India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
‘జీనా హై తో మర్నా సీఖో కదమ్ కదమ్ పర్ లడ్నా సీఖో ’ అంటూ నినాదించిన జార్జ్ రెడ్డి దేశవ్యాప్తంగా సుపరిచితుడు. మన HYDతో ఆయనకు ఎంతో అనుబంధం ఉంది. 1962లో జార్జ్ ఫ్యామిలీ నగరంలో స్థిరపడింది. నిజాం కాలేజీలో డిగ్రీ చేసిన జార్జ్.. OUలో పీజీ చేశారు. యూనివర్సిటీలోనే PDS (PDSU)ను స్థాపించి ఉద్యమాలు నడిపారు. గిట్టనివారు 1972-APR-14న ఉస్మానియా యూనివర్సిటీలోనే దారుణంగా హత్యచేశారు. నేడు జార్జ్ 52వ వర్ధంతి.
HYD బాలానగర్‌లోని CITDలో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. 10వ తరగతి పాసైన వారు మే 13 వరకు https://citdindia.org వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. డిప్లొమా ఇన్ టూల్ డిజైన్ అండ్ మౌల్డ్ మేకింగ్, డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, డిప్లొమా ఇన్ ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్ ఇంజినీరింగ్, డిప్లొమా ఇన్ ప్రొడక్షన్ ఇంజినీరింగ్ బ్రాంచీలు ఉన్నాయి.
HYD హుస్సేన్ సాగర్‌లో బోట్ షికారు చేసే వారి సంఖ్య తగ్గింది. సోమవారం నుంచి శుక్రవారం వరకు బోట్ షికారు చేసిన వారు 2 వేల మంది వరకు ఉండగా.. శని, ఆదివారాలు 5 వేల మంది ఉంటున్నారు. సాగర్‌లో ఉదయం నుంచి రాత్రి వరకు 100 మంది సామర్థ్యం ఉన్న పెద్ద బోట్లలో పుట్టిన రోజు వేడుకలు, కుటుంబ సభ్యుల సమావేశాలు జోరుగా సాగేవి. ఓ వైపు ఎండ, మరోవైపు హుస్సేన్ సాగర్ దుర్వాసన కారణంగా షికార్ చేసే వారి సంఖ్య తగ్గింది.
నీట్ పరీక్ష భయంతో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన HYD కొంపల్లి సమీపంలోని పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలో ఈరోజు జరిగింది. స్ప్రింగ్ కాలనీలో ఉంటున్న జైస్వాల్(22) నీట్ పరీక్షపై ఆందోళనకు గురై.. భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
HYD హిమాయత్ సాగర్ జలాశయం ప్రస్తుత నీటిమట్టం 2.128 టీఎంసీలు ఉండగా.. నగరానికి 26 MLD నీటిని సరఫరా చేస్తున్నారు. జలాశయం అడుగులో కలుషితాలు పేరుకుపోవడంతో 10 అడుగులపై నుంచి నీటిని తోడాలని అధికారులు నిర్ణయించారు. పంపింగ్ ద్వారా నేరుగా మీర్ ఆలం నీటి శుద్ధి కేంద్రానికి తరలించి, అక్కడి నుంచి ప్రజలకు సరఫరా చేయనున్నారు. హిమాయత్ సాగర్ అడుగున కలుషిత జలాలు వస్తున్నట్లు గుర్తించారు.
HYDలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్ తెలిపారు. నాగార్జున సాగర్‌లో ఈనెల 15 నుంచి ఎమెర్జెన్సీ పంపింగ్‌కు ఏర్పాట్లు పూర్తయినట్లు వెల్లడించారు. నీటి సరఫరాలో ఆటంకం కలిగించే లైన్ మెన్లపై చర్యలు తీసుకుంటామన్నారు. జంట జలాశయాల నుంచి అదనంగా 20 ఎంఎల్డీల నీటిని వాడుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. నీటి నాణ్యతపై అధికారులకు సూచనలు చేశారు.
అభం శుభం తెలియని చిన్నారులను సైతం కామాంధులు వదలడం లేదు. ఆరేళ్ల చిన్నారితో ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించిన ఘటన మలక్‌పేట్ PS పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. సలీంనగర్ వాసి సుబ్బారావు(52)కు ముసారాంబాగ్‌లో కిరాణా షాప్ ఉంది. దుకాణానికి వచ్చిన ఓ చిన్నారి(6)తో అతడు అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక ఏడుస్తూ వెళ్లి తల్లిదండ్రులకు విషయం చెప్పగా వారు PSలో ఫిర్యాదు చేశారు. పోక్సో కేసు నమోదైంది.
తిరుపతి వెళ్లే వారి వద్ద డబ్బులు తీసుకుని మోసం చేసిన వ్యక్తిపై కేసు నమోదైన ఘటన ఎల్బీనగర్ PS పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. బైరామల్‌గూడ వాసి కపిల్ రెడ్డిని చరణ్ అనే వ్యక్తి పరిచయం చేసుకున్నాడు. తాను TTD ఛైర్మన్ PA అని, శ్రీవారి దర్శనం టికెట్లు బుక్ చేస్తానని నమ్మించి ఈనెల 7న రూ.1,60,900 తీసుకున్నాడు. ఆ తర్వాత కపిల్.. చరణ్‌కు ఫోన్ చేయగా సమాధానం ఇవ్వలేదు. బాధితుడు PSలో ఫిర్యాదు చేశాడు.
ప్రియురాలు మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవడంతో మనోవేదనకు గురైన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన HYD సూరారం PS పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. బిహార్ వాసి తన్వీర్ ఖాన్(27)కు మూడేళ్ల క్రితం వివాహమవగా బతుకుదెరువు నిమిత్తం HYD వచ్చి దయానంద్ నగర్‌లో ఉంటున్నాడు. కాగా పెళ్లికి ముందు అతడు ప్రేమించిన యువతికి ఇటీవల పెళ్లి జరిగింది. విషయం తెలిసి తన్వీర్ ఉరేసుకుని చనిపోయాడు. శనివారం కేసు నమోదైంది.
HYD మాదాపూర్ పరిధి అన్నమయ్యపురంలో అన్నమయ్య స్వరార్చన కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు కూచిపూడి నృత్యంతో ఆకట్టుకున్నారు. ఇందులో వినాయక కొతం, మూషికవాహన, ముద్దుగారే యశోద, ఇదిగో భద్రాద్రి తారంగం, అంబ పలుకు, మీనాక్షి పంచరత్న తదితర అంశాలను కళాకారులు శ్రీవిద్య, సహస్ర, శ్రీమయి, శాన్వి, మహిశ్రీ తదితరులు కలిసి ప్రదర్శించారు.
Sorry, no posts matched your criteria.