Hyderabad

News April 18, 2024

HYD: JNTUHలో సైబర్ కోర్సులు

image

కూకట్పల్లిలోని JNTUHలో సైబర్ కోర్సులను అందిస్తున్నట్లు సైబర్ భద్రతా కేంద్రం ఆర్.శ్రీదేవి తెలిపారు. విద్యార్థులు, ఆచార్యులు, పరిశోధకులు సైబర్ భద్రత అంశాల పై అవగాహన పెంచుకుని నిపుణులవ్వాలనే లక్ష్యంతో ప్రత్యేక కోర్సును అందుబాటులోకి తీసుకువచ్చామని అన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల అధికారులు, ఉద్యోగులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నారు.

News April 18, 2024

HYD: రాజాసింగ్‌పై కేసు నమోదు

image

HYD నగరం గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కేసు నమోదు చేసినట్లు అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్ SHO లింగేశ్వర రావు తెలిపారు. గౌలిగూడ సమీపాన బాణసంచా కాల్చారని, ర్యాలీని ఆపి, భక్తులు, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించినట్లు పేర్కొన్నారు. మరోవైపు రాజాసింగ్ సహా జోగేందర్ సింగ్ బిట్టు పై కేసు నమోదు చేశారు. అనుమతులు లేకుండా భారీగా భక్తులతో శోభయాత్ర నిర్వహించారని సుమోటోగా కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు.

News April 18, 2024

బీఫామ్ అందుకున్న మల్కాజ్గిరి బీఆర్ఎస్ అభ్యర్థి

image

మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న రాగి లక్ష్మారెడ్డి ఇవాళ తెలంగాణ భవన్ నందు గులాబీ అధినేత సీఎం కేసీఆర్ చేతుల మీదుగా బీఫామ్ అందుకున్నారు. మల్కాజ్గిరి గడ్డపై గులాబీ జెండా ఎగరవేస్తామని లక్ష్మారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షులు కేటీఆర్, ఎమ్మెల్యేలు చామకూర మల్లారెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి ఉన్నారు.

News April 18, 2024

HYD: రేప్ కేసులో మైనర్ బాలునికి జైలు శిక్ష

image

ఆమనగల్లు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రేప్ కేసులో మైనర్ బాలుడి(17)కి గురువారం రంగారెడ్డి జిల్లా జువైనల్ కోర్టు జడ్జి ఒక సంవత్సరం జైలు శిక్ష, రూ.4వేల జరిమానా విధించినట్లు ఎస్సై బలరాం చెప్పారు. 2018లో జరిగిన ఘటనలో కేసు విచారణలో భాగంగా జైలు శిక్ష, జరిమానా విధించినట్లు ఎస్సై వివరించారు. నేరంపై వెంటనే స్పందించి సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులను అధికారులు అభినందించారు.

News April 18, 2024

HYD: FREE కోచింగ్ కోర్సులు.. అర్హతలు

image

HYD నగరం NACలో గ్రామీణ యువకులకు ఉచిత కోచింగ్..
✓స్టోర్ సూపర్వైజర్-డిగ్రీ
✓స్ట్రక్చర్ సూపర్వైజర్-ఇంటర్
✓లాండ్ సర్వేయర్-ఇంటర్
✓ఎలక్ట్రికల్,హౌజ్ వైరింగ్- SSC
✓ప్లంబింగ్ అండ్ శానిటేషన్, డ్రైవాల్ అండ్ ఫాల్ సీలింగ్,వెల్డింగ్,పెయింటింగ్, డెకొరేషన్-5వ తరగతి
✓డ్రైవాల్ అండ్ ఫాల్ సీలింగ్- 5వ తరగతి
✓JCB బ్యాక్ హోల్డర్ ఆపరేటర్-5వ తరగతి చదివిన వారు అర్హులు
•ఆసక్తి కల వారు NAC విద్యాసంస్థలో సంప్రదించండి

News April 18, 2024

సికింద్రాబాద్: బీఫామ్ అందుకున్న ఎంపీ అభ్యర్థి

image

తెలంగాణ భవన్లో BRS అధ్యక్షుడు కేసీఆర్ అధ్యక్షతన జరిగిన పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి తీగుల్ల పద్మారావు గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పద్మారావుకు కేసీఆర్ బీ ఫా అందజేశారు. సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానాన్ని ఈసారి బీఆర్ఎస్ కైవసం చేసుకోనుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

News April 18, 2024

కంటోన్మెంట్: నివేదితకు బీఫాం అందజేసిన కేసీఆర్

image

కంటోన్మెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత సాయన్నకు కేసీఆర్ బీఫాంను, రూ.40 లక్షల చెక్కును తెలంగాణ భవన్‌లో అందించారు. ఎన్నికల్లో విజయఢంకా మోగించాలని కేసీఆర్ ఆమెను ఆశీర్వదించారు. ఎన్నికల ప్రచారాన్ని ఉదృతంగా నిర్వహించి, ప్రజలందరి మన్ననలు పొందాలని సూచించారు. సర్వేలు, దివంగత ఎమ్మెల్యేలు సాయన్న-లాస్యనందిత అందించిన సేవలవైపే ఉన్నాయని అన్నారు.

News April 18, 2024

HYD: JNTUH పరీక్ష ఫీజుల స్వీకరణ తేదీలు

image

కూకట్పల్లిలోని JNTUH యూనివర్సిటీలో బీటెక్ ఇంజనీరింగ్ కోర్సులకు సంబంధించి వివిధ సెమిస్టర్ల పరీక్ష ఫీజుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైందని అధికారులు తెలియజేశారు. విద్యార్థులు పరీక్ష ఫీజులను చెల్లించాలని JNTUH సూచించింది. ఎలాంటి అధికారం లేకుండా నేటి నుంచి మే రెండవ తేదీ వరకు అవకాశం ఉన్నట్లుగా పేర్కొంది. తర్వాత ఫీజు చెల్లిస్తే అధిక రుసుము చెల్లించాల్సి ఉంటుందని తెలియజేసింది.

News April 18, 2024

HYD: FAKE ప్రచారం చేయకండి: TSSPDCL

image

HYD నాంపల్లి కోర్టులో నేడు మధ్యాహ్నం క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తుండగా పవర్ కట్ అయిందని, చీకటిలోనే జడ్జి వాదనలు విన్నారని కొందరు X వేదికగా వైరల్ చేశారు. దీని పై స్పందించిన TSSPDCL, నిర్ధారించని, తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయొద్దని కోరింది. కరెంటు సరఫరాలో ఎలాంటి సమస్య లేదని, అంతర్గత సమస్య వెళ్లే జరిగిందని తెలిపింది. ఫిర్యాదు చేసిన లాయర్ విజయ్ గోపాల్ సైతం దగ్గరుండి చూశారని పేర్కొంది.

News April 18, 2024

HYD: ప్రజలారా.. జాగ్రత్త..! ఎండ దంచి కొడుతోంది

image

HYD, RR, MDCL, VKB జిల్లాలలో నేటి నుంచి రాగల 5 రోజుల వరకు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు మెట్రోలాజికల్ డిపార్ట్‌మెంట్ తెలియజేసింది. ఏకంగా 41 నుంచి 44 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేసింది. పలుచోట్ల వేడిగాలులు వీచే అవకాశం ఉందని, కావున ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని తెలియజేసింది.

error: Content is protected !!