India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వికారాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం మధ్యాహ్నం దారుణం చోటుచేసుకుంది. BRS వికారాబాద్ మండల అధ్యక్షుడు కమలాకర్ రెడ్డిపై కొంతమంది వ్యక్తులు కత్తితో దాడి చేసినట్లు సమాచారం. ఈ దాడిలో గాయపడిన ఆయణ్ని జిల్లా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగా, ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. చికిత్స పొందుతున్న కమలాకర్ రెడ్డిని మాజీ ఎమ్మెల్యే ఆనంద్ పరామర్శించారు.
✓రైలు బయలుదేరే సమయంలో, స్టేషన్ చేరుకునేటప్పుడు రైళ్లు ఎక్కొద్దు, దిగే ప్రయత్నం చేయొద్దు
✓నిషేధిత ప్రాంతం నుంచి రైల్లోకి ప్రవేశించొద్దు
✓ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, రోడ్ ఓవర్ బ్రిడ్జిలను వాడాలి
✓ట్రాక్ దగ్గర నడిచే సమయంలో ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు మొబైల్ ఫోన్లను ఉపయోగించొద్దు
✓రైల్వే ట్రాక్ పరిసర ప్రాంతాల్లో సెల్ఫీ, ఫొటో గ్రఫీ తీసుకోవడంపై నిషేధం ఉంది. •వీటిని పాటించాలని SCR ట్వీట్ చేసింది.
అగ్రికల్చర్ స్టడీ చేయాలనుకునే వారికి HYD రాజేంద్రనగర్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్‌లో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ మేనేజ్‌మెంట్, PGD ఇన్ అగ్రి వేర్ హౌసింగ్ మేనేజ్‌మెంట్ కోర్సుల ప్రవేశాల దరఖాస్తు గడువు మార్చి 31న ముగుస్తుందని తెలిపారు. మిగతా వివరాలకు వెబ్ సైట్ www.manage.gov.in చూడండి.
రాష్ట్ర రాజధానిలో హోలీ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు చేపట్టారు. శాంతి భద్రతలకు భంగం కలిగించకుండా హోలీ పండుగ జరుపుకోవాలని పోలీసులు కోరుతున్నారు. బ్లాక్‌లో మద్యం అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పండుగ సందర్భంగా పోలీసులు ప్రతి వీధిలో రెక్కీ నిర్వహిస్తున్నారు.
బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన ఓ యువకుడిపై పోక్సో కేసు నమోదైంది. మధురానగర్ పోలీసులు తెలిపిన వివరాలు..HYDయూసుఫ్‌గూడ పరిధి కార్మికనగర్ వాసి సాయిఈశ్వర్ కారు డ్రైవర్. ఓ బాలికను పెళ్లిచేసుకుంటానని చెప్పి తన తల్లితో కలిసి బాలిక ఇంటికి వెళ్లి అడిగాడు. దీంతో బాలిక తల్లి తిరస్కరించింది. అయినప్పటికీ బాలిక వెంట పడుతూ నమ్మించి అత్యాచారం చేయగా ఆమె గర్భం దాల్చింది. బాలిక కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదైంది.
ఆహార కల్తీలపై ఫిర్యాదులు సులభతరం చేసేందుకు GHMC అధికారులు టోల్ ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీతో పాటు కల్తీ విషయమై గ్రేటర్ పరిధిలోని వినియోగదారులు 040-21111111 నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు. అదేవిధంగా ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ చేసిన తర్వాత రేటింగ్ ఇచ్చే ఆప్షన్ పక్కనే ఫిర్యాదు నంబర్‌తో పాటు ఫీడ్ బ్యాక్ బాక్స్ ఉండేలా కొత్త నిబంధనలను అమలులోకి తీసుకొచ్చారు.
గుర్తుతెలియని వాహనం ఢీకొని విశ్రాంత ఆర్మీ ఉద్యోగి దుర్మరణం చెందాడు. HYD కుషాయిగూడ ఠాణా ఎస్ఐ వెంకన్న తెలిపిన వివరాలు.. మేడ్చల్ జిల్లా మేడిపల్లికి చెందిన బద్రి శివకోటయ్య(48) మాజీ సైనికోద్యోగి. ఆదివారం ద్విచక్ర వాహనంపై మౌలాలి పరిధి హెచ్‌బీ కాలనీ వద్దకు రాగానే వెనక నుంచి వచ్చిన గుర్తు తెలియని వాహనం అతడిని ఢీకొట్టడంతో తీవ్రగాయాలై అక్కడిక్కడే మృతిచెందాడు. కేసు నమోదైంది.
మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక్క అసెంబ్లీ సీటు కూడా కాంగ్రెస్ గెలవదని, అన్నీ BRSయే గెలిచి చూపిస్తామని గతంలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా ఉన్నప్పుడు మల్లారెడ్డి అన్నారు. అన్నట్టుగానే మొత్తం 7 స్థానాల్లో BRSని గెలిపించి చూయించారు. మల్కాజిగిరి గడ్డ BRS అడ్డా అని చెబుతున్న ఆయన.. మరి పార్లమెంట్ ఎన్నికల్లో BRS అభ్యర్థిని గెలిపించి తన మార్క్ చూయిస్తారా లేదా చూడాలి. మీ కామెంట్?
ఇటీవల ఆస్ట్రేలియాలో హత్యకు గురైన హైదరాబాద్ మహిళ శ్వేత అంత్యక్రియలు ఆదివారం ముగిశాయి. ఆస్ట్రేలియా నుంచి నగరానికి చేరుకున్న శ్వేత మృతదేహాన్ని ఏఎస్‌రావు నగర్ డివిజన్ బృందావన్ కాలనీలోని ఆమె తల్లిదండ్రులను నివాసానికి తరలించారు. కుమార్తె మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం మల్లాపూర్‌లోని వైకుంఠధామంలో అంత్యక్రియలు పూర్తి చేశారు.
డ్రగ్స్ పార్శిళ్లు వచ్చాయని సైబర్ నేరగాళ్లు పోలీసుల తరహాలో మాట్లాడుతూ మోసగిస్తున్న నేపథ్యంలో పలు జాగ్రత్తలు సూచిస్తూ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ X వేదికగా పలు సూచనలు చేశారు. డ్రగ్స్ పార్శిళ్లు వచ్చాయని ఫోన్ కాల్స్, ఐవీఆర్ కాల్స్ వస్తే స్పందించొద్దని సజ్జనార్ సూచించారు. ఒకవేళ ఇలాంటి ఉదంతాల్లో మోసపోతే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 1930కి ఫిర్యాదు చేయాలన్నారు. కాగా HYDలో ఇటీవల సైబర్ మోసాలు ఎక్కువయ్యాయి.
Sorry, no posts matched your criteria.