Hyderabad

News April 18, 2024

నా గెలుపును ఎవరూ ఆపలేరు: ఈటల రాజేందర్

image

మల్కాజిగిరి పార్లమెంట్ బరిలో తన గెలుపును ఎవరూ ఆపలేరని BJP అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. నామినేషన్ దాఖలుకు ముందు తన ఇంటి వద్ద ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. మల్కాజిగిరిలో ధర్మానికి, అధర్మానికి జరిగే యుద్ధమే ఈ ఎన్నికలు అని అభివర్ణించారు. కొందరు దొంగ సర్వేలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఈటల ఆరోపించారు.

News April 18, 2024

HYD: ఎన్నికలు.. బయటపడుతున్న నోట్ల కట్టలు

image

ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుంచి ఇప్పటివరకు ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాల తనిఖీల్లో రూ.14,31,65,540 నగదు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. రూ.2,00,13,088 విలువైన ఇతర వస్తువులు, 20,441.89 లీటర్ల మద్యాన్ని సీజ్ చేశామన్నారు. 185 మందిపై కేసులు నమోదు చేయగా, 181 మందిని అరెస్టు చేసినట్లు రోనాల్డ్ రాస్ వివరించారు.

News April 18, 2024

హైదరాబాద్‌లో 5 లక్షల ఓట్ల తొలగింపు

image

HYDలో జనవరి 2023 నుంచి ఇప్పటివరకు ఓటర్ల జాబితాను సవరించినట్లు జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ తెలిపారు. 5 లక్షలకు పైగా ఓట్లను తొలగించారు.
తొలగించిన ఓట్ల వివరాలు:
వేరే ప్రాంతాలకు వెళ్లిన ఓట్లు: 4,39,801
డూప్లికేట్ ఓట్లు: 54,259
మరణించిన వారి ఓట్లు: 47,141.
FEB 8, 2024 వరకు జిల్లాలో మొత్తం 45,70,138 మంది ఓటర్లు ఉన్నారు.
https://voters.eci.gov.in/login ద్వారా చెక్‌ చేసుకోవచ్చు.
SHARE IT

News April 18, 2024

హైదరాబాద్‌: MP అభ్యర్థుల నామినేషన్ ఇక్కడే!

image

HYD, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి MP ఎన్నికలు, కంటోన్మెంట్ ఉప ఎన్నిక ప్రశాంత వాతావరణంలో జరిగేలా సహకరించాలని అధికారులు సూచిస్తున్నారు.
అభ్యర్థులు నామినేషన్ వేసే కేంద్రాలు:
HYD లోక్‌సభ: హైదరాబాద్‌ కలెక్టరేట్‌
SEC లోక్‌సభ: సికింద్రాబాద్‌ జోనల్ ఆఫీస్
మల్కాజిగిరి: మేడ్చల్ కలెక్టరేట్
చేవెళ్ల: రాజేంద్రనగర్‌ RDO ఆఫీస్
కంటోన్మెంట్: CNT CEO (రిటర్నింగ్ అధికారి)
నేటి నుంచి 25 వరకు స్వీకరిస్తారు.

News April 18, 2024

హైదరాబాద్‌లో‌ ఇవి FAMOUS

image

చారిత్రక సంపదకు పుట్టినిల్లు మన హైదరాబాద్‌. నగర నిర్మాణ చిహ్నానికి చార్మినార్, 12వ శతాబ్దంలో నిర్మించిన గోల్కొండ కోట, రాజభవనాలకు కేరాఫ్‌గా చౌమహల్లా ప్యాలెస్‌, మాల్వాల ప్యాలెస్‌లు ఉన్నాయి. కళా ప్రపంచంలో సలార్‌జంగ్ మ్యూజియం ఓ మాస్టర్ పీస్. ట్యాంక్‌బండ్, కుతుబ్‌ షాషీ టూంబ్స్‌, మక్కా మసీద్, తారామతి బరాదారి, తోలి(డమ్రి) మసీద్, పైగా టూంబ్స్, స్పానీష్ మసీద్‌ HYD చరిత్రకు ఆనవాళ్లు. నేడు World Heritage Day

News April 18, 2024

HYD: 40 శాతం మందికే వాటర్‌ మీటర్లు!

image

HYD నగరంలో HMWSSB పరిధిలో దాదాపు 13.5 లక్షల మంది వినియోగదారులు ఉండగా కేవలం సుమారు 5 లక్షల వరకు, అంటే 40 శాతానికి తక్కువ మందికి మాత్రమే వాటర్ మీటర్లు ఉండడం గమనార్హం. HMWSSB రికార్డుల ప్రకారం మీటర్లు అంతంత మాత్రమే ఉండటంతో నల్లాలకు మోటర్లు పెట్టి నీటిని లాగేస్తున్నా తెలియని పరిస్థితి. నీటి ఎద్దడికి ఇదొక కారణంగా కనిపిస్తోంది. దీనిపై దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.

News April 17, 2024

HYD: ఓవైపు ఎండలు.. మరోవైపు వర్షం

image

గ్రేటర్ HYD నగరంలోని అనేక ప్రాంతాల్లో మధ్యాహ్నం ఎండలు దంచి కొడుతూనే, సాయంత్రం పలుచోట్ల వర్షం కురిసింది. HYD జియాగూడ రంగనాథ కమ్యూనిటీ హాల్ వద్ద నేడు 41.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు TSDPS తెలిపింది. మరోవైపు మేడ్చల్, రాజేంద్రనగర్, నార్సింగి, KPHB ప్రాంతాల్లో సాయంత్రం వేళ వర్షం కురిసింది. ప్రస్తుతం ఉప్పల్, హబ్సిగూడ ప్రాంతాల్లోనూ చిరుజల్లులతో కూడిన వర్షం కురుస్తుంది.

News April 17, 2024

HYD: వామ్మో.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిస్థితి ఇది!

image

HYD నగరంలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కిక్కిరిసిపోతుంది. వేసవి వేళ HYD నగరంలో నివసిస్తున్న విద్యార్థులు, ఉద్యోగులు, ఇతరులు భారీ సంఖ్యలో ప్రయాణం సాగిస్తుండటంతో ఈ పరిస్థితి ఏర్పడిందని రైల్వే అధికారులు తెలిపారు. పదుల సంఖ్యలో సమ్మర్ స్పెషల్ రైళ్లను నడుపుతున్నప్పటికీ సరిపోవడం లేదు. ప్రస్తుత రద్దీని చూసి, నేడు మరో 10 స్పెషల్ రైళ్లకు SCR అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

News April 17, 2024

సికింద్రాబాద్ స్టేషన్ నుంచి మరికొన్ని స్పెషల్ ట్రైన్లు

image

వేసవి వేళ రద్దీని పరిగణనలోకి తీసుకున్న సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు సికింద్రాబాద్ సహా పలు స్టేషన్ల నుంచి మరికొన్ని స్పెషల్ ట్రైన్లను నడపనున్నట్లు వెల్లడించారు. సికింద్రాబాద్ నుంచి నిజాముద్దీన్ జంక్షన్ వెళ్లేందుకు ఏప్రిల్ 21, 28, మే 5, 12, 19, 26, జూన్ 2, 9, 16, 23, 30వ తేదీలలో సికింద్రాబాద్ స్టేషన్ నుంచి అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు.

News April 17, 2024

HYD: శ్రీరామ శోభాయాత్రలో దొంగల బీభత్సం

image

శ్రీరామ శోభాయాత్రలో దొంగలు చేతివాటం చూపించారు. పలువురు భక్తుల నుంచి సెల్‌ఫోన్లు, ఆభరణాలు అపహరించారు. దాదాపు 16 సెల్‌ఫోన్లు, 3 బంగారు గొలుసులు, ఒక బ్రాస్‌లెట్ చోరీ చేసినట్లు తెలుస్తోంది. దీంతో బాధితులు పాతబస్తీ మంగళ్‌హాట్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.

error: Content is protected !!