India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రభుత్వరంగ సంస్థలు, ప్రజల వివరాలను డేటా రూపంలో భద్రపరిచే సంస్థల సమాచారాన్ని సైబర్ నేరగాళ్లు దొంగిలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ ముప్పు తప్పించేందుకు HYD తార్నాకలోని ఉస్మానియా విశ్వవిద్యాలయం, కూకట్‌పల్లి జేఎన్టీయూల్లో కొత్త సాఫ్ట్‌వేర్ రూపకల్పనకు పరిశోధనలు కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
HMDA, GHMC పరిధిలో తొమ్మిదేళ్లలో హరితహార కార్యక్రమం కోసం ఖర్చు చేసిన నిధుల వివరాలను ఆయా శాఖలు వెల్లడించాయి. రెండిటి పరిధిలో దాదాపు రూ.1,110 కోట్లు ఖర్చు పెట్టాయి. HMDA రూ.974.85 కోట్లు,GHMC రూ.136.13 కోట్లు ఖర్చు పెట్టిందని పేర్కొంది. వచ్చే హరితహారం కార్యక్రమానికి ప్రణాళిక రూపొందించిన నేపథ్యంలో ఈ వివరాలు వెల్లడించింది.
మద్యం తాగిన యువకుడు వాంతులు చేసుకొని మృతి చెందిన ఘటన HYD గచ్చిబౌలి పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. అస్సాంకు చెందిన సీమంత దత్తా 2 నెలల క్రితం గచ్చిబౌలికి వలస వచ్చి సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. శుక్రవారం రాత్రి కేశవ్ నగర్‌లో ఉన్న సీమంత దత్తాని రూమ్‌మేట్ ప్రభాకర్ వెళ్లి చూడగా మద్యం తాగి వాంతులు చేసుకున్నాడు. రూమ్‌కి వెళ్దామనగా తర్వాత వస్తానన్నాడు. తిరిగి వచ్చి చూడగా మృతి చెందాడు.
ఎర్లీబర్డ్ పథకం కింద ఆస్తి పన్నుపై 5 శాతం రాయితీ లభిస్తుందని, నెలాఖరుతో పథకం ముగుస్తున్నందున ఆదివారం పన్ను వసూలు కేంద్రాలు తెరిచి ఉంటాయని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. జీహెచ్ఎంసీ కార్యాలయాల్లోని పౌర సేవా కేంద్రాలు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పని చేస్తాయని ఆయన వెల్లడించారు.
నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం గుమ్మడవెల్లి (దేవరోనితండా)కు చెందిన ఇస్లావత్ సిద్దు (20) శేరిగూడలోని ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటూ శ్రీదత్త ఇంజినీరింగ్ కాలేజీలో డిప్లొమా(EEE) 3వ సంవత్సరం చదువుతున్నాడు. శనివారం స్నేహితులతో కలిసి ఉండగా సిద్దు గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అప్రమత్తమైన తోటి విద్యార్థులు సిద్దును ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి వెళ్లే దారిలోనే సిద్దు కన్నుమూశాడు.
ఉప్పల్ స్టేడియంలో IPL టికెట్ల అమ్మకాల్లో కుంభకోణం జరిగిందని ఓవైపు పలు సంఘాలు ఆరోపిస్తుంటే సోషల్ మీడియా వేదికగా రెండు ఐపీఎల్ టికెట్లు రూ.5,000 అంటూ విక్రయానికి రెడీ అయ్యారు. SRH VS RCB మ్యాచ్ ఏప్రిల్ 25న జరగనుండగా, సోషల్ మీడియా వేదికగా తమ వద్ద టికెట్లు అందుబాటులో ఉన్నాయని, కావాలనుకున్న వారు సంప్రదించాలంటూ పోస్టులు పెడుతున్నారు. దీని పై అధికారులు స్పందించాల్సి ఉంది.
> చర్లపల్లి ఖైదీ కడుపులో ఇనుప మేకులు
> ధూల్ పేటలో భారీగా నల్లమందు స్వాధీనం
> గోల్నాకలో కిషన్ రెడ్డి జీప్ యాత్ర
> దోమలగూడలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్
> కాచిగూడలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం
> శిల్పారామంలో అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
> సికింద్రాబాద్ బస్‌స్టేషన్‌లో బాలిక మిస్సింగ్
> హైదరాబాద్‌లో FAKE డాక్టర్ అరెస్ట్
> నగరంలోని పలు ప్రాంతంలో కురిసిన వర్షం
చర్లపల్లి జైలు ఖైదీ మహ్మద్ షేక్ (32) ఇనుప మేకులు మింగి ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతూ ప్రాణాపాయస్థితిలో 4 రోజుల క్రితం గాంధీ ఆస్పత్రి ప్రిజనర్స్ వార్డులో చేరాడు. వైద్యపరీక్షలు నిర్వహించిన డాక్టర్లు కడుపులో మేకులు ఉన్నట్లు గుర్తించారు. గ్యాస్ట్రో ఎంట్రాలజీ HOD ప్రొ.శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో వైద్యులు ఎండోస్కోపీ ద్వారా 9 మేకులను బయటకు తీసి ప్రాణాలు కాపాడారు.
HYDలో నకిలీ డాక్టర్ గుట్టు రట్టయ్యింది. బట్టతలపై జుట్టు రప్పిస్తానని నమ్మిస్తున్న అస్లాంను సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. చర్మరోగాలు, హెయిర్ ట్రాన్స్‌ఫ్లాంట్‌కు చికిత్స చేస్తున్నట్లు గుర్తించారు. బహదూర్‌పురా, గచ్చిబౌలిలో ఏకంగా క్లినిక్‌లు ఓపెన్ చేయడం గమనార్హం. బాధితులకు సైడ్ ఎఫెక్ట్స్ రావడంతో పోలీసులను ఆశ్రయించారు. శనివారం రైడ్స్ చేసి అస్లాంను అరెస్ట్ చేశారు.
కంటోన్మెంట్ నియోజకవర్గంలో BRS పార్టీకి బిగ్ షాక్ తగిలింది. దివంగత నేత సాయన్న ప్రధాన అనుచరుడు ముప్పిడి మధుకర్ తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో, కంటోన్మెంట్ అభ్యర్థి శ్రీ గణేశ్ ఆధ్వర్యంలో హస్తం కండువా కప్పుకొన్నారు. ఇప్పటికే నియోజకవర్గ BRS ముఖ్య నేతలు చాలామంది కాంగ్రెస్‌లో చేరడంతో అధికార పార్టీ మరింత బలంగా తయారైంది.
Sorry, no posts matched your criteria.