India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మల్కాజిగిరి MP స్థానంపై BRS, కాంగ్రెస్, BJP స్పెషల్ ఫోకస్ పెట్టాయి. BJP ఈటలను బరిలోకి దించగా కాంగ్రెస్ సునీతారెడ్డిని పోటీలో నిలబెట్టింది. BRS వ్యూహాత్మకంగా లోకల్ క్యాండిడేట్ రాగిడి లక్ష్మారెడ్డిని బరిలోకి దింపింది. ఇప్పటికే మల్కాజిగిరిలో PM మోదీ రోడ్ షో చేయగా KCR, రేవంత్ రెడ్డి సైతం ఇక్కడ ప్రచారం చేస్తారని టాక్. 3 పార్టీలూ మల్కాజిగిరిలో గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. దీనిపై మీ కామెంట్?
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా వివిధ మార్గాల్లో ఏర్పాటు చేసిన 20 ప్రత్యేక రైళ్లను జూన్ చివరి వరకు పొడిగించినట్లు సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వే CPRO రాకేశ్ తెలిపారు. ఈ మేరకు సికింద్రాబాద్-అగర్తల, సికింద్రాబాద్ డిబ్రూగర్, తిరుపతి-సంత్రాగచ్చి, హైదరాబాద్-గోరఖ్‌పూర్, సికింద్రాబాద్-రెక్సాల్, HYD-రెక్సాల్, సికింద్రాబాద్-దానాపూర్, HYD-జైపూర్ మధ్య ప్రత్యేక రైళ్లు జూన్ నెలాఖరు వరకు రాకపోకలు సాగించనున్నాయి.
గ్రేటర్ హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 38.2 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 24.5 డిగ్రీలు నమోదైనట్లు HYD వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. అలాగే గాలిలో తేమ 30 శాతంగా ఉందన్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా నగరవాసులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు చెబుతున్నారు. బయటకు వెళ్లేటప్పుడు గొడుగుతో వెళ్లాలని సూచిస్తున్నారు.
హైదరాబాద్ జిల్లాలో 2024లో గ్రూప్–1 సర్వీసెస్ పరీక్ష రాసే మైనారిటీ అభ్యర్థులకు ఉచిత కోచింగ్ దరఖాస్తులు స్వీకరణ గడువును మార్చి 31 వరకు పొడిగించినట్లు జిల్లా మైనారిటీ సంక్షేమాధికారి మహమ్మద్ ఇలియాస్ అహ్మద్ మంగళవారం తెలిపారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు నాంపల్లి హజ్‌హౌస్ భవనంలోని 6వ అంతస్తులోని జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
రాష్ట్రంలోని మూడు ప్రధాన రిజర్వాయర్లలో సరిపడా నీటి లభ్యత ఉందని, వేసవిలో తాగునీటికి ఇబ్బందులు లేవని సీఎస్ శాంతికుమారి స్పష్టం చేశారు. రాష్ట్రంలో తాగునీటి సరఫరాపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాగునీటి సమస్య తలెత్తకుండా ‘సమ్మర్ యాక్షన్ ప్లాన్’కు నిధులు విడుదల చేశామని చెప్పారు. HYDలో ఈ వేసవికి నీటి ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు.
భిక్షాటనతో చిన్నారుల జీవితాలను నాశనం చేయొద్దని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ అన్నారు. నగరంలో భిక్షాటన చేస్తున్న వీధి బాలలు, వారి తల్లులను ప్రత్యేక డ్రైవ్ ద్వారా గుర్తించారు. HYD కాచిగూడ నింబోలి అడ్డలోని జువైనల్ బాలికల హోం నుంచి వారి ప్రాంతాలకు తరలించే కార్యక్రమాన్ని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. 19 మంది చిన్నారులు, ఆరుగురు తల్లులను వారి గ్రామాలకు తరలించామన్నారు.
రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందిన ఘటన మేడ్చల్ PS పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. దుండిగల్ నుంచి బైక్‌పై మేడ్చల్ వైపు వస్తున్న ఓంప్రకాశ్(23) స్థానిక అయోధ్య చౌరస్తా వద్ద లారీని ఓవర్ టేక్ చేసే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న మరో లారీని ఢీకొన్నాడు. దీంతో ఓంప్రకాశ్ అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. ఓవర్ టేక్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నారు.
పోలింగ్ అధికారులు, సిబ్బందికి విధులు కేటాయించాలని HYD ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ ఆదేశించారు. ఉద్యోగులు, సిబ్బంది మొదటి దశ రాండమైజేషన్ ప్రక్రియను మంగళవారం తన కార్యాలయంలో చేపట్టారు. జిల్లా పరిధిలోని 2 MP నియోజకవర్గాల పరిధిలో 3986 పోలింగ్ కేంద్రాలున్నాయన్నారు. సిబ్బందికి ఏప్రిల్ 1,2 తేదీల్లో నియోజకవర్గ స్థాయిలో శిక్షణ ఇవ్వాలని, పోస్టల్ బ్యాలెట్‌ను అందించి ఓటేసే ప్రక్రియపై అవగాహన కల్పించాలన్నారు.
అవకాశవాద నాయకులకు బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీజేపీ చేవెళ్ల MP అభ్యర్థులను ప్రజలు నమ్మబోరని అన్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధి నార్సింగిలోని ఓం కన్వెన్షన్‌లో మంగళవారం చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. MLA ప్రకాశ్‌గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా సబితా ఇంద్రారెడ్డి హాజరై మాట్లాడారు.
రాష్ట్రంలో టెట్ పరీక్ష ఫీజును వెంటనే రద్దు చేయాలని బీఆర్‌ఎస్ నేత కే.వాసుదేవరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఫీజులు లేకుండానే పరీక్షలు నిర్వహించాలని కోరారు. HYD తెలంగాణ భవన్‌లో మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బుధవారం నుంచి టెట్ దరఖాస్తులు ప్రారంభంకానున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఫీజుల రద్దు ప్రకటన జారీ చేయాలని కోరారు.
Sorry, no posts matched your criteria.