India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ చరిత్రలోనే మే 13వ తేదీన జరగనున్న ఎన్నిక రెండో ఉప ఎన్నిక. 1957లో ఆవిర్భవించిన కంటోన్మెంట్ నియోజకవర్గంలో 1969లో అప్పటి ఎమ్మెల్యే రామారావు మృతితో తొలిసారిగా ఉపఎన్నిక జరిగింది. 2024లో ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో మే 13న రెండో ఉప ఎన్నిక జరగనుంది. BRS నుంచి లాస్య నివేదిత, కాంగ్రెస్ నుంచి శ్రీగణేశ్ బరిలో ఉండగా.. బీజేపీ ఇంకా ఖరారు చేయలేదు.
కేంద్ర ప్రభుత్వ ఆమోదిత నేషనల్ అకాడమి ఆఫ్ సైబర్ సెక్యూరిటీ ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్ కోర్సుల ఆన్‌లైన్ శిక్షణకు HYD, RR, MDCL,VKB జిల్లాల యువతి, యువకుల నుంచి దరఖాస్తులను కోరుతున్నట్లు డైరెక్టర్ విమలారెడ్డి తెలిపారు. ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ పాలిటెక్నిక్, డిప్లొమా విద్యార్థులు ఏప్రిల్ 15వ తేదీలోపు https://www.nacsindia.org ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.SHARE IT
డా.బీఆర్ అంబేడ్కర్ జయంతి రోజున ఆ మహనీయుడిని కాంగ్రెస్ ప్రభుత్వం అవమానించిందని TSPSC మాజీ ఛైర్మన్ గంటా చక్రపాణి, BRS సోషల్ మీడియా నేత చందు షేక్స్ విమర్శించారు. సచివాలయం పక్కనే ఉన్న భారీ విగ్రహాన్ని కనీసం పూలతో అలంకరించలేదని సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేశారు. ఇలాంటి ప్రతీకారాలు రాజకీయాల్లో ఒకే, కానీ రాజ్యాంగ ప్రాధాత, జాతిపితతో వద్దు అంటూ గంటా చక్రపాణి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
HYD శివారులోని ఓ ఫామ్‌హౌస్‌పై పోలీసులు రైడ్స్ చేశారు. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని వ్యవసాయ క్షేత్రంలో విదేశీ మద్యం అమ్ముతున్నారని ఎక్సైజ్ పోలీసులకు సమాచారం అందింది. ఆదివారం మెరుపుదాడులు చేసిన బృందం పలు రకాల ఫారిన్ లిక్కర్ బాటిల్స్‌ను స్వాధీనం చేసుకొన్నారు. ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఇక్కడ జరిగే పార్టీలకు అక్రమంగా విదేశీ మద్యం సరఫరా చేసి సొమ్ము చేసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు.
HYD నగరంలో మూసీ రివర్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులోని అన్ని అంశాల సాధ్యాసాధ్యాలను అధికారులు పరిశీలించారు. డీపీఆర్, కాన్సెప్ట్ మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు నిర్దిష్ట కాలపరిమితిని నిర్ణయించారు. 2024 ఆగస్టు నెలాఖరులోగా మాస్టర్ ప్లాన్ ముసాయిదా సిద్ధమవుతుందని MRFDC ఎండీ ఆమ్రపాలి చెప్పారు. మొదటిదశలో ఉస్మాన్‌సాగర్ నుంచి గౌరెల్లి ORR, హిమాయత్‌సాగర్ నుంచి బాపూఘాట్ వరకు 55KM మూసీ అభివృద్ధి పై ఫోకస్ పెట్టారు.
KCR సారథ్యంలో విద్యార్థులు, యువకులు, అన్ని వర్గాల ప్రజల పోరాటంతోనే తెలంగాణను సాధించుకున్నామని.. సాధించుకున్న రాష్ట్రంలో అంబేడ్కర్ ఆశయ సాధనకు పదేళ్లు తమ ప్రభుత్వం పనిచేసిందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR అన్నారు. HYD తెలంగాణ భవన్‌లో నిర్వహించిన అంబేడ్కర్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆ మహనీయుడు స్ఫూర్తితోనే కేసీఆర్ 14 ఏళ్లు ముందుండి తెలంగాణ పోరాటాన్ని నడిపించారన్నారు.
‘జీనా హై తో మర్నా సీఖో కదమ్ కదమ్ పర్ లడ్నా సీఖో ’ అంటూ నినాదించిన జార్జ్ రెడ్డి దేశవ్యాప్తంగా సుపరిచితుడు. మన HYDతో ఆయనకు ఎంతో అనుబంధం ఉంది. 1962లో జార్జ్ ఫ్యామిలీ నగరంలో స్థిరపడింది. నిజాం కాలేజీలో డిగ్రీ చేసిన జార్జ్.. OUలో పీజీ చేశారు. యూనివర్సిటీలోనే PDS (PDSU)ను స్థాపించి ఉద్యమాలు నడిపారు. గిట్టనివారు 1972-APR-14న ఉస్మానియా యూనివర్సిటీలోనే దారుణంగా హత్యచేశారు. నేడు జార్జ్ 52వ వర్ధంతి.
HYD బాలానగర్‌లోని CITDలో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. 10వ తరగతి పాసైన వారు మే 13 వరకు https://citdindia.org వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. డిప్లొమా ఇన్ టూల్ డిజైన్ అండ్ మౌల్డ్ మేకింగ్, డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, డిప్లొమా ఇన్ ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్ ఇంజినీరింగ్, డిప్లొమా ఇన్ ప్రొడక్షన్ ఇంజినీరింగ్ బ్రాంచీలు ఉన్నాయి.
HYD హుస్సేన్ సాగర్‌లో బోట్ షికారు చేసే వారి సంఖ్య తగ్గింది. సోమవారం నుంచి శుక్రవారం వరకు బోట్ షికారు చేసిన వారు 2 వేల మంది వరకు ఉండగా.. శని, ఆదివారాలు 5 వేల మంది ఉంటున్నారు. సాగర్‌లో ఉదయం నుంచి రాత్రి వరకు 100 మంది సామర్థ్యం ఉన్న పెద్ద బోట్లలో పుట్టిన రోజు వేడుకలు, కుటుంబ సభ్యుల సమావేశాలు జోరుగా సాగేవి. ఓ వైపు ఎండ, మరోవైపు హుస్సేన్ సాగర్ దుర్వాసన కారణంగా షికార్ చేసే వారి సంఖ్య తగ్గింది.
నీట్ పరీక్ష భయంతో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన HYD కొంపల్లి సమీపంలోని పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలో ఈరోజు జరిగింది. స్ప్రింగ్ కాలనీలో ఉంటున్న జైస్వాల్(22) నీట్ పరీక్షపై ఆందోళనకు గురై.. భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.