India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి టికెట్ కేటాయింపుల్లో మాదిగలను కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విస్మరించిందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఒక ప్రకటనలో ఆరోపించారు. తెలంగాణలో అసలు మాదిగలు లేనట్లుగా భావించి.. పూర్తిగా మాదిగలకు అన్యాయం చేసిన పార్టీ కాంగ్రెస్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీ ఇప్పటికే రెండు స్థానాల్లో మాదిగలకు టికెట్లు కేటాయించిందని మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు.
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమాపై సోషల్ మీడియాలో కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆయన మేనేజర్ అనురాగ్ పర్వతనేని, ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు కలిసి HYD మాదాపూర్ పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశారు. పనిగట్టుకొని ఫ్యామిలీ స్టార్ సినిమాపై దుష్ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు మేనేజర్ తెలిపారు. కేసు నమోదు చేసి, నిందితులను పట్టుకుంటామని పోలీసులు చెప్పారు.
రాష్ట్ర మత్స్య శిక్షణా కేంద్రాన్ని మేడ్చల్‌లో నిర్మించి ఏళ్లు గడుస్తున్నా ప్రారంభోత్సవానికి నోచుకోవడం లేదు. రాష్ట్రంలోని మత్స్య సంఘాల సభ్యులకు చేపల పెరుగుదల, వాటికి సోకే రోగాలు, ఉత్పత్తి తదితర అంశాలపై ఈ కేంద్రంలో శిక్షణ ఇవ్వనున్నారు. కాగా గత ప్రభుత్వ హయాంలోనే కేంద్రాన్ని ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ పలుమార్లు వాయిదా పడగా.. ప్రస్తుత ప్రభుత్వమైన TSFTIని ప్రారంభించాలని మత్స్యకారులు కోరుతున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో 6 గ్యారంటీలతో తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ నేతలు మోసం చేశారని BJP రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ దేవి అన్నారు. HYD నాంపల్లిలోని BJP స్టేట్ ఆఫీస్‌లో ఆమె మాట్లాడారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఐదు న్యాయాలతో దేశ ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోసం చేసే పార్టీ కాంగ్రెస్ అని, వంద రోజుల్లో 6 గ్యారంటీలను బొంద పెట్టారని మండిపడ్డారు.
HYD పీర్జాదిగూడ, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లకు చెందిన పలువురు కార్పొరేటర్లు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో BRS నుంచి కాంగ్రెస్‌లో చేరారు. పీర్జాదిగూడ డిప్యూటీ మేయర్ శివకుమార్ గౌడ్, 11 మంది BRS కార్పొరేటర్లు, ముగ్గురు కోఆప్షన్ సభ్యులు, పార్టీ మున్సిపల్ చీఫ్ దయాకర్ రెడ్డి హస్తం గూటికి చేరారు. ఇక బోడుప్పల్ కార్పొరేషన్‌కు చెందిన ఐదుగురు BRS కార్పొరేటర్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
ఎంఐఎం ఉన్న పాతబస్తీ ప్రాంతాల్లో 80% ఓటింగ్ ఎలా సాధ్యమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఆదివారం రాత్రి ఆయన సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. పోలింగ్ బూత్‌లలో ఎంఐఎం అక్రమాలకు పాల్పడుతుందని ఆయన ఆరోపించారు. ట్రిపుల్ తలాక్ పై స్పందిస్తూ ముస్లిం దేశాల్లో కూడా ఇది లేదని స్పష్టం చేశారు. దేశంలో మోదీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
కేంద్రంలో అధికారంలోకి రాలేని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఎలా అమలు చేస్తుందని బీజేపీ మల్కాజిగిరి అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. మల్కాజిగిరిలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు కాంగ్రెస్ హామీలు గుప్పిస్తోందన్నారు. అధికారంలోకి రాగానే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, మహిళలకు రూ.2,500 హామీ ఏమైందని ప్రశ్నించారు. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిందని తప్పించుకోవాలని చూస్తున్నారన్నారు.
ప్రమాదవశాత్తు ఓ చిన్నారి భవనంపై నుంచి కిందపడి మృతిచెందిన ఘటన HYD కాచిగూడ PS పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి తెలిపిన వివరాలు.. కార్పెంటర్ రతన్ తన భార్య నీల, కుమారుడు ఆయూష్, ఏడాదిన్నర కుమార్తె రియాంషితో కలిసి నింబోలిఅడ్డలో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. నీల తన కుమారుడికి అన్నం తినిపిస్తుండగా కుమార్తె రియాంషి ఆడుకుంటూ బాల్కానీలో వేసిన కుర్చీ ఎక్కి కింద పడి మృతిచెందింది.
HYD, ఉమ్మడి RR జిల్లాలో 32 బాలుర, 31 బాలికల జ్యోతిబా ఫులే ఇంటర్ కళాశాలున్నాయి. ప్రవేశాల కోసం పది పూర్తయిన వారు ఈనెల 12లోపు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఏప్రిల్ 28న ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. మహేశ్వరం జ్యోతిబా ఫులే కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ, HEC గ్రూపులతో పాటు వృత్తివిద్య కోర్సులు ఉన్నాయి. దరఖాస్తుకు mjpabcwreis.cgg.gov.in వెబ్‌సైట్ సంప్రదించాలన్నారు.
ఏ పిలుపు ఇచ్చినా ముందుకు నడిచే ప్రతి బీఆర్ఎస్ కార్యకర్తకు పేరుపేరునా కృతజ్ఞతలని ఆ పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి టీ.పద్మారావు గౌడ్ అన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో లేకున్నా అధైర్య పడవద్దని, మేమంతా మీ వెంటే ఉంటామని ఆయన కార్యకర్తలకు భరోసా కల్పించారు. ఆదివారం సికింద్రాబాద్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని సూచించారు.
Sorry, no posts matched your criteria.