Hyderabad

News April 17, 2024

వివిధ బీఈడీ కోర్సుల పరీక్షా ఫలితాల విడుదల

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ బీఈడీ కోర్సుల పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. బీఈడీ (ఎంఆర్ఐ), బీఈడీ (ఎల్డీ), బీఈడీ (హెచ్ఐ), బీఈడీ (ఏఎస్ఐ) తదితర కోర్సుల సెమిస్టర్ ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.

News April 17, 2024

ఓయూ పరిధిలోని బీసీఏ పరీక్షా ఫీజు స్వీకరణ

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీసీఏ కోర్సు పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. బీసీఏ రెండు, నాలుగు, ఆరో సెమిస్టర్ మెయిన్, అన్ని సెమిస్టర్ల బ్యాక్ లాగ్ పరీక్షా ఫీజును ఈనెల 30లోగా సంబంధిత కళాశాలలో చెల్లించాలని చెప్పారు. ఈ పరీక్షలను వచ్చే నెలలో నిర్వహించనున్నట్లు తెలిపారు.

News April 17, 2024

HYD: వాహన తనిఖీలు.. నగదు స్వాధీనం

image

శంషాబాద్ మండలం పాలమాకుల వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో కారులో తరలిస్తున్న రూ.5 లక్షల 35 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిస్సాన్ కారులో హైదరాబాద్ నుంచి షాద్ నగర్ వైపు వెళ్తున్న రంజిత్ గౌడ్ అనే వ్యక్తి వద్ద స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగదుకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో సీజ్ చేశారు.

News April 17, 2024

BRS ఏనాడు పట్టించుకోలేదు: సునీత మహేందర్ రెడ్డి

image

మల్కాజ్గిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు యునైటెడ్ హైదరాబాద్ ఫ్రంట్ తమిళ్స్ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఎంపీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. తమిళ్ భవన్ కోసం ఎన్నో సార్లు BRS ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా.. పట్టించుకోలేదని, యునైటెడ్ HYD తమిళ్ ఫ్రంట్ అధ్యక్షులు సాయి కాంత్ అన్నట్లుగా తెలియజేశారు.

News April 17, 2024

శ్రీరాముడు అందరికీ ఆదర్శప్రాయుడు: స్పీకర్ గడ్డం

image

శ్రీరాముడు అందరికీ ఆదర్శప్రాయుడని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలియజేశారు. లంగర్ హౌస్‌లోని త్రివేణి సంగమం ఆలయంలో నిర్వహించిన శ్రీరామనవమి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతారాములను దర్శించుకున్నారు. అనంతరం ఆలయ పీఠాధిపతి రాహుల్ దాస్ బాబా ఆయనకు వేద ఆశీర్వచనం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. శ్రీరాముని అడుగుజాడల్లో నడవాల్సిన అవసరం ఉందన్నారు.

News April 17, 2024

HYD: మహిళ అనుమానాస్పద మృతి

image

ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన మేడ్చల్ PS పరిధి రైల్వే కాలనీలోని ఓ వెంచర్‌లో జరిగింది. కుళ్లిపోయిన మహిళ మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలంలో ఉన్న ఆధారాలను సేకరించి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మహిళ వయసు సుమారు 45 నుండి 50 ఉంటుందని భావిస్తున్నారు.

News April 17, 2024

HYDలో ఆదివారం మటన్‌ షాపులు బంద్

image

ఏప్రిల్ 21న (ఆదివారం) మహవీర్‌ జయంతి వేడుకలు నిర్వహించేందుకు జైనులు సిద్ధమయ్యారు. గ్రేటర్ హైదరాబాద్‌లో‌ వీరి సంఖ్య ఎక్కువే ఉండడంతో ఆ రోజు భారీ ర్యాలీలు తీయనున్నారు. ఈ నేపథ్యంలోనే GHMC పరిధిలో మాంసం దుకాణాలు (మటన్, పశువుల కబేళాలు, బీఫ్ షాపులు) మూసివేయనున్నారు. ఇందుకు సంబంధించి బల్దియా కమిషనర్ రోనాల్డ్ రాస్ ఆదేశాలు జారీ చేశారు.
SHARE IT

News April 17, 2024

హైదరాబాద్: ఫామ్‌హౌస్‌లో మర్డర్

image

హైదరాబాద్ శివారులో దారుణం జరిగింది. చేవెళ్ల మండలంలోని ఊరేళ్ళ గ్రామ సమీపంలోని ఓ ఫామ్‌హౌస్‌లో నారాయణ దాస్ (46)‌ హత్యకు గురయ్యారు. CI లక్ష్మారెడ్డి వివరాల ప్రకారం.. చేవెళ్ల గ్రామానికి చెందిన నారాయణ దాస్‌‌‌ను వరుసకు బావమరిది అయిన తూర్పటి భాస్కర్ గొడ్డలి‌తో నరికి హత్య చేసినట్లు వెల్లడించారు. అనంతరం చేవెళ్ల PSలో నిందితుడు లొంగిపోయినట్లు తెలిపారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News April 17, 2024

HYD: తొలి ప్రయత్నంలోనే 112వ UPSC ర్యాంకు

image

HYDలోని చైతన్యపురికి చెందిన గాడిపర్తి సాహి దర్శిని UPSCలో 112వ ర్యాంకు పొందారు. ఆమె తల్లి హైకోర్టులో న్యాయవాది, తండ్రి ప్రైవేటు స్కూల్ నిర్వాహకుడు. ఇంటర్ వరకూ HYDలోనే చదువుకున్నారు. ఐఐటీ పట్నాలో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. పేదవారికి సేవ చేయాలన్నదే తన లక్ష్యమని సాహి దర్శిని పేర్కొన్నారు.

News April 17, 2024

HYD: ఫిలింనగర్‌లో యువతితో వ్యభిచారం.. RAIDS

image

వ్యభిచార గృహాలపై HYD పోలీసులు దాడులు కొనసాగిస్తున్నారు. తాజాగా ఫిలింనగర్ రోడ్‌ నం.8లో రైడ్స్ చేశారు. ‘అపార్ట్‌మెంట్‌లోని ఓ ఫ్లాట్‌లో వ్యభిచారం జరుగుతోందన్న సమాచారం మేరకు దాడులు చేశాం. సబ్‌ఆర్గనైజర్‌, విటుడిని అరెస్ట్ చేశాం. దీపక్‌ అనే వ్యక్తి ఆన్‌లైన్‌ ద్వారా ఈ దందా చేస్తున్నట్లు గుర్తించాం’ అని బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు. వ్యభిచారకూపంలో మగ్గుతున్న యువతి(22)ని స్టేట్‌ హోంకు తరలించారు.

error: Content is protected !!