India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ మహిళ వద్ద నుంచి రూ.70 లక్షలు వసూలు చేసి మోసగించిన వ్యక్తిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. కృష్ణా జిల్లాకు చెందిన ద్రొనదుల రాజేశ్(40) ఆన్‌లైన్ ట్రేడర్. మ్యాట్రిమోని ద్వారా ఓ మహిళను పరిచయం చేసుకున్న ఇతడు పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ.70 లక్షలు తీసుకొని ముఖం చాటేశాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదైంది.
రంజాన్ సందడి మొదలుకావడంతో ఓల్డ్ సిటీ కిక్కిరిసిపోతోంది. మెహిదీపట్నం, టోలిచౌకి, నాంపల్లి, చార్మినార్ తదితర ప్రాంతాల్లోని మార్కెట్లలో అర్ధరాత్రి జనాలు కిటకిటలాడుతున్నారు. తక్కువ ఖర్చులో దొరికే వస్తువుల షాపింగ్ కోసం మహిళలు, నచ్చిన వంటకాలు ఆరగించేందుకు పురుషులు చలో చార్మినార్ అంటున్నారు. HYD వాసులే కాదు శివారు ప్రాంతాలతోపాటు నగరానికి వచ్చిన వారు, విదేశీయులు రంజాన్ వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు.
నగరంలో ఖరీదైన ఇళ్ల విక్రయాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆరంభంలో వీటి రిజిస్ట్రేషన్లు మరింత పెరిగాయి. రూ.కోటి అంతకంటే ఎక్కువ విలువైన గృహాల వాటా 2023లో 8 శాతం ఉంటే.. ఈ ఏడాది ఆరంభంలో ఏకంగా 14 శాతానికి పెరిగింది. స్థిరాస్తి ధరలు పెరగడమే ఇందుకు కారణమని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.
సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో మొదటి నుంచి కాంగ్రెస్ హవా కొనసాగింది. లోక్‌సభ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఎక్కువ సార్లు ఇక్కడ హస్తం అభ్యర్థులే గెలుపొందారు. 1957లో మొదటిసారి జరిగిన ఎన్నికల్లో పాగా వేసిన కాంగ్రెస్.. 11 సార్లు గెలిచింది. అలాగే బీజేపీ ఐదు సార్లు గెలిచింది. కాంగ్రెస్ జోరుకు 1991లో బీజేపీ అడ్డుకట్ట వేసింది. కాగా గత ఎన్నికల్లో కిషన్ రెడ్డి విజయం సాధించిన విషయం తెలిసిందే.
వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా HYD మాదాపూర్‌లోని శిల్పారామంలో ఈరోజు బెంగళూరు నుంచి విచ్చేసిన ప్రముఖ భరతనాట్య కళాకారిణి గుణశ్రీ నర్తన గణపతిమ్, రారావేణు, శృంగారలహరి, మరకతమణిమయ అంశాలను ప్రదర్శించి అలరించారు. HYD వాసి సుభాషిణి గిరిధర్ తన శిష్య బృందంచే భరతనాట్య ప్రదర్శనలో గణేశా, కార్తికేయ, నటేశ కౌతం, కాళీ కౌత్వం, నగుమోము, కాలై థూకి, తిల్లాన అంశాలను ప్రదర్శించి ఆకట్టుకున్నారు.
HYD మాదాపూర్‌లో ఈడీ సోదాలు ముగిశాయి. ఎమ్మెల్సీ కవిత ఆడపడుచు ఇంట్లో శనివారం ఉదయం నుంచి ఈడీ తనిఖీలు చేపట్టింది. 11 గంటల పాటు నిర్విరామంగా వివిధ పత్రాలు పరిశీలించిన ఈడీ అధికారులు.. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవిత మేనల్లుడు శరణ్ పాత్రపై ఆరా తీశారు. సౌత్ లాబీ డబ్బు లావాదేవీల్లో శరణ్ కీలక పాత్ర ఉన్నట్లు ఈడీ భావిస్తోంది.
సికింద్రాబాద్ MP బరిలో హేమాహేమీలు నిలిచారు. బీజేపీ నుంచి కిషన్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్, BRS అభ్యర్థిగా పద్మారావు గౌడ్ నిలిచారు. ముగ్గురికి ముగ్గురు బలమైన నేతలే. ఓటర్ల నాడీ తెలిసిన వారే కావడం విశేషం. సికింద్రాబాద్‌లో రెండోసారి గెలిచి తన సత్తా చాటడానికి కిషన్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. దానం, పద్మారావు గౌడ్ ఈసారి ఎంపీగా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
ఇటీవల కాలంలో రాష్ట్రంలో ACB దాడుల్లో వరుసగా ప్రభుత్వాధికారులు పట్టుబడుతున్నారు. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. ACB DG సీవీ ఆనంద్ ప్రస్తుతం తన ఉద్యోగాన్ని ఆస్వాదిస్తున్నారని ట్వీట్ చేశారు. దీనికి సీవీ ఆనంద్ స్పందిస్తూ.. “తప్పు చేసిన అధికారులను పట్టుకుని జైలుకు పంపడం అత్యంత కఠినమైన జాబ్. ప్రభుత్వాధికారులు ఎలాంటి అవినీతికి పాల్పడకుండా ప్రజాసేవ చేస్తారని ఆశిస్తున్నాను” అని అన్నారు.
ప్రజా పంపిణీలో అక్రమాలకు పాల్పడి, మోసం చేయడం నేరం అని పౌర సరఫరాల శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీ మాచన రఘునందన్ స్పష్టం చేశారు. శనివారం ఆయన శేరిలింగంపల్లి తారానగర్ చౌక దుకాణంలో జరిగిన అవకతవకల దృష్ట్యా చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ.. కొందరు డీలర్లు రేషన్ దుకాణాలను ఇష్టారాజ్యం నిర్వహిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి గెలిచిన దానం నాగేందర్, సికింద్రాబాద్ నుంచి గెలిచిన తీగుళ్ల పద్మారావు BRSలో ఉండి సన్నిహితంగా ఉన్నారు.కాగా ఇటీవల దానం కాంగ్రెస్‌లో చేరగా సికింద్రాబాద్ నుంచి ఎంపీ బరిలో ఉన్నారు. మరోవైపు BRSనుంచి పద్మారావు పోటీలో ఉండగా ప్రస్తుతం వీరు ప్రత్యర్థులుగా మారారు. ఇద్దరు MLAలు ఎంపీ బరిలో ఉండడం గమనార్హం. అయితే వీరిలో ఎవరు గెలిచినా ఉప ఎన్నికలు మాత్రం అనివార్యం కానున్నాయి.
Sorry, no posts matched your criteria.