India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
గ్రేటర్ HYD పరిధిలో ఏప్రిల్ 1 నుంచి ట్రేడ్ లైసెన్స్‌లను పునరుద్ధరిస్తే రెన్యువల్ దరఖాస్తులపై అదనంగా 50 శాతం అపరాద రుసుం ఉంటుందని GHMC అధికారులు తెలిపారు. గతేడాది డిసెంబర్ 31తో ట్రెడ్ లైసెన్స్ గడువు ముగిసిందని, జనవరి 31 వరకు అవకాశం ఇచ్చామని, ఫిబ్రవరి 1 నుంచి మార్చి 31 వరకు 25 శాతం జరిమానాతో పునరుద్ధరించినట్లు చెప్పారు. ట్రేడర్లు తమ లైసెన్స్‌లను పునరుద్ధరించుకోకుంటే జరిమానాలు ఉంటాయన్నారు.
గ్రేటర్ HYDలో తాగునీటి సమస్యను అధిగమించడమే లక్ష్యంగా జలమండలి చర్యలు వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే తాగునీటి కొరత లేకుండా చూడాలనే ఉద్దేశంతో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్, జలమండలి ఎండీ సుదర్శన్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటికే ఉన్న వాటికి అదనంగా 5వ తేదీ నాటికి మరో 87 ట్యాంకర్లు అదనంగా సమకూర్చుకునేందుకు సమాయత్తం అవుతున్నట్లు చెప్పారు.
హైదరాబాద్, ఉమ్మడి RR జిల్లాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. భానుడి ప్రతాపానికి నగర వాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 38.2 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 25.3 డిగ్రీలు, గాలిలో తేమ 24 శాతంగా నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. నగరంలో రాగల రెండు, మూడు రోజులు రాత్రి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
HYD అంబర్‌పేట్‌లో మాజీ మంత్రి KTR.. BRS సికింద్రాబాద్ అభ్యర్థి పద్మారావు గౌడ్‌కు మద్దతుగా పాదయాత్ర నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అంబర్‌పేట్‌లో రోడ్డు పక్కన ఉన్న ఓ మిర్చి బండి మహిళతో KTR ముచ్చటించారు. ఆమెతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రానున్న ఎంపీ ఎన్నికల్లో BRSను గెలిపించాలని KTR కోరారు. మన తెలంగాణ గళం పార్లమెంట్‌లో వినిపించాలంటే BRSతోనే సాధ్యమని అన్నారు.
జీహెచ్‌ఎంసీలో పారిశుద్ధ్యం, ఎంటమాలజీ విభాగాల్లో అక్రమాలకు శాశ్వత చెక్ పెడుతూ సరికొత్త విధానాన్ని తెరపైకి తెచ్చారు. కార్మికుల అటెండెన్స్‌లో ప్రస్తుతం అమలవుతున్న ఫింగర్ ప్రింట్ బయోమెట్రిక్ హాజరును నేటి నుంచి నిలిపివేయనున్నారు. సోమవారం నుంచి అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ సిస్టంను అమలు చేయనున్నారు.
బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన బోరబండ PSపరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. జూబ్లీహిల్స్ పరిధి రహమత్‌నగర్ వాసి లక్ష్మణ్ బాబు డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఈక్రమంలో ఓ బాలికను కొన్నాళ్లుగా ప్రేమిస్తున్నానంటూ వెంట తిరిగాడు. ఆమెకు మాయమాటలు చెప్పి ఇతర ప్రాంతానికి తీసుకెళ్లి రూమ్‌లో పలుమార్లు అత్యాచారం చేశాడు. బాలిక కుటుంబసభ్యులు PSలో ఫిర్యాదు చేశారు.
లోక్‌సభ ఎన్నికల నిర్వహణ కోసం ప్రిసైడింగ్ ఆఫీసర్ (పీఓ), అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ (ఏపీఓ)లకు సోమ,మంగళవారాల్లో శిక్షణ తరగతులను నిర్వహించనున్నట్టు HYD ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ తెలిపారు. ఒక్కో విడతలో 50 మంది చొప్పున అధికారులకు శిక్షణ ఉంటుందన్నారు. శిక్షణకు వచ్చే వారు పోస్టల్ బ్యాలెట్ కోసం ఓటర్ గుర్తింపు కార్డు నంబర్, ఓటర్ జాబితాలో పార్ట్/సీరియల్ నంబర్ వివరాలు తీసుకురావాలని సూచించారు.
100 రోజుల రేవంత్ రెడ్డి పాలనను చూసి ప్రజలు సంతోషిస్తున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఎంపీ ఎన్నికల నేపథ్యంలో HYD ఎల్బీనగర్ పరిధి కర్మన్‌ఘాట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణను ఇచ్చిన కాంగ్రెస్‌ను అసెంబ్లీ ఎన్నికలో ఆదరించారని, అదే విధంగా పార్లమెంట్ ఎన్నికల్లోనూ గెలిపించాలని కోరారు. మూసీ ప్రక్షాళనకు CM రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. BRSను నమ్మొద్దన్నారు.
ఓ ఇంటర్ స్టూడెంట్ సూసైడ్ చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. ఖైరతాబాద్ మార్కెట్ ప్రాంతంలో నివాసం ఉండే విద్యార్థి(16) SRనగర్‌లోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదివి, ఇటీవల పరీక్షలు రాశాడు. ఎంసెట్, IIT పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. ఆదివారం ఇంట్లో ఉరేసుకుని చనిపోయాడు. ఎంసెట్, ఐఐటీల్లో సీటు పొందేలా కష్టపడాలని కుటుంబ సభ్యులు చెబుతుండడంతో ఒత్తిడికి గురై ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదైంది.
ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతు ఉండాలని గతంలో ఎంపీగా రేవంత్‌రెడ్డిని గెలిపిస్తే.. ఇప్పుడు సీఎం అయిన తర్వాత ప్రతిపక్షాలపై కేసులు పెట్టి గొంతు నొక్కుతున్నారని బీజేపీ మల్కాజిగిరి అభ్యర్థి ఈటల రాజేందర్ ఆరోపించారు. HYD నాగారంలో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరై ఈటల మాట్లాడారు. దేశంలో బీజేపీ గాలి వీస్తుందని, మూడోసారి మోదీ హ్యాట్రిక్ విజయం సాధించి అధికారంలోకి రావడం పక్కా అని అన్నారు.
Sorry, no posts matched your criteria.