India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పేదలకు బ్యాంక్ ఖాతాలు ఎందుకని హేళన చేశారని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం పేదలు దాదాపు రూ.2 లక్షల కోట్లు పొదుపు చేశారని తెలిపారు. గతంలో నిరర్ధక ఆస్తులు చాలా ఉండేవని, బీజేపీ ప్రభుత్వం వచ్చాక 55 కోట్ల కొత్త బ్యాంకు ఖాతాలు ఇచ్చామని తెలిపారు.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జీఆర్పీ, RPF పోలీసులు కలిసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో చేపట్టిన తనిఖీల్లో రూ.37.50 లక్షల నగదు పట్టుబడింది. పోలీసులు తెలిపిన వివరాలు.. తమిళనాడుకు చెందిన లక్ష్మణ్ రామ్ బ్యాగులో నగదు గుర్తించిన పోలీసులు సరైన పత్రాలు లేకపోవడంతో సీజ్ చేసినట్లు తెలిపారు. ఆదాయ శాఖ అధికారులకు నగదు అప్పజెప్పినట్లు GRP ఇన్‌స్పెక్టర్ సాయి ఈశ్వర్ గౌడ్ పేర్కొన్నారు.
గ్రేటర్ HYDలో గ్యాస్ సిలిండర్లపై అధిక ధరలు వసూలు చేస్తే తమకు ఫిర్యాదు చేయాలని పౌరసరఫరాల శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ DT మాచన రఘునందన్ తెలిపారు. గ్యాస్ డోర్ డెలివరీ ఆలస్యం చేయడంతో వినియోగదారులే డీలర్ల వద్దకు వెళ్లి తెచ్చుకోవాల్సిన పరిస్థితి పలుచోట్ల ఏర్పడడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రిటైల్ ధరకు రూ.1 అధికంగా అడిగినా అక్కడే నిలదీయాలని, వినకుంటే తమకు Xలో ఫిర్యాదు చేసినా స్పందిస్తామన్నారు.
టీపీసీసీ అధికార ప్రతినిధి సామ రామ్మోహన్ రెడ్డికి కాంగ్రెస్.. కీలక పదవిని అప్పగించింది. కాంగ్రెస్ మీడియా, కమ్యూనికేషన్ వ్యవహారాల ఛైర్మన్‌గా ఆయనను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ సందర్భంగా సామ రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో పదవిని అప్పగించిన కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి, సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
పార్లమెంట్ ఎన్నికల కోసం మజ్లిస్ పార్టీ దూకుడు పెంచింది. ఇప్పటికే పాదయాత్రలతో ముందస్తు ప్రచారానికి శ్రీకారం చుట్టిన మజ్లిస్ పార్టీ.. రంజాన్ మాసం ఇఫ్తార్ విందులను సైతం సద్వినియోగం చేసుకుంటోంది. రోజుకో డివిజన్‌లో ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందులో ఆ పార్టీ అధినేత అసదుద్దీన్, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు హాజరుకావడం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈసారి సైతం పోలింగ్ పెంపుపై దృష్టి సారించింది.
గతంలో చీమచింత కాయలు గ్రామాల్లో విరివిగా దొరికేవి. చెట్టుకున్న చీమచింత కాయలను రాళ్లతో కొట్టి మరీ తినేవాళ్లు. నాటి తీపి జ్ఞాపకాలే వేరు. ఇప్పుడు గ్రామాల్లోనూ కనిపించడం లేదు. కానీ HYDలోని ఉస్మానియా యూనివర్సిటీ రహదారి, ఉప్పల్ చెరువు కట్ట, ఎల్బీనగర్ ప్రధాన రహదారుల్లో తోపుడు బండ్లపై చీమచింత కాయలు చూస్తుంటే నోరూరుతుందని, చీమ చింతకాయలు కొనుక్కొని మరీ పలువురు రుచి చూస్తున్నారు.
HYD ఎల్బీనగర్, రాజేంద్రనగర్, అత్తాపూర్, గచ్చిబౌలి, నాగోల్, చాంద్రాయణగుట్ట, హయత్‌నగర్ తదితర చోట్ల రోడ్లపై వాహనాల వేగాన్ని కంట్రోల్ చేసేందుకు ఇలా రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు చేశారు. అయితే తక్కువ దూరంలో రెండు, మూడు చోట్ల ఏర్పాటు చేయడంతో పాటు అధిక మందంతో ఉండడంతో ఇబ్బందులు కలుగుతున్నాయని పలువురు వాహనదారులు వాపోతున్నారు. వయసు పెరిగేకొద్దీ వెన్నుపూస సమస్యలు వస్తున్నాయంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి..?
ఉద్యోగాలు ఇప్పిస్తానని ఓ వ్యక్తి నిరుద్యోగుల నుంచి రూ.10 లక్షలు తీసుకుని పరారైన ఘటన HYDలో జరిగింది. బాధితులు తెలిపిన వివరాలు.. విజయవాడకు చెందిన మహమ్మద్ ఇలియాజ్ ‘ESIలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి, నకిలీ ఆర్డర్ కాపీలు ఇచ్చి గండీడ్, పరిగి మండలాలకు చెందిన నిరుద్యోగుల నుంచి రూ.10 లక్షలు తీసుకొని పరారయ్యాడు. దీంతో HYD పంజాగుట్ట PSలో బాధితులు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. తమకు న్యాయం చేయాలని కోరారు.
మల్కాజిగిరి MP సెగ్మెంట్‌లో ఇప్పటి వరకు BRS గెలుపొందలేదు. తెలంగాణ ఉద్యమ వేడి ఉన్న రోజుల్లోనూ, KCR హవా నడుస్తున్న సమయంలోనూ ఇక్కడ TDP, కాంగ్రెస్ అభ్యర్థులే గెలిచారు. దీంతో ఈసారి ఎలాగైనా గెలవాలని గులాబీ పార్టీ శ్రమిస్తోంది. ఈ దశలోనే BRS అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి లోకల్ క్యాండిడేట్ అని.. సునీతామహేందర్ రెడ్డి (కాంగ్రెస్), ఈటల రాజేందర్ (BJP) నాన్ – లోకల్ అని BRS శ్రేణులు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి.
HYD హబ్సిగూడలోని NGRIలో సమ్మర్ ఇంటర్న్‌షిప్-2024 కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. జియో ఫిజిక్స్, జియాలజీ, ఎర్త్ సైన్సెస్ విభాగాల్లో చదువుతున్న పోస్ట్ గ్రాడ్యుయేట్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు.NGRI రీసెర్చ్ ప్రాజెక్టులో 6-8 వారాలపాటు ఉంటుందని, షేరింగ్ బేసిస్ ఉచిత వసతి ఉంటుందన్నారు. వెబ్ సైట్ https://rectt.ngri.res.in/TrainingInterns/ ద్వారా దరఖాస్తు చేసుకోండి.
Sorry, no posts matched your criteria.