India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYD ఉప్పల్లో నేడు SRH VS CSK మధ్య IPL మ్యాచ్ జరగనుంది. ఈ మేరకు ఆర్టీసీ సా.6 గంటల నుంచి రా.11:30 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు తెలిపింది. మేడ్చల్, మియాపూర్, జేబీఎస్, ఘట్‌కేసర్, హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం, కొండాపూర్, ఎల్బీనగర్, చంద్రాయణగుట్ట, జీడిమెట్ల, KPHB తదితర ప్రాంతాల నుంచి బస్ సర్వీసులుంటాయని, ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నేడు మెట్రో టైమింగ్స్ కూడా పొడిగిస్తారు. SHARE IT
HYD నగరంలో వాటర్‌కు డిమాండ్ పెరగడంతో ఉస్మాన్‌సాగర్ లైన్ నుంచి వచ్చే నీటిని శుద్ధి చేయడం కోసం 2 మాడ్యులర్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లను పునః ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. 2 MLD, 3 MLD సామర్థ్యంతో ఈ ట్రీట్మెంట్ ప్లాంట్లను రూపొందించారు. వీటిని పునః ప్రారంభించడం ద్వారా డిమాండ్‌కు తగ్గట్లుగా నీటిని అందించే అవకాశం అందని అధికారుల అంచనా.
HYD జిల్లాలో 36, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 29 అంబులెన్స్‌లు ఉన్నాయి. 108కి కాల్ చేసి ఎగ్జాక్ట్ లొకేషన్ చెబితే గాని ఒక్కోసారి రావడం లేదని, HYD నగర శివారు మారుమూల ప్రాంతాలకు ఆలస్యమవుతుందని పలువురు ఆరోపించారు. మరోవైపు కొందరి నుంచి రాంగ్ కాల్స్ వస్తున్నట్లుగా 108 సిబ్బంది తెలియజేశారు. అత్యవసర సేవలను మరింత మెరుగుపరిచేందుకు అంబులెన్స్ వాహనాల సంఖ్య పెంచాలని పలువురు కోరారు.
డ్రగ్స్‌కు బానిసగా మారిన కొడుకు.. తనను మందలించినందుకు కన్న తండ్రినే హత్య చేశాడు. ఈ ఘటన ఆదిభట్ల పోలీస్‌స్టేషన్ పరిధి తుర్కయంజాల్‌లో జరిగింది. ఆరెంజ్ అవెన్యూలో ఓ ఇంట్లో ఉంటున్న తిరుపతి రవీందర్(65)ను పెట్రోల్ పోసి అతడి కుమారుడు నిప్పంటించాడు. మంటలను తట్టుకోలేక అక్కడికక్కడే రవీందర్ మృతి చెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు అతడి కొడుకు కోసం గాలిస్తున్నారు.
వాస్క్యులర్ రంగంలో దేశంలో నం.1 ఎవిస్ హాస్పిటల్స్ తమ సేవలను మరింత విస్తరిస్తోంది. గురువారం కూకట్‌పల్లిలో ఎవిస్ హాస్పిటల్స్ నూతన శాఖ ప్రారంభించారు. MD, ప్రముఖ ఇంటర్వెన్షనల్ రేడియోలజిస్ట్ డా.రాజా వి కొప్పాల పూజాదికాలతో కొత్త ఆసుపత్రికి అంకురార్పణ చేశారు. కార్యక్రమంలో డైరెక్టర్లు శ్రీనివాస్, భరత్, వైభవ్, డాక్టర్లు సంపత్, మల్లీశ్వరి, బిందు, అధికారులు పాల్గొన్నారు.
HYDలోని మూసీ నదికి ఇరువైపులా 50 మీటర్ల పరిధిలో నిర్మాణం, లే అవుట్ అనుమతులను నిలిపివేయాలని GHMC నిర్ణయించింది. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ ఉత్తర్వులు జారీ చేశారు. వేర్వేరు సంస్థల ఆధ్వర్యంలో చేపట్టే అభివృద్ధి పనులను అనుమతించొద్దని ఉప కమిషనర్లు, ప్రణాళిక అధికారులకు తెలుపుతూ వెంటనే ఆదేశాలను అమలు చేయాలని తెలియజేశారు. మూసీ మాస్టర్ ప్లాన్ డెవలప్మెంట్‌లో భాగంగా చర్యలకు ఉపక్రమించారు.
HYD ఉస్మానియా యూనివర్సిటీ 2024-25 వార్షిక బడ్జెట్ రూ.718.86 కోట్లు కాగా అంచనా వ్యయం రూ.796.45 కోట్లు, లోటు బడ్జెట్ రూ.44.68 కోట్లుగా ఉందని వీసీ రవీందర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి బ్లాక్ గ్రాంట్స్ రూపంలో రూ.487.03 కోట్లు కేటాయించినప్పటికీ బడ్జెట్ లోటును పూడ్చడానికి, వర్సిటీలో కార్యకలాపాలు సజావుగా సాగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని అదనపు గ్రాంట్లు అందించి వర్సిటీని ఆదుకోవాలని కోరారు.
GHMC పరిధి యూసఫ్‌గూడ, ఎర్రగడ్డ, మూసాపేట, మాదాపూర్, మల్కాజిగిరి, అంబర్‌పేట, రాంనగర్, మారేడుపల్లి, అడ్డగుట్ట, ఉప్పల్, లంగర్‌హౌస్, మెహిదీపట్నం ప్రాంతాలలో పెద్ద ఎత్తున మోటార్లు బిగించి నీటిని తోడేస్తున్నారు. ఈ కారణంగా లో ప్రెషర్ సమస్యలు ఏర్పడుతున్నాయని వాటర్ బోర్డుకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇలా చేసేవారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు.
తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TSSET) మెంబర్ సెక్రటరీగా ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ నరేశ్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ రవీందర్ నియామక పత్రం అందజేశారు. 2023లో టీఎస్ సెట్ ప్రవేశపరీక్ష నిర్వహించి పరీక్షా ఫలితాలు విడుదల చేశారు. అయితే 2024లో మళ్లీ టీఎస్ సెట్ ప్రవేశ పరీక్షకు ప్రకటన రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో మెంబర్ సెక్రటరీని నియమించారు.
చిన్న చిన్న కేసులు ఉన్నాయని తమను పోలీసు ఉద్యోగాలకు దూరం చేయొద్దంటూ పలువురు కానిస్టేబుల్ అభ్యర్థులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 2022 కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్‌కు చెందిన పలువురు అభ్యర్థులు బుధవారం వనస్థలిపురం పనామా చౌరస్తా వద్ద నిరసన చేపట్టారు. 1500 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, వితౌట్ హెల్‌మెట్, తదితర కేసులు ఉన్నాయని నియామకపత్రాలు ఇవ్వలేదని వాపోయారు. న్యాయం చేయాలని వేడుకొన్నారు.
Sorry, no posts matched your criteria.