India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYD నుంచి వరంగల్ NH-163పై వెళ్లే మార్గంలో భువనగిరి వద్ద.. పెంచిన టోల్‌గేట్ ఛార్జీల పట్టికను అధికారులు ఏర్పాటు చేశారు. కారు, జీపు, LMV వాహనాలకు ఒకవైపు ప్రయాణానికి రూ.115, 24 గంటల్లో టూ సైడ్ ట్రిప్ రూ.170 ఛార్జి వసూలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వాణిజ్య వాహనాలకు వన్ సైడ్ ట్రిప్ రూ.175.. 24 గంటల్లో టూ సైడ్ ట్రిప్ రూ.265గా ఉందని తెలిపారు.
HYD నగరంలోని పలు ప్రయాణ ప్రాంగణాల్లో దుకాణాలు లీజుకు సిద్ధమంటూ ఆర్టీసీ ప్రకటించింది. ఈసీఐఎల్ బస్ స్టేషన్లో 5200 చ.అ.స్థలంలో వసతి, కోచింగ్ సెంటర్, డయాగ్నొస్టిక్ సెంటర్ పెట్టుకోవాలని సూచించింది. ఇలా.. సికింద్రాబాద్ రీజియన్లో మొత్తం 17 దుకాణాలకు, మరో 10 ప్రాంతాల్లో ఐస్క్రీమ్ పార్లర్ల నిర్వహణకు టెండర్లు పిలిచింది. HYD రీజియన్లో 35 దుకాణాల కోసం టెండర్లు పిలిచారు. దరఖాస్తుల స్వీకరణ సైతం పూర్తయింది.
పవిత్ర రంజాన్ మాసానికి పరిమళాలు వెదజల్లే అత్తర్లు మరింత వన్నె తెస్తాయి. వివిధ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున తరలివచ్చే కొనుగోలుదారులతో హైదరాబాద్ పాతబస్తీలోని దుకాణాలు కళకళలాడుతున్నాయి. గులాబీ రేకులు, మల్లె, మొగలిపూలు, గంధం చెక్కలు మరిగించటం ద్వారా వచ్చే ఆవిరితోనే అత్తర్లను తయారుచేస్తారు. 200లకు పైగా వివిధ రకాల ఫ్లేవర్లు నగరవాసులకు అందుబాటులో ఉన్నాయి. ఇవి రూ.40 నుంచి రూ.600 వరకు దొరుకుతున్నాయి.
HYD మెహిదీపట్నంలోని సరోజినీ దేవి కంటి ఆసుపత్రిలో నిత్యం దాదాపుగా 1250 నుంచి 1350 మంది రోగులు వస్తుంటారు. అయితే వారిలో రోజు దాదాపు 200 నుంచి 300 మందికి డాక్టర్లు అద్దాలను సిఫార్సు చేస్తున్నారు. దీంతో పేదలు బయటకు వెళ్లి డబ్బు పెట్టి కొనుగోలు చేయాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ఆసుపత్రిలో అవసరమైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వమే అద్దాలు ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో నాణ్యమైన డయాగ్నొస్టిక్ సేవలు అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రతినెల దాదాపుగా 100 అల్ట్రా సౌండ్ స్కానింగ్ 3,000 సీటీ స్కాన్, సుమారు 700 ఎంఆర్ఐ స్కానింగ్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రిలో MRI ప్రారంభం కాకపోవడం వల్ల, గాంధీ ఆసుపత్రికి MRI స్కానింగ్ కోసం వచ్చేవారి సంఖ్య పెరుగుతుందని సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు.
గ్రేటర్ HYDలో కల్తీ ఆహార పదార్థాల తయారీ ఘటనలు తరచూ వెలుగుచూడడం ఆందోళన కలిగిస్తోంది. రసాయనాలు ఉపయోగించి తయారు చేస్తున్న ఆహార పదార్థాలు చివరకు విషంలా మారి ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తున్నాయి. తాజాగా HYD జల్‌పల్లి పరిధి శ్రీరామ కాలనీలో కుళ్లిన అల్లం వెల్లుల్లితో పేస్ట్ తయారు చేస్తున్న ఓ కార్ఖానాపై ఎల్బీనగర్ SOTపోలీసులు దాడులు చేశారు. నకిలీ డబ్బాలను స్వాధీనం చేసుకుని పహాడీషరీఫ్ పోలీసులకు అప్పగించారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గత MP ఎన్నికల్లో ఓటింగ్ 50 శాతం దాటలేదు. దీంతో ఈసారి ఎలాగైనా ఓటింగ్ శాతం పెంచాలని కేంద్ర ఎన్నికల సంఘం (EC) భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే నగర ఓటర్లు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు వచ్చేలా చైతన్యాన్ని పెంపొందించాలని ఈసీ జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్‌కు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈసారి పోలింగ్ శాతం పెంచేందుకు చర్యలు తీసుకోనున్నారు.
రాబోయే వర్షాకాలానికి సంబంధించి తగిన యాక్షన్ ప్లాన్ రూపొందించాలని GHMC కమిషనర్ రోనాల్డ్ రాస్ తెలిపారు. శిథిలావస్థలోని భవనాలను గుర్తించి వాటి ద్వారా ఎలాంటి నష్టం వాటిల్లకుండా తగు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. జంక్షన్ ఇంప్రూవ్‌మెంట్ ప్లాన్స్ సిద్ధం చేయాలన్నారు. సర్కిళ్లలో ఎదురయ్యే ఇబ్బందులను పరిగణలోకి తీసుకుంటూ ఆటంకాలు లేకుండా ప్లాన్స్ రూపొందించాలన్నారు.
సామాన్యులకు సన్న బియ్యం ధర దడ పుట్టిస్తోంది. HYD, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల్లో ప్రస్తుతం మార్కెట్‌లో క్వింటాలు బియ్యం ధర రూ.5,500 నుంచి రూ.6,200 వరకు పలుకుతోంది. యాసంగిలో వరి సాగు తగ్గడంతో రానున్న రోజుల్లో దీని ప్రభావం మరింతగా ఉండనుంది. మార్కెట్‌లో డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని బియ్యాన్ని బ్లాక్ చేస్తూ వ్యాపారులు పెద్ద ఎత్తున దండుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మీ కామెంట్?
అమాయక ప్రజలను మాయమాటలతో మోసగిస్తున్న సైబర్ ముఠాల ఆటలు కట్టిస్తామని రాచకొండ సీపీ తరుణ్ జోషి అన్నారు. HYD నేరేడ్‌మెట్‌లోని రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో సైబర్ నేరాలకు సంబంధించిన కేసుల నమోదు, దర్యాప్తులో పాటించాల్సిన పద్ధతులపై PSల ఇన్‌స్పెక్టర్లు, ఇతర అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సైబర్ నేరాల దర్యాప్తులో యూరప్ దేశాల పోలీస్ వ్యవస్థ కంటే భారత పోలీసులు సమర్థవంతంగా పనిచేస్తున్నారన్నారు.
Sorry, no posts matched your criteria.