Hyderabad

News August 10, 2025

HYDలో వర్షం ఎఫెక్ట్.. పలు విమానాలకు అంతరాయం

image

సాంకేతిక సమస్యలు, వాతావరణ ప్రతికూలత వల్ల నిన్న పలు విమానాల రాకపోకల్లో అంతరాయం కలిగింది. అహ్మదాబాద్‌ నుంచి HYDకు వచ్చే విమానం 5 గంటలు ఆలస్యంగా వచ్చింది. శంషాబాద్‌- సాయంత్రం రస్‌అల్‌ఖైమానా బయలుదేరాల్సిన విమానం గంట ఆలస్యంగా బయలుదేరింది. భారీ వర్షం కారణంగా షార్జా వెళ్లాల్సిన విమానం గంట ఆలస్యంగా టేకాఫ్‌తీసుకుంది. మరో 2 దేశీయ విమానాలు గంట ఆలస్యంగా టేకాఫ్ అయ్యాయి.

News August 10, 2025

HYD: బంద్ ఉన్నా.. పనిచేస్తున్నందుకు దాడి

image

వేతనాల పెంపు కోసం ఈ నెల 1 నుంచి సినీ కార్మిక యూనియన్లు షూటింగ్స్‌కు బంద్‌ పాటిస్తున్నాయి. గత సోమవారం సారథి స్టూడియోలో ఒక సీరియల్‌కు సంబంధించి కాస్ట్యూమర్‌ యూనియన్‌ ప్రతినిధి సత్యనారాయణ పనిచేస్తుండగా అధ్యక్షుడు శ్రీనివాస్ మరో ముగ్గురు వెళ్లి దాడి చేశారు. దీంతో ఆయనకు గాయాలయ్యాయి. చికిత్స అనంతరం బాధితుడు ఆదివారం మధురానగర్‌ PSలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.

News August 10, 2025

చర్లపల్లి : ఖైదీల వ్యవసాయంపై న్యాయమూర్తి  సంతృప్తి

image

చర్లపల్లి వ్యవసాయ క్షేత్రంలో ఖైదీలు చేస్తున్న సేద్యంపై రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సామ్‌ కోషి సంతృప్తి వ్యక్తం చేశారు. చర్లపల్లిలోని ఓపెన్‌ ఎయిర్‌ జైల్‌ను సందర్శించారు. జైలు పనితీరు, కార్యకలాపాలను అడిగి తెలుసుకుని ఖైదీలతో మాట్లాడారు. జైళ్ల శాఖ సంస్కరణలు ప్రశంసనీయమని, ఖైదీలు వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం జైలు ఆవరణలో ఆయన మొక్కలు నాటారు.   

News August 10, 2025

కిక్కిరిసిన ఆర్టీసీ బస్సులు.. మేడ్చల్‌లో అవస్థలు

image

రక్షాబంధన్ నేపథ్యంలో RTC బస్సులు కిటకిటలాడాయి. అధికారులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినా నామాత్రమేనని ప్రజలు ఆరోపించారు. దీంతో జనం బస్సుల కోసం బారులుతీరాల్సి వచ్చింది. మేడ్చల్‌ డిపో నుంచి నగరం, పలు జిల్లాల సరిహద్దులకు మేడ్చల్‌ నుంచి వెళ్లే బస్సులన్నీ రద్దీగా కనిపించాయి. మహిళలు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రద్దీ ఉంటుందని తెలిసీ బస్సులు ఏర్పాటు చేయకపోవడంపై ప్రయాణికులు విమర్శించారు.

News August 10, 2025

పండగ పయనం.. కిక్కిరిసిన ఎల్బీనగర్

image

ఎల్‌బీనగర్‌ రింగ్‌రోడ్డు ప్రయాణికులతో కిటకిటలాడింది. బస్సుల కోసం గంటల తరబడి ఎదురు చూశారు. రాఖీ పండగ సందర్భంగా శనివారం ఉదయం నుంచీ బస్టాపులు, ప్రధాన రహదారులపై ప్రయాణికులు కిక్కిరిశారు. ఎండలోనే సామగ్రీతో రోడ్డుపై నిలబడాల్సి వచ్చిందని అధికారుల తీరుపై ప్రయాణికులు తీవ్రంగా మండిపడ్డారు. వేల మంది ప్రయాణికులు పిల్లలతో వచ్చి బస్ షెల్టర్లు లేక హవేపై అవస్థలు పడ్డట్లు వాపోయారు.

News August 10, 2025

వర్షంతో వార్-2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు బ్రేక్?

image

WAR- 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుందా? జరగదా? అనే సందిగ్ధం నెలకొంది. ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుక యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో సా.5 నుంచి ఈవెంట్ స్టార్ట్ అవుతుందని వెల్లడించారు. అధికారికంగా పలు రోడ్లలో ఆంక్షలు విధించారు. దీంతో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై అభిమానులలో నెలకొన్న సందిగ్ధతపై క్లారిటీ వచ్చింది. అయినప్పటికీ నగరంలో భారీ వర్షాలు పడుతుండడంతో ఈవెంట్‌కి బ్రేక్ పడే అవకాశం కనిపిస్తోందని సమాచారం.

News August 10, 2025

WAR-2 ప్రీ రిలీజ్ ఈవెంట్.. HYDలో ట్రాఫిక్ ఆంక్షలు

image

నేడు యూసుఫ్‌గూడ బెటాలియన్ పోలీస్ లైన్స్‌లో Jr.NTR, హృతిక్ వార్-2 మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ సా.5 నుంచి జరగనుంది. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, మైత్రీవనం, బోరబండ బస్టాప్, పలుచోట్ల వాహనాలు డైవర్ట్ చేస్తామని అధికారులు తెలిపారు. భారీగా ప్రజలు హాజరయ్యే అవకాశం ఉండటంతో పార్కింగ్ కోసం యూసుఫ్‌గూడ మెట్రో పార్కింగ్, సవేరా, మహమూద్ ఫంక్షన్ హాళ్లు (4వీలర్లకు మాత్రమే) అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.

News August 10, 2025

పాతబస్తీలో పెడిస్ట్రియన్ జో‌న్‌‌.. మీ కామెంట్?

image

HYD నగర సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెడుతోంది. పాతబస్తీ ఏరియాలో పెడిస్ట్రియన్ జోన్ ఏర్పాటు చేసే యోచనలో ఉంది. దీంతో పాటు పార్కింగ్ సమస్యలకు చెక్ పెట్టాలని CM రేవంత్ రెడ్డి తాజా మీటింగ్‌లోనూ అధికారులకు సూచించారు. చార్మినార్, సాలార్‌జంగ్ మ్యూజియం, హైకోర్టు, ఉస్మానియా ఆస్పత్రి లాంటి రద్దీ ఏరియాల్లో మల్టీ లెవెల్ పార్కింగ్ జోన్‌ల కోసం కార్యాచరణ సిద్ధం చేయాలని CM ఆదేశించారు. దీనిపై మీరేమంటారు?

News August 9, 2025

HYD: తమ్ముడికి ప్రాణం పోసిన అక్క

image

తమ్ముడి ప్రాణాలు కాపాడి ఆదర్శంగా నిలిచిన అక్క కథ ఇది. మహబూబ్‌నగర్‌కు చెందిన బాలుడు అప్లాస్టిక్‌ ఎనీమియా వ్యాధితో బాధపడుతూ KIMSలో అడ్మిట్ అయ్యాడు. మూల కణాల (Stem cells) మార్పిడి చేయాలని డాక్టర్లు చెప్పడంతో తన శరీరం నుంచి దానం చేసిన అక్క తమ్ముడికి పునర్జన్మ‌ను ప్రసాదించింది. ఆస్పత్రిలో ఉన్న తమ్ముడికి నేడు రాఖీ కట్టింది. ‘నేను నీకు రక్ష.. నువ్వు నాకు రక్ష’ అన్న నానుడికి ఈ సోదరి నిదర్శనం.

News August 9, 2025

జూబ్లీహిల్స్‌లో కుల రాజకీయం

image

జూబ్లీహిల్స్ బై‌పోల్ ముంగిట రాజకీయం ‘కుల’ రంగు పులుముకుంటోంది. కమ్మ కులానికి BRS అన్యాయం చేస్తోందన్న విమర్శలను ఆ పార్టీ నేతలు ఖండిస్తున్నారు. CMకు ప్రేమ ఉంటే కమ్మ నేతకే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. BRS కూడా ఆ సామాజికవర్గానికి చెందిన నేతనే నిలబెడుతుందని తేల్చిచెప్పారు. అయితే, సెగ్మెంట్‌లో కమ్మ ఓట్లు 50 వేలు ఉన్నాయని, పార్టీ ఏదైనా తమకే టికెట్ ఇవ్వాలని కమ్మ రాజకీయ ఐక్యవేదిక పట్టుబట్టడం గమనార్హం.