Hyderabad

News April 11, 2024

HYD: నేడే రంజాన్.. సర్వం సిద్ధం

image

ముస్లింల పవిత్ర పండుగ రంజాన్‌(ఈద్‌-ఉల్‌-ఫితర్‌)ను నేడు జరుపుకోవాలని రుహియ్యతే హిలాల్‌ కమిటీ (నెలవంక నిర్ధారణ కమిటీ) సభ్యులు తెలిపారు. బుధవారం రంజాన్‌ చివరి రోజుగా పరిగణించి ఉపవాసం పాటించారు. గురువారం షవ్వాల్‌ 1వ తేదీ (ఏప్రిల్‌ 11)గా పరిగణించి పండుగ జరుపుకోవాలని సూచించారు. మక్కా మసీద్, మల్లేపల్లి మసీద్‌, తాండూరు మసీద్, HYD, RRలోని తదితర ఈద్గా మైదానాల్లో‌ ప్రత్యేక ప్రార్థనల కోసం ఏర్పాట్లు చేశారు.

News April 10, 2024

HYD: ప్రతీకారం.. యువకుడి మర్డర్‌

image

బాచుపల్లి PS పరిధిలో ఈ నెల 1న జరిగిన పిల్లి తేజస్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్యకు పాల్పడిన 9 మంది నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. గత ఏడాది తన స్నేహితుడు తరుణ్ హత్యకు ప్రతీకారంగా తేజస్‌ను చంపేశారని పోలీసులు పేర్కొన్నారు. నిందితుల నుంచి 6 సెల్‌ఫోన్స్, 4 టూ వీలర్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.

News April 10, 2024

HYD: KCR మీద కోపంతో‌ కాంగ్రెస్‌కు ఓటు: ఈటల

image

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ మీద కోపంతో మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓటేశారని BJP మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విమర్శించారు. రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను చూసి ఓటు వేయలేదన్నారు. హామీల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. అయినా కూడా ఇప్పుడు మరోసారి 17 ఎంపీ సీట్లు గెలిపించండి అంటూ ప్రజలకు మాయ మాటలు చెబుతున్నారని ఈటల దుయ్యబట్టారు. దీనిపై మీ కామెంట్?

News April 10, 2024

HYD: పుస్తక ప్రేమికులకు GOOD NEWS

image

HYDలోని పుస్తక ప్రేమికులకు మెట్రో అధికారులు గుడ్ న్యూస్ తెలిపారు. అమీర్‌పేట్ మెట్రో స్టేషన్ కాన్ కోర్స్ లెవెల్ వద్ద ఉచితంగా లైబ్రరీ ఏర్పాటు చేసినట్లుగా తెలియజేశారు. నేడు ఉదయం 10 గంటలకు ఇది ప్రారంభం కాగా.. ఏప్రిల్ 14 వరకు కొనసాగుతుందని, నగర ప్రజలు బుక్ ఫెయిర్ సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు.

News April 10, 2024

HYD: కాంగ్రెస్ పార్టీలోకి జంపన ప్రతాప్?

image

బీజేపీ సికింద్రాబాద్ కంటోన్మెంట్‌కి మరో షాక్ తగలనుంది. కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ బీజేపీని వీడి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్‌ఛార్జ్ మైనంపల్లి హనుమంతరావు ప్రతాప్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌లో చేరాల్సిందిగా ఆహ్వానించారు. ఇందుకు అంగీకరించిన జంపన ఈరోజు తన అనుచరులతో కలిసి కాంగ్రెస్‌లో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు.

News April 10, 2024

HYD: కాంగ్రెస్‌ను ఓడిస్తాం: RS ప్రవీణ్‌కుమార్

image

కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థులను చిత్తుగా ఓడిస్తామని BRS నాగర్‌కర్నూల్‌ ఎంపీ అభ్యర్థి RS ప్రవీణ్‌ కుమార్‌ అన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా HYD అల్వాల్‌ సర్కిల్‌ వెంకటాపురం డివిజన్‌ యాదమ్మనగర్‌లో మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి మద్దతుగా ప్రవీణ్‌ కుమార్‌, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌ రెడ్డి ప్రచారం నిర్వహించారు. RS మాట్లాడుతూ.. కాంగ్రెస్ 6 గ్యారంటీల అమలులో విఫలమైందన్నారు.

News April 10, 2024

కంటోన్మెంట్‌లో గెలుపు ఎవరిది?

image

పార్లమెంట్ ఎన్నికలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో ఉప ఎన్నిక జరగనుంది. స్థానిక BRS MLA లాస్య నందిత యాక్సిడెంట్‌లో చనిపోగా ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. కాగా BRS నుంచి లాస్య సోదరి నివేదిత బరిలో ఉంటారని సమాచారం. అయితే BRS నుంచి BJPలో చేరి గత ఎన్నికల్లో పోటీ చేసిన శ్రీగణేశ్ ఇటీవల కాంగ్రెస్‌లో చేరగా ఆయనకు అధిష్ఠానం టికెట్ కేటాయించింది. BJP ఇంతవరకు అభ్యర్థిని ప్రకటించలేదు. మరి గెలుపెవరిదో?

News April 10, 2024

HYD: కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు ఉండవు: నరసింహులు

image

MP ఎన్నికల్లో భాగంగా ఒక్క ఎంపీ సీటు కేటాయించకుండా కాంగ్రెస్ పార్టీ మాదిగలకు తీవ్ర అన్యాయం చేసిందని, ఆ పార్టీకి పుట్టగతులు ఉండవని MRPS రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నరసింహులు అన్నారు. ఆయన మాట్లాడుతూ.. టికెట్ల కేటాయింపులో కాంగ్రెస్ పార్టీ పునరాలోచించకాపోతే తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. నాగర్ కర్నూల్ MP టికెట్ అధికంగా ఉన్న మాదిగలకు కేటాయించాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరఫున డిమాండ్ చేశారు.

News April 10, 2024

HYD: ఈనెల 18 నుంచి చిలుకూరు ఆలయ బ్రహ్మోత్సవాలు

image

ఈనెల 18 నుంచి 25 వరకు చిలుకూరు బాలాజీ దేవాలయంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ప్రధాన అర్చుకుడు రంగరాజన్ తెలిపారు. 21న బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రధాన ఘట్టమైన బాలాజీ, పద్మావతి, అలివేలు మంగమ్మ కళ్యాణోత్సవం ఉంటుందని, 25న చక్రతీర్థంతో ఉత్సవాలు ముగుస్తాయన్నారు. నూతన క్రోధి నామ సంవత్సరం నేపథ్యంలో స్వామిని దర్శించుకోవాలని భక్తులకు సూచించారు.

News April 10, 2024

HYD: తల్లి వదిలేసింది.. తండ్రి చనిపోయాడు.. బాలిక ఆత్మహత్య

image

హాస్టల్‌లో ఉండే ఓ బాలిక సూసైడ్ చేసుకున్న ఘటన HYDదుండిగల్ PSపరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. సూరారం ప్రాంతానికి చెందిన బాలిక(13) దుండిగల్‌లోని ఓ హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటోంది. మూడేళ్ల వయసులో ఆమెను తల్లి వదిలేసి వెళ్లింది. ఇటీవల తండ్రి మరణించడంతో ఒంటరైంది. బాలికను ఆమె మేనత్త ఓ ఫౌండేషన్‌లో చేర్పించింది. ఈక్రమంలో బాలిక హాస్టల్ రూమ్‌లో ఉరేసుకుని చనిపోగా మంగళవారం పోలీసులు కేసు నమోదు చేశారు.

error: Content is protected !!