India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పద్మశ్రీ పురస్కార గ్రహీత, కిన్నెర కళాకారుడు దర్శనం మొగులయ్య బుధవారం HYDలో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను కలిశారు. తాను ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితులను మంత్రికి వివరించి చేయూతనివ్వాలని విన్నవించారు. ఆరోగ్యం సహకరించక, ఆర్థికంగా ఆదుకునేవారు లేక తాను అనుభవిస్తున్న కష్టాలను మొగులయ్య మంత్రికి వివరించారు. మొగులయ్య దుస్థితిని విన్న మంత్రి ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
HYD, RR, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల పరిధిలో మూసీ నది గర్భంలో 1,585, బఫర్ జోన్‌లో 6,890 అక్రమ నిర్మాణాలు ఉన్నట్లుగా రెండేళ్ల కిందట అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ప్రత్యేక మాస్టర్ ప్లాన్ ద్వారా మూసీ అభివృద్ధికి ప్రభుత్వం స్వీకారం చుడతోంది. సుందరీకరణ జరగక ముందే.. కబ్జా కోరులు మూసీ పరివాహక ప్రాంతంలో అక్రమాలకు తేరలేపుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో అధికారులు డేగ కన్నుతో నిఘా పెట్టారు.
HYDలో మరో దారుణ ఘటన జరిగింది. బహదూర్‌పుర PS పరిధి నందిముస్లాయిగూడలో మహమ్మద్ రషీద్ హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షకీల్ అహ్మద్ సోదరిని రషీద్ వివాహం చేసుకున్నాడు. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. బుధవారం మరోసారి వివాదం తలెత్తింది. ఈ విషయం తెలుసుకొన్న షకీల్ హుటాహుటిన సోదరి ఇంటికి వచ్చాడు. మాటామాటాపెరగడంతో రషీద్‌ను కత్తితో పొడిచి చంపేశాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
HYD బేగంపేటలోని రసూల్‌పుర అంబేడ్కర్‌నగర్‌లో దారుణఘటన చోటుచేసుకుంది. గతరాత్రి తరుణ్ అనే యువకుడిపై నలుగురు దాడి చేశారు. బాధితుడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
HYDలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో కోరిక తీర్చాలని బాబాయ్ యువతిని వేధించాడు. బాధితురాలు తల్లికి చెప్పడంతో అతడికి కౌన్సెలింగ్ ఇచ్చారు. మరోసారి లైంగికంగా వేధించగా ఆమె షీటీమ్స్‌కు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన నాగోల్ పోలీసులు నిందితుడిని రిమాండ్‌కు పంపారు. అంతేకాకుండా రాచకొండ కమిషనరేట్ పరిధిలో 15 రోజుల్లోనే 96 మంది పోకిరీలపై చర్యలు తీసుకొన్నట్లు పోలీసులు తెలిపారు.
పోలీస్ వ్యవస్థలో హైదరాబాద్ CP కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తన మార్క్ చూపిస్తున్నారు. పోలీస్ అధికారులు విధుల్లో నిర్లక్ష్యం చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా లాలాగూడ CI పద్మను సస్పెండ్ చేశారు. రోడ్డు ప్రమాదంలో యాచకురాలు మృతి చెందితే నిర్లక్ష్యం చేసినట్లు ఆరోపణలు వచ్చాయట. విచారణ చేపట్టిన కమిషనర్ తప్పుడు కేసుగా గుర్తించి.. ఆమెను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంసీఏ పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. మూడేళ్ల ఎంసీఏ, రెండేళ్ల ఎంసీఏ బ్యాక్ లాగ్ పరీక్షలను ఏప్రిల్ 19వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షా తేదీన పూర్తి వివరాలను ఓయూ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.
HYD శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికులు పోగొట్టుకున్న లగేజీ, మర్చిపోయిన వస్తువులను అధికారులు భద్రపరిచి, వాటి వివరాలను https://bit.ly/3k3sY1X ప్రత్యేక వెబ్‌సైట్ ద్వారా అందుబాటులో ఉంచారు. విమానాశ్రయంలో ఏవైనా మర్చిపోయినట్లయితే.. 040-66606064 నంబర్‌కు కాల్ చేయాలని తెలిపారు. ghiallost&found@gmrgroup.in మెయిల్ ద్వారా సైతం సందేహాలను తెలపవచ్చని పేర్కొన్నారు. SHARE IT
HYDలో ఓ పోలీసు ఇన్‌స్పెక్టర్, ఓ ఎస్సై సస్పెండ్‌కు గురయ్యారు. రోడ్డు ప్రమాదం కేసులో విచారణ సరిగ్గా చేయలేదని లాలాగూడ ఇన్‌స్పెక్టర్ పద్మను సీపీ సస్పెండ్ చేశారు. కేసు విచారణలో ఉన్నతాధికారులను కూడా ఇన్‌స్పెక్టర్ తప్పుదోవ పట్టించారన్నారు. అలాగే అంబర్‌పేట్ ఎస్సై అశోక్‌ను సీపీ శ్రీనివాస్ రెడ్డి సస్పెండ్ చేశారు. చైన్ స్నాచింగ్ బాధితులను వేధించారని సీపీ తెలిపారు.
HYD బాగ్‌లింగంపల్లిలోని బస్ భవన్‌లో ASRTU ఆధ్వర్యంలో ప్రైజ్ రివిజన్ సబ్ కమిటీ మీటింగ్ జరిగింది. 18 రాష్ట్రాల ఆర్టీసీలకు చెందిన ఎక్స్‌పర్ట్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. బస్సుల విడిభాగాల ధరల నిర్ణయం, కొనుగోలు పాలసీ, కొత్త వెండర్ల నియామకం, తదితర అంశాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. బస్సుల విడిభాగాలకు చెందిన 15 గ్రూపులకు సంబంధించిన ధరలను నిర్ధారించారని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.
Sorry, no posts matched your criteria.