India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
RANK 50: KN చందన జాహ్నవి, హిమాయత్‌నగర్
82: మెరుగు కౌశిక్, హబ్సిగూడ
112: సాహి దర్శిని, చైతన్యపురి
231: తరుణ్, మంచన్‌పల్లి, పూడూరు-VKB
312: ముస్తఫా హష్మి, హైదరాబాద్
411: నందిరాజు శ్రీమేఘనాదేవి, హైదరాబాద్
545: నరేంద్ర పడాల, కోహెడ, తుర్కయాంజాల్-RR
649: ఐశ్వర్య నెల్లి శ్యామల, హైదరాబాద్
770: మహమ్మద్ అష్ఫక్, పెద్దేముల్-VKB
891: K. శశికాంత్, షాద్‌నగర్-RR
SHARE IT
శ్రీరామనవమి వేడుకలకు భాగ్యనగరం ముస్తాబైంది. సీతారాంబాగ్ టెంపుల్, ఆకాశ్‌పురి హనుమాన్ టెంపుల్ నుంచి భారీ శోభాయాత్రలు ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతాయి. పలు వీధుల గుండా కొనసాగి హనుమాన్ వ్యాయామశాల వద్ద యాత్ర ముగుస్తుంది. ఇందుకు హైదరాబాద్ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. నగరంలోని రామాలయాల్లో కళ్యాణానికి ముహూర్తం పెట్టారు. నేడు జైశ్రీరాం నినాదాలతో హైదరాబాద్ హోరెత్తనుంది.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఉపఎన్నికకు 500 వరకు బ్యాలెట్ కంట్రోల్ యూనిట్లు, వీవీ ప్యాట్లు అందుబాటులో ఉంటాయన్నారు. కంటోన్మెంట్ పరిధిలో దాదాపుగా 2.51 లక్షల మంది ఓటర్లు ఉన్నారని, 232 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
రాష్ట్ర రాజధాని HYD నగరానికి 3D చిత్రం రాబోతుంది. గ్రేటర్ విస్తీర్ణాన్ని డ్రోన్లతో రికార్డు చేసి, తద్వారా వచ్చే బేస్ మ్యాప్ పై క్షేత్రస్థాయి సర్వేలో తీసే ఫొటోలు, ఇతర వివరాలను పొందుపరుస్తారు. దీని పై GHMC ఐటీ విభాగం భారీ కసరత్తు చేసింది. మొదట ఆస్తిపన్ను ఆదాయాన్ని పెంచుకునేందుకు, తాగునీరు, విద్యుత్తు కనెక్షన్లు, నగరంలోని ఎత్తుపల్లాలు, నిర్మాణాలను సైతం డిజిటలైజ్ చేయనున్నారు.
భార్యాభర్తలు గొడవపడి మనస్థాపంలో భర్త రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన కాచిగూడ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. రైల్వే ఇన్స్పెక్టర్ ఆర్.ఎల్లప్ప తెలిపిన వివరాల ప్రకారం.. మలక్ పేట్ ప్రాంతానికి చెందిన విశ్రాంత సహాకార ఉద్యోగి ఎన్.సుదర్శన్(63) మలక్ పేట్-కాచిగూడ రైల్వే స్టేషన్ల మధ్య మంగళవారం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు.
జువైనల్ హోమ్(బాలికల సదన్) నుంచి ఓ బాలిక పారిపోయిన ఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. ఎస్సై నరేష్ కుమార్ వివరాల ప్రకారం.. మంగళ్ హాట్ ప్రాంతానికి చెందిన హనుమంతు కుమార్తె ప్రియగిరి(17)ని కాచిగూడలోని బాలికల సదన్‌కు 2023 జనవరిలో తీసుకువచ్చారు. మంగళవారం బాలికల సదన్ నుంచి గోడ దూకి పారిపోయింది. సూపర్ వైజర్ సావిత్రి కాచిగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
HYD, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో క్రికెట్ ప్రియులకు ‘HYD క్రికెట్ అసోసియేషన్’ శుభవార్త తెలిసింది. ఇప్పటికే ఉచిత క్రికెట్ శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసినట్లు ‘HCA అధ్యక్షులు జగన్ మోహన్ రావు తెలిపారు. ఈనెల 18 వరకు https://www.hycricket.org/data-2024-25/summer-camp-apr-2024/sc-regn.html వెబ్సైట్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఈనెల 21 నుంచి క్రికెట్ ఉచిత శిక్షణ ప్రారంభం అవుతుందన్నారు. SHARE IT
HYD నగరంలోని ఖైరతాబాద్ RTA కోడ్ TG 09తో ప్రారంభమై 4 అంకెల నెంబర్లతో ముగుస్తుంది. ప్రతి RTA కార్యాలయం పరిధిలో తొలి 10 వేల నెంబర్లను ఇలానే అందించినట్లు అధికారులు తెలిపారు. ఆ తర్వాత మధ్యలో, ఆంగ్ల అక్షరాలతో సిరీస్ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. గత కొద్ది రోజులుగా HYD నగరంలో వివిధ RTA కార్యాలయాల పరిధిలో ఆంగ్ల అక్షరాలు లేకుండానే వాహనాల నెంబర్ ప్లేట్లు వస్తున్నాయని ప్రజలు అనటం పై అధికారులు స్పందించారు.
మాజీ MP మందా జగన్నాథ్ కాంగ్రెస్‌ను వీడనున్నట్లు తెలుస్తోంది. BSP అధినేత్రి మాయావతిని దిల్లీలో రేపు కలవనున్నట్లు సమాచారం. నాగర్ కర్నూల్ MP బరిలో ఉంటారని పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ హామీ ఇచ్చి విస్మరించిందని, KCR కంటే రేవంత్ రెడ్డి నియంతృత్వంగా వ్యవహరిస్తున్నాడనే ఆరోపణ చేస్తున్నట్లు తెలుస్తుంది. నెలలుగా CMతో మాట్లాడేలా ప్రయత్నిస్తే EX MLA సంపత్ కుమార్ దూరం పెట్టారని సమాచారం.
వికారాబాద్ జిల్లా అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్‌గా ఉమా హారతిని కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంగళవారం అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్‌గా ఉమా హారతి, IAS, 2022-23 వికారాబాద్ జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పరిపాలనపై పట్టు సాధించి భవిష్యత్తులో ప్రజలకు ఉన్నత సేవలు అందించి మంచి పేరు సంపాదించేలా కృషి చేస్తానని ట్రైనీ కలెక్టర్ ఉమాహారతి అన్నారు.
Sorry, no posts matched your criteria.