India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYDలో విచ్చలవిడిగా నీటిని వినియోగిస్తున్నారు. భూరగ్భజలాలు అడుగంటడంతో ట్యాంకర్లకు డిమాండ్ పెరిగింది. అయినా పబ్లిక్ తీరు మార్చుకోవడం లేదు. నిత్యం రాజధానిలో 448 మిలియన్ గ్యాలన్ల నీరు వాడుతున్నారు. అందులో 30 మిలియన్ గ్యాలన్లు వృథా చేస్తున్నారు. మంజీరా, కృష్ణ నుంచి ఒక్క కిలో లీటర్ నీటిని నగరానికి తరలించాలంటే రూ.45 నుంచి రూ. 50 వరకు ఖర్చువుతోందట. హైదరాబాదీ ఇకనైనా మేలుకో.
SAVE WATER
DGP రవిగుప్తాను సురక్ష సేవాసంఘం స్టేట్ ప్రెసిడెంట్ గోపిశంకర్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. నిరుద్యోగ యువతకు సురక్ష అందించిన ఉచిత పోలీస్ శిక్షణ కోసం DGP గతంలో రూ.1,80,000 ఆర్థిక సాయం అందించారు. DGP సాయంతో బట్టలు, బూట్లు, స్టడీ మెటీరియల్, తరగతుల ఏర్పాటు చేసి 32 మందిని కానిస్టేబుళ్లుగా తీర్చిదిద్దినట్లు శంకర్ తెలిపారు. CI ప్రసన్నకుమార్ చొరవ చూపారన్నారు. డీజీపీకి శంకర్ కృతజ్ఞతలు తెలిపారు.
సివిల్ అభ్యర్థుల కోసం నారాయణ IAS అకాడమి ఆదివారం నగరంలోని రవీంద్రభారతిలో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించింది. ఏపీ రిటైర్డ్ CS మోహన్ కందా, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మొదలైన ప్రముఖులు పాల్గొని అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు. ప్రిపరేషన్‌లో రీసెర్చ్ & డెవలప్‌మెంట్ విధానాలు వాటి ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో అభ్యర్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
BRS కంటోన్మెంట్ టికెట్ ఆశిస్తున్న ముగ్గురు లీడర్లకు మళ్లీ నిరాశే ఎదురైంది. గజ్జెల నగేశ్, మన్నె క్రిశాంక్, ఎర్రోళ్ల శ్రీనివాస్ టికెట్ ఆశిస్తున్న వారిలో ఉన్నారు. 2014 ఎన్నికల్లో TDP నుంచి గెలుపొందిన సాయన్న ఆ తర్వాత BRSలో చేరారు. 2018లో సాయన్నకే KCR టికెట్ ఇచ్చారు.ఆ తర్వాత ఆయన చనిపోవడంతో, 2023 ఎన్నికల్లో సాయన్న బిడ్డ లాస్య నందితకు టికెట్ ఇవ్వగా ఆమె చనిపోయారు. తాజాగా నివేదితకు టికెట్ ఇవ్వనున్నారు.
HYDలో వివిధ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాల ద్వారా గడిచిన 24 గంటల వ్యవధిలో రూ.7,30,400 నగదు, రూ.11,62,203 విలువ గల ఇతర వస్తువులను, 386.73 లీటర్ల లిక్కర్‌ను సీజ్ చేసినట్లు HYD ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ తెలిపారు. నగదు, ఇతర వస్తువులపై 8 ఫిర్యాదులు రాగా వాటిని పరిశీలించి పరిష్కరించినట్లు తెలిపారు. 4 FIRలు నమోదు చేసినట్లు చెప్పారు. 12 లైసెన్స్ గల ఆయుధాలను డిపాజిట్ చేసినట్లు వివరించారు.
ఆర్టీసీలో పదవీ విరమణల కారణంగా సిబ్బంది సంఖ్య క్రమేపీ తగ్గుతోంది. దీంతో సంస్థలో ఖాళీలు పెరుగుతున్నాయి.రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తుండటంతో ఆర్టీసీలో ప్రయాణికుల సంఖ్య సగటున రోజుకు అరకోటి దాటుతోంది. HYDలోనూ రద్దీ ఉంది. మరోవైపు సంస్థలో పలువురు ఉద్యోగులు రిటైర్ అవుతున్నారు.ఈఏడాది ఏప్రిల్-డిసెంబరు మధ్య మరో1,354 మంది పదవీ విరమణ కానున్నారు. ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంది.
HYD, RR, MDCL,VKB జిల్లాల్లోని వివిధ ప్రాంతాల ప్రజలకు ‘తెలంగాణ వెదర్ మెన్’ X వేదికగా గుడ్ న్యూస్ తెలిపింది. వడగాలులు తీవ్రత తగ్గుముఖం పట్టడంతో.. నేడు ఉష్ణోగ్రతలు పడిపోయినట్లుగా తెలియజేసింది. రాబోయే వారం పాటు ఉష్ణోగ్రతలు తగ్గి, ప్రజలకు కాస్త ఉపశమనం కలుగుతుందని పేర్కొంది.
లోక్‌సభ ఎన్నికల్లో హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల నియోజకవర్గాల్లో గులాబీ జెండాను ఎగురవేస్తామని BRS నేతలు తెలిపారు. సోమవారం గోషామహల్ పరిధి గన్‌ఫౌండ్రిలో BRS సమావేశం జరిగింది. ఈ సందర్భంగా BRS HYD అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ పాల్గొని మాట్లాడారు. హైదరాబాద్ గడ్డ.. BRS అడ్డా అని అన్నారు. పార్టీ నేతలంతా కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. KCRతోనే అభివృద్ధి కొనసాగుతుందన్నారు.
గ్రేటర్ HYDలో మొత్తం 185 చెరువులు ఉండగా వాటిలోని 50 తటాకాల్లో ప్రస్తుతం గుర్రపు డెక్క మొక్క దాదాపు 100% పరుచుకొని ఉంది. రెండేళ్లుగా ఆయా చెరువుల్లో గుర్రపు డెక్క వ్యర్థాలను తొలగించేందుకు తూతూ మంత్రంగా పనులు జరగగా.. దీనికి తోడు గుర్రపు డెక్కను తొలగించే FTC యంత్రాల కాంట్రాక్ట్ ఫిబ్రవరితో పూర్తయింది. దీంతో ఆ కొద్దిపాటి పనులు సైతం మూలన పడ్డాయి. మరీ అన్ని చెరువుల్లో ఎప్పుడు తొలగిస్తారో..? వేచి చూడాలి.
కేసుల సత్వర పరిష్కారం దిశగా RR జిల్లా వినియోగదారుల కమిషన్ చర్యలు తీసుకుంటోంది. గత 55 రోజుల్లోనే చాలా కేసులను పరిష్కరించినట్లుగా తెలిపింది. రంగారెడ్డి జిల్లా కమిషన్‌లో రాష్ట్రంలోనే అధిక కేసులు నమోదవుతుంటాయి. మరోవైపు మార్చి నెల చివరి నాటికి రంగారెడ్డి జిల్లా కమిషన్‌లో రాష్ట్రంలోనే అధికంగా 1,405 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో నూతన కమిషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరింది.
Sorry, no posts matched your criteria.