరించుకున్నారు. HYD పరిధిలో 36 మందికి ఉల్లంఘన నోటీసులు, 31 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్టు వెబ్ సైట్‌లో పేర్కొన్నారు.
HYDలోని హిమాయత్‌నగర్, నారాయణగూడ, కాచిగూడ, అమీర్‌పేట్, ఉప్పల్, బాటసింగారం, హయత్‌నగర్ తదితర ప్రాంతాల్లో బస్ షెల్టర్లు అందుబాటులో లేవు. దీంతో వృద్ధులు, మహిళలు, చిన్నారులు, విద్యార్థులు 43 డిగ్రీలకు పైగా దంచి కొడుతున్న మండే ఎండలో నిలబడి అలసిపోతున్నారు. ఏర్పాటు చేసిన చోటే అధికంగా ఉండడంతో పలుచోట్ల ఖాళీగా దర్శనమిస్తున్నాయి. బస్ షెల్టర్లు అవసరమైన చోట ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.
HYD, RR, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో తూనీక కొలతల శాఖలో లైసెన్స్ హోల్డర్ల నియామకం అంతంత మాత్రంగానే జరుగుతుందనే ఆరోపణలు ఉన్నాయి. మూడు జిల్లాల్లో కలిపి మొత్తం 30 మందికి పైగా సిబ్బంది లేకపోవడం గమనార్హం. దీంతో తూనికలపై నగరంలోని అనేక చోట్ల తనిఖీలు కరవయ్యాయి. లైసెన్స్ లేకుండానే అనేక దుకాణాల్లో విచ్చలవిడిగా బరువు కొలిచే యంత్రాలను ఉపయోగిస్తున్నారని, వాటికి గ్యారంటీ ఏంటని వినియోగదారులు వాపోతున్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో BRS అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గెలుపే లక్ష్యంగా ఈనెల 13న చేవెళ్లలో నిర్వహించే KCR భారీ బహిరంగ సభ దద్దరిల్లాలని BRS ఎమ్మెల్యేలు అన్నారు. మంగళవారం చేవెళ్లలోని ఫరా ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్‌ను చేవెళ్ల MLA కాలే యాదయ్య ఆధ్వర్యంలో MLA సబితా ఇంద్రారెడ్డి, అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, MLA టి.ప్రకాశ్ గౌడ్, MLC వాణిదేవి తదితరులు పరిశీలించారు.
ఉస్మానియా యూనివర్సిటీలోని అన్ని డిగ్రీ కోర్సుల రివాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. బీఏ, బీబీఏ, బీకామ్, బీఎస్సీ, బీఎస్సీ హానర్స్ తదితర కోర్సుల మొదటి, మూడు, ఐదో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల రివాల్యుయేషన్ ఫలితాలను విడుదల చేశామని చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు.
మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో 2009లో కాంగ్రెస్, 2014లో TDP, 2019లో కాంగ్రెస్ గెలిచాయి. 2014, 2019లో రెండో స్థానానికి BRS పరిమితమైంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఎంపీ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో BRS క్లీన్ స్వీప్ చేసింది. క్యాడర్ కూడా బలంగా ఉంది. గతంలో 2 సార్లు పార్టీ ఓడిపోయిందని, ఈసారి తప్పకుండా BRS గెలుస్తుందని ఆ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ధీమాగా ఉన్నారు. మీ కామెంట్?
HYDలో భూగర్భ జలాల మట్టం రోజురోజుకు పడిపోతోంది. 2023 సంవత్సరంతో పోలిస్తే ఇప్పుడు మాసబ్ ట్యాంక్ 5.08 మీటర్లు, కుల్సుంపుర 1.87, బహదూర్‌పుర 0.24, చార్మినార్ 2.34, నాంపల్లి 2.53, ఎర్రగడ్డ 0.25, ఖైరతాబాద్ 0.93, మారేడ్‌పల్లి 0.69, తిరుమలగిరి 1.29 మీటర్ల నీటి మట్టం తగ్గినట్లుగా భూగర్భ జల శాఖ అధికారులు పేర్కొన్నారు. నీటిని వృథా చేయొద్దని సూచించారు. ఇప్పటికే గ్రేటర్ HYDలో నీటి ట్యాంకర్ల వాడకం పెరిగింది.
HYDలో రేషన్ దుకాణాల్లో సరుకుల పంపిణీ ప్రారంభమైంది. హయత్‌నగర్, వనస్థలిపురం, ఉప్పల్, హబ్సిగూడ, తార్నాక లాంటి అనేక ప్రాంతాల్లో సోమవారం నుంచే రేషన్ బియ్యం, గోధుమలు, చక్కెర లబ్ధిదారులకు అందజేశారు. గతంలో ప్రతి నెల 7వ తేదీ నుంచి 15 వరకు రేషన్ దుకాణాల్లో సరుకు కోసం క్యూ కట్టాల్సిన పరిస్థితి ఉండేది. ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకొన్న పౌరసరఫరాల శాఖ 1వ తేదీ నుంచే పంపిణీకి శ్రీకారం చుట్టింది.
లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజధానిలో అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి, హైదరాబాద్‌లో అభ్యర్థులు సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రజలతో మమేకం అవుతున్నారు. ప్రజాఆశీర్వాదం అంటూ బీజేపీ, ప్రజాపాలన అంటూ కాంగ్రెస్, కేంద్రంలో తెలంగాణ గళం పేరిట బీఆర్ఎస్ నేతలు ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు. మూడు ప్రధాన పార్టీల్లో అభ్యర్థులు బలంగా ఉండడంతో తీవ్ర పోటీ నెలకొంది.
ఓ కార్పొరేటర్, మరో మహిళ వేధింపుల కారణంగా మనస్తాపానికి గురై వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన నాగోల్ PS పరిధిలో జరిగింది. శ్రీనివాసకాలనీలో నివాసం ఉండే బాలవర్ధన్ రెడ్డి తన ఆత్మహత్యకు భాగ్య, BJP కార్పొరేటర్ కారణమని సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Sorry, no posts matched your criteria.