India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
శ్రీ రామనవమికి భాగ్యనగరం ముస్తాబవుతోంది. 20 రోజుల ముందే ఆయా ఆలయాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. ధూల్‌పేటలో నిర్వహించే రాముడి శోభాయాత్రకు తరలిరావాలని రాజాసింగ్ పిలుపునిస్తున్నారు. ఏప్రిల్ 17వ తేదీన ఉదయం 11 గంటలకు ఆకాశ్‌పురి హనుమాన్ టెంపుల్ నుంచి యాత్ర ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. యాత్రను విజయవంతం చేయాలంటూ ఆయన అనుచరులు, అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
HYDలో దారుణఘటన వెలుగుచూసింది. మద్యానికి డబ్బులివ్వలేదని భార్యను చంపేశాడో భర్త. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జియాగూడలోని రహీంపురకాలనీకి చెందిన అబ్దుల్ సలీమ్, ఆస్మా ఫాతిమా దంపతులు. నిత్యం మద్యం సేవించి భార్యతో సలీమ్ గొడవపడేవాడు. మంగళవారం రాత్రి మందు తాగేందుకు డబ్బులివ్వాలని అడిగాడు. ఫాతిమా ఇవ్వకపోవడంతో గొంతునులిమి చంపేశాడని వెల్లడించారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామన్నారు.
HYDలో ఎన్నికల ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాల ద్వారా ఇప్పటివరకు రూ.2,57,05,390 నగదు, రూ.37,05,841 విలువైన ఇతర వస్తువులు, 1386.28 లీటర్ల అక్రమ మద్యంను సీజ్ చేసినట్లు GHMC కమిషనర్ రోనాల్డ్ రాస్ తెలిపారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి బుధవారం ఉదయం 6 గంటల వరకు నిర్వహించిన తనిఖీల్లో రూ.16,19,000 నగదు, 1,81,689 విలువ గల ఇతర వస్తువులు, 49.37 లీటర్ల అక్రమ మద్యం పట్టుబడిందని వెల్లడించారు
బండ్లగూడ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ మహమ్మద్ షకీర్ అలీ, SI వెంకటేశ్వర్, కానిస్టేబుల్ రమేశ్‌ను CP కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సస్పెండ్ చేశారు. జనవరిలో CRPF మహిళా కానిస్టేబుల్ కంప్లైంట్ విషయంలో అలసత్వం వహించారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై బాధితురాలు ఫిర్యాదు చేయగా.. విచారణ జరిపిన ఉన్నతాధికారులు సీపీకి నివేదిక అందించారు. నివేదిక ఆధారంగా సీఐ, ఎస్సై, కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు.
ఓ కార్మికుడు మృతిచెందిన ఘటన HYD KPHB PS పరిధిలో జరిగింది. SI సుమన్ తెలిపిన వివరాలు.. బాలానగర్ వాసి పవన్(35) ఫ్యాబ్రికేషన్ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. KPHB రోడ్ నం.1లోని ఐరిస్ షోరూమ్ షట్టర్ మరమ్మతులు చేసేందుకు వచ్చాడు. నిచ్చెన వేసుకుని మరమ్మతులు చేస్తుండగా షట్టర్ రాడ్డు హైటెన్షన్ విద్యుత్ తీగకు తగిలింది. దీంతో కరెంట్ షాక్‌కు గురై కింద ఇనుప రాడ్డుపై పడటంతో అది మెడకు గుచ్చుకొని మృతిచెందాడు.
ఉప్పల్‌లో ఈరోజు ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా మెట్రో శుభవార్త తెలిపింది. ఉప్పల్ స్టేడియం, నాగోల్, ఎన్.జీ.ఆర్.ఐ స్టేషన్లలో అర్ధరాత్రి మెట్రో అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. రాత్రి 12.15 గంటలకు మెట్రో ట్రైన్ ప్రారంభమై 1.10 గంటలకు చివరి స్టాప్‌కు చేరుకుంటుందని తెలిపారు. ఈ సౌకర్యాన్ని ఐపీఎల్ మ్యాచ్‌కు వచ్చేవారు వినియోగించుకోవాలని సూచించారు.
మేమే గెలుస్తామని కాంగ్రెసోళ్లు అంటున్నారని, మళ్లీ ఎట్లా గెలుస్తారని, మోసం చేసి గెలుస్తారా అని మేడ్చల్ MLA మల్లారెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలకు కౌంటర్ ఇస్తూ ఈరోజు మల్కాజిగిరిలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్, BJP నేతలు ఏం ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు. మల్కాజిగిరిలో BRSదే గెలుపు అని ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడ కాంగ్రెస్‌కు కేడర్ లేదని ఎద్దేవా చేశారు.
మూసీలో ఆక్రమణలు గుర్తించే పనిపై మూసీ పరీవాహక ప్రాంత అభివృద్ధి సంస్థ (MRDCL) దృష్టి సారించింది. నదికి రెండువైపులా 2 కి.మీ. పరిధిలో డ్రోన్లను ఉపయోగించి ఎక్కడెక్కడ భవనాలు, ఇతర నిర్మాణాలున్నాయో గుర్తిస్తారు. FTLతో పాటు బఫర్ జోన్‌లో ఎన్ని ఆక్రమణలున్నాయో సర్వే చేస్తారు. అవసరమైతే జియో ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (GSI)తో అనుసంధానం చేసి ఆక్రమణలపై దృష్టి సారించనున్నారు.
ప్రయాణికులు వేసవి తాపానికి గురి కాకూడదని ఓ ఆటో డ్రైవర్ తన వాహనంపై ఏకంగా నారు పెంచుతూ చల్లగా ఉంచుతున్నాడు. HYDలో తిరుగుతున్న ఈ ఆటో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అల్వాల్‌కు చెందిన ఓం ప్రకాశ్ తన ఆటోపై వరి విత్తనాలు వేసి, నీళ్లు చల్లుతూ ఆటో లోపల చల్లగా ఉండేలా జాగ్రత్త పడుతూ ప్రయాణికుల ఆదరణ పొందుతున్నాడు. సీఎం క్యాబ్ (కామన్ మ్యాన్) పేరును ఆటో వెనుక రాసుకొని తిరుగుతూ చల్లని సేవలు అందిస్తున్నాడు.
ఓయూ క్యాంపస్‌లోని ఆంధ్ర మహిళా సభ కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అండ్ మీడియా ఎడ్యుకేషన్‌లో వివిధ సర్టిఫికెట్ కోర్సులకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ఛైర్‌పర్సన్ డాక్టర్ రమాప్రభ తెలిపారు. ఆరు వారాల న్యూస్ రీడింగ్, వాయిస్ ఓవర్, డబ్బింగ్, యాక్టింగ్ తదితర సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలకు ఏప్రిల్ 1 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Sorry, no posts matched your criteria.