Hyderabad

News March 17, 2024

HYD: ప్రధాని పర్యటన.. నేడు, రేపు ట్రాఫిక్ ఆంక్షలు

image

HYD నగరంలో ఈ నెల 17, 18న ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర అదనపు పోలీసు కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. PM ఈ నెల 17న బేగంపేట విమానాశ్రయం నుంచి రాజ్‌భవన్ వెళ్లనున్న నేపథ్యంలో రాత్రి 7.40 నుంచి 8.10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ నెల 18న PM రాజ్‌భవన్ నుంచి బేగంపేట ఎయిర్ పోర్టుకు వెళ్లనున్నారు. దీంతో ఉదయం 9.50 నుంచి 10.20 గంటలకు వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి.

News March 17, 2024

HYD జిల్లాలో 45,70,138 మంది ఓటర్లు

image

HYD జిల్లాలో మొత్తం 45,70,138 మంది ఓటర్లు ఉన్నారని అధికారులు తెలిపారు. ఇందులో పురుషులు 23,30,574, మహిళలు 22,39,240, ఇతరులు 324 ఓటర్లు ఓటర్లు ఉన్నారని తెలిపారు. అలాగే ఏప్రిల్ 14 వరకు ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయినందున పోలింగ్ శాతాన్ని పెంచేందుకు ప్రత్యేక చొరవ చూపుతామని అధికారులు చెబుతున్నారు.

News March 17, 2024

HYD: వ్యభిచార గృహంపై RAIDS

image

వ్యభిచార గృహంపై బంజారాహిల్స్ పోలీసులు రైడ్ చేసి ఇద్దరిని అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. శ్రీరాంనగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్లో ఓ మహిళ బ్యూటీ ప్లానెట్ స్పా పేరుతో మసాజ్ సెంటర్ నిర్వహిస్తోంది. అయితే డబ్బులకు ఆశపడి యువతులను తీసుకువచ్చి వ్యభిచారం చేయించింది. పోలీసులు గృహంపై రైడ్ చేసి మేనేజర్ మహ్మద్ ఆదిల్‌తో పాటు కస్టమర్‌ను పట్టుకున్నారు. ముగ్గురు సెక్స్ వర్కర్లను రెస్క్యూ హోమ్‌కు తరలించారు.

News March 16, 2024

హైదరాబాద్ జిల్లాలో నేటి TOP NEWS

image

> ఏసీబీ వలలో జలమండలి అధికారులు
> ఎమ్మెల్సీ కవిత అరెస్ట్.. నగర వ్యాప్తంగా నిరసనలు
> ఓయూలో ప్రధాని దిష్టిబొమ్మ దహనం
> లోక్ సభ ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ సమీక్ష సమావేశం
> లాలాపేటలో రోడ్డుపై పొంగిపొర్లుతున్న మురుగునీరు
> అమీన్‌పూర్ PS పరిధిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అదృశ్యం
> జీడిమెట్లలో 5 కేజీల గంజాయి స్వాధీనం
> హయత్‌నగర్-ఎల్బీనగర్ రూట్‌లో వాహన తనిఖీలు చేసిన పోలీసులు

News March 16, 2024

HYDలో BRSను వీడుతున్నారు..!

image

MP ఎన్నికల వేళ కీలక నేతలు BRSను వీడుతున్నారు. MLA దానం, నందకిషోర్ వ్యాస్‌ INCలో చేరుతున్నట్లు టాక్. MP రంజిత్‌ ఇదే ఆలోచనలో ఉన్నారట. భవిష్యత్తులో భారీగా చేరికలు ఉంటాయని కాంగ్రెస్‌ నేతలూ చెప్పడం దీనికి బలం చేకూరుస్తోంది. ఇటీవల BRSను వీడిన బొంతు రామ్మోహన్‌ GHMCలోని క్యాడర్‌ను INC వైపు‌ తిప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఈటల‌ సైతం‌ ఇదే పనిలో ఉన్నారు. దీంతో‌ HYD BRS నేత‌లు ఎటువైపు అనేది చర్చనీయాంశమైంది.

News March 16, 2024

HYD: స్థలం ఖాళీగా ఉందని కబ్జా చేశారు..!

image

రూ.30 కోట్లకు పైగా విలువైన ప్రభుత్వ స్థలం ఖాళీగా ఉందని పక్కనే ఉన్న యజమాని తన స్థలంతో పాటు కలిపేసుకుని గదులు క్రీడా మైదానం ఏర్పాటు చేసుకున్న ఘటన జూబ్లీహిల్స్ జర్నలిస్టు కాలనీ ఫేజ్‌-1లో చోటుచేసుకుంది. పలువురు ఫిర్యాదుల మేరకు షేక్‌పేట రెవెన్యూ అధికారులు పరిశీలించేందుకు వెళ్తే వారెంట్‌ లేకుండా అనుమతి లేదని అధికారులతో వాదించారు. 800 గజాల ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించినట్లు అధికారులు గుర్తించామన్నారు.

News March 16, 2024

HYD: ఎంపీ ఎన్నికలు.. పార్టీల సర్వేలు

image

ఎంపీ ఎన్నికల నేపథ్యంలో ప్రజల నాడి తెలుసుకునేందుకు వివిధ రాజకీయ పార్టీలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. వివిధ పద్ధతుల్లో సర్వేలు కొనసాగిస్తున్నాయి. HYD, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల పరిధిలో ఈ ప్రయత్నాలు జోరుగా సాగుతూ ఉండటం గమనార్హం. IVR కాల్స్ ద్వారా ఓటర్ల మద్దతు తెలుసుకునేందుకు పలువురు సర్వే పనిలో పడ్డారు. వారం రోజుల నుంచి వాయిస్ కాల్స్ కూడా పెద్దఎత్తున వస్తున్నాయని ఓటర్లు చెబుతున్నారు.

News March 16, 2024

HYD: ముస్లింలపై దాడులు పెరిగి పోతున్నాయి: ఒవైసీ

image

దేశంలోని ముస్లింలపై దాడులు రోజు రోజుకు పెరిగి పోతున్నాయని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంలో మైనార్టీలు అణచివేతకు గురవుతున్నారని ఎంఐఎం అధ్యక్షుడు, HYD ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. రంజాన్ మాసంలోని మొదటి శుక్రవారం సందర్భంగా ఆయన చార్మినార్ మక్కా మసీద్‌లో ప్రత్యేక ప్రార్థనలు, యాముల్ ఖురాన్ పఠనం కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంఐఎం చేస్తున్న అభివృద్ధి పనులపై వివరించారు.

News March 16, 2024

HYD: ఏసీబీ వలలో జలమండలి అధికారులు

image

రెవెన్యూ సర్కిల్ జలమండలి కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ ఫైనాన్స్ ఎల్.రాకేశ్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగి సందీప్‌ను అక్బర్ హుస్సేన్ అనే వ్యక్తి కలిశారు. తన పని అవ్వాలంటే రూ.లక్ష లంచం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. దీంతో అక్బర్ ఏసీబీ అధికారులను సంప్రదించాడు. శుక్రవారం లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులకు రాకేశ్ దొరికాడు. నాంపల్లి ఏసీబీ కోర్టులో వారిని హాజరుపర్చగా కోర్టు రిమాండ్ విధించింది. 

News March 16, 2024

HYD: శంభీపూర్ రాజుని కలిసిన మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి

image

ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ పార్టీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు శంభీపూర్ రాజుని ఆ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. శంభీపూర్ రాజు లక్ష్మారెడ్డిని శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కాగా మల్కాజిగిరి టికెట్‌ను తొలుత శంభీపూర్ రాజుకు ఇచ్చినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. వీరి ఇద్దరి కలయికతో శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.