Hyderabad

News March 16, 2024

HYD: ముస్లింలపై దాడులు పెరిగి పోతున్నాయి: ఒవైసీ

image

దేశంలోని ముస్లింలపై దాడులు రోజు రోజుకు పెరిగి పోతున్నాయని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంలో మైనార్టీలు అణచివేతకు గురవుతున్నారని ఎంఐఎం అధ్యక్షుడు, HYD ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. రంజాన్ మాసంలోని మొదటి శుక్రవారం సందర్భంగా ఆయన చార్మినార్ మక్కా మసీద్‌లో ప్రత్యేక ప్రార్థనలు, యాముల్ ఖురాన్ పఠనం కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఎంఐఎం చేస్తున్న అభివృద్ధి పనులపై వివరించారు.

News March 16, 2024

HYD: ఏసీబీ వలలో జలమండలి అధికారులు

image

రెవెన్యూ సర్కిల్ జలమండలి కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ ఫైనాన్స్ ఎల్.రాకేశ్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగి సందీప్‌ను అక్బర్ హుస్సేన్ అనే వ్యక్తి కలిశారు. తన పని అవ్వాలంటే రూ.లక్ష లంచం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. దీంతో అక్బర్ ఏసీబీ అధికారులను సంప్రదించాడు. శుక్రవారం లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులకు రాకేశ్ దొరికాడు. నాంపల్లి ఏసీబీ కోర్టులో వారిని హాజరుపర్చగా కోర్టు రిమాండ్ విధించింది. 

News March 16, 2024

HYD: శంభీపూర్ రాజుని కలిసిన మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి

image

ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ పార్టీ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు శంభీపూర్ రాజుని ఆ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. శంభీపూర్ రాజు లక్ష్మారెడ్డిని శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. కాగా మల్కాజిగిరి టికెట్‌ను తొలుత శంభీపూర్ రాజుకు ఇచ్చినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. వీరి ఇద్దరి కలయికతో శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

News March 16, 2024

HYD: మోదీవి బ్లాక్ మెయిల్ రాజకీయాలు: గజ్జల నగేశ్

image

ఎమ్మెల్సీ కవిత అరెస్టు అప్రజాస్వామికమని తెలంగాణ మాజీ బేవరేజెస్ కార్పొరేషన్ ఛైర్మన్ గజ్జల నగేశ్ అన్నారు. ఇది బీజేపీ కుట్రలో భాగమని, కాంగ్రెస్ లోపాయికారి ఒప్పందంతో కవితను అరెస్టు చేశారని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించనున్న నేపథ్యంలో నాయకులు, కార్యకర్తల్లో మనోస్థైర్యం దెబ్బతీసేందుకే కుట్రలు చేశారని, మోదీవి బ్లాక్ మెయిల్ రాజకీయాలని ఆయన మండిపడ్డారు. 

error: Content is protected !!