Hyderabad

News April 16, 2024

HYD: మొదటి ట్రైన్ ప్రారంభమై నేటికి 171 ఏళ్లు!

image

భారతదేశంలో మొట్ట మొదటి ప్యాసింజర్ ట్రైన్ 16 ఏప్రిల్ 1853న బాంబే నుంచి థానే వరకు వెళ్లేందుకు ప్రారంభమైనట్లు HYD సికింద్రాబాద్ SCR అధికారులు X వేదికగా తెలిపారు. 171 ఏళ్ల సర్వీస్ అందించిన ట్రైన్ తీపి జ్ఞాపకాలు కోట్లాదిమంది గుండెల్లో చోటు సంపాదించుకున్నాయని పేర్కొన్నారు. రవాణా చరిత్రలోనే ఇదొక మైలురాయిగా అభివర్ణించారు.

News April 16, 2024

HYD: ఎంఫార్మసీ పరీక్షా ఫలితాల విడుదల

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంఫార్మసీ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని స్పెషలైజేషన్ల ఎంఫార్మసీ(సీబీసీఎస్) సెమిస్టర్ ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.

News April 16, 2024

లాలాగూడ: పోలీసుల అదుపులో దొంగలు

image

అర్ధరాత్రులు రోడ్లపై సంచరిస్తూ ఒంటరిగా ఉన్న వారిని బెదిరించి డబ్బు, నగలు దోచుకుంటున్న ఐదుగురిని లాలాగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్ఛార్జి CI రమేశ్ మాట్లాడుతూ.. మల్కాజిగిరిలోని BJR నగర్‌కు చెందిన మహ్మద్ తౌసిఫ్ లియాస్ గోడా(19), నలుగురు మైనర్ స్నేహితులతో కలిసి దొంగతనాలకు పాల్పడుతున్నట్లుగా తెలిపారు. ఈస్ట్ జోన్ డీసీపీ గిరిధర్, చిలకలగూడ ఏసీపీ జైపాల్ రెడ్డిలు పోలీసులను అభినందించారు.

News April 16, 2024

GET READY: హైదరాబాద్‌ సిద్ధం

image

రేపటి శ్రీ రామనవమి వేడుకలకు హైదరాబాద్‌ సిద్ధమైంది.‌ రాముడి శోభాయాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈస్ట్ జోన్ డీసీపీ గిరిధర్ రావు తెలిపారు. మంగళవారం శోభాయాత్ర ముగింపు ప్రాంగణమైన సుల్తాన్‌బజార్‌లోని హనుమాన్ వ్యాయామశాలను ఆయన సందర్శించారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో యాత్రను శాంతియుతంగా నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించినట్లు వివరించారు.

News April 16, 2024

HYD: నాగోల్‌లో బాలికను బెదిరించి అత్యాచారం

image

బాలికపై యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన నాగోల్‌లో వెలుగుచూసింది. పోలీసుల వివరాల ప్రకారం.. నాగోల్ PS పరిధికి చెందిన రాకేశ్ (29) ప్రైవేటు ఉద్యోగి. కొంతకాలంగా ఓ బాలిక(13)తో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఇటీవల ఆమెను బెదిరించి అత్యాచారం చేశాడు. బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. సోమవారం నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.

News April 16, 2024

హైదరాబాద్‌: మధ్యాహ్నం RTC బస్సులకు REST

image

ఎండలు దంచికొడుతున్న వేళ TSRTC కీలక నిర్ణయం తీసుకొంది. మధ్యాహ్నం HYDలో బస్సు సర్వీసుల సంఖ్యను తగ్గిస్తున్నట్లు RTC గ్రేటర్ జోన్ ED వెంకటేశ్వర్లు వెల్లడించారు. ఎండల ప్రభావానికి ప్రయాణికులు రోడ్డెక్కడం లేదని గుర్తించామన్నారు. ఈ సమయంలో ట్రిప్పులను తగ్గించనున్నట్లు స్పష్టం చేశారు. ఉదయం 5 నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు సర్వీసులు ఉంటాయని.. 12PM నుంచి 4PM మధ్యలో పరిమితంగా బస్సులను నడపనున్నారు.SHARE IT

News April 16, 2024

హైదరాబాద్‌ వాసులకు OFFER

image

హైదరాబాద్‌ వాసులకు ముఖ్య గమనిక. బల్దియా అధికారులు ఎర్లీబర్డ్‌ స్కీమ్ అందుబాటులోకి తీసుకొచ్చారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్నును చెల్లిస్తే 5 శాతం రిబేట్‌ పొందవచ్చని కమిషనర్ రోనాల్డ్ రాస్ స్పష్టం చేశారు. ఏప్రిల్ 30వ తేదీ వరకు అవకాశం ఇచ్చారు. GHMC పరిధి ప్రజలు సద్వినియోగం చేసుకోండి.
SHARE IT

News April 16, 2024

HYD: రూ. 5కే కూల్ వాటర్

image

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ వెళ్లే ప్రయాణికులకు గుడ్‌న్యూస్. వేసవి వేళ మంచినీటి వసతిని SCR అధికారులు మెరుగుపరిచారు. సాధారణ తాగునీటితో పాటుగా, కూల్‌ వాటర్‌ను రూ.5కే అందిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా కూలర్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం 170 స్టేషన్లలో 468 వాటర్ కూలర్లను అందబాటులోకి తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని పరిశీలిస్తున్నట్లు తెలియజేశారు.

News April 15, 2024

కూకట్‌పల్లిలో డెలివరీ బాయ్ సూసైడ్

image

కూకట్‌పల్లి PS పరిధి ప్రకాశ్‌నగర్‌లో విషాదం నెలకొంది. సోమవారం రమేశ్ (20) అనే డెలివరీ బాయ్ ఆత్మహత్య చేసుకొన్నాడు. SI రామకృష్ణ వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా సీతారాంనగర్‌కి చెందిన రమేశ్ ప్రకాశ్‌నగర్‌లో నివాసం ఉంటూ డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. ఇంట్లో పరిస్థితులు, వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

News April 15, 2024

HYD: నకిలీ టికెట్‌తో విమానం ఎక్కిన వ్యక్తి అరెస్ట్

image

నకిలీ టికెట్‌తో విమానం ఎక్కిన ఓ వ్యక్తి శంషాబాద్ విమానాశ్రయంలో అరెస్ట్ అయ్యాడు. APలోని NTR జిల్లాకు చెందిన వ్యక్తి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమాన సర్వీసులో గోవా వెళ్లడానికి టికెట్‌ను తీసుకొని గోవా విమానంలో కూర్చున్నాడు. ఆయన బంధువు కోటేశ్వర్ రావు అదే నంబర్‌తో టికెట్, వెబ్ బోర్డింగ్ పాస్ సృష్టించి గోవా విమానంలో కూర్చోగా.. చెక్ చేసి నకిలీ టికెట్‌గా గుర్తించారు. దీంతో భద్రతాధికారులు అరెస్ట్ చేశారు.

error: Content is protected !!