India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎంబీబీఎస్, బీడీఎస్ కౌన్సిలింగ్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల అమలులో పలు అవకతవకలు జరిగాయని, జీఓ నంబర్ 550ని సక్రమంగా అమలు చేయకపోవడంతో 262 మంది విద్యార్థులకు ఎంబీబీఎస్ సీట్లు దక్కకుండా పోయాయని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు. గుజ్జ కృష్ణ, టీ.రాజ్ కుమార్‌తో శనివారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను కలిసి ఆయన వినతి పత్రం అందజేశారు.
> జూబ్లీహిల్స్‌లో బోనాల ఏర్పాట్లపై మంత్రుల సమీక్ష సమావేశం
> కాచిగూడలోని గ్యాస్ రీఫిల్లింగ్ సెంటర్‌లో పోలీసుల దాడి
> మంత్రి పొంగులేటి చేతుల మీదుగా బడిబాట పాట ఆవిష్కరణ
> కూకట్ పల్లిలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
> ఉప్పల్ శిల్పారామంలో అలరించిన కూచిపూడి నృత్య ప్రదర్శన
> అల్వాల్‌లో రేషన్ బియ్యం పట్టివేత.. 2 ఆటోలు సీజ్
> ఘనంగా డిప్యూటీ సీఎం భట్టి పుట్టినరోజు వేడుకలు
ఉప్పల్ మినీ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఎస్ఎల్‌వీ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ గురువర్యులు చింత నాగార్జున శిష్య బృందం కర్ణాటక గాత్ర కచేరి, కూచిపూడి నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. కర్ణాటక గాత్ర కచేరీలో చూడమ్మా సతులారా, భో శంభో, వేంకటేశుడు, తరతరాల తిరుమల, స్వాగతం కృష్ణ, గోదావరి అంశాలను కళాకారులు ఆలపించారు. నాగజ్యోతి శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శన చేశారు.
ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. వికారాబాద్‌కు చెందిన రవి HYDతార్నాకలోని ఓయూ హాస్టల్‌లో ఉంటూ నిజాం కాలేజీలో చదువుతున్నాడు. ఈ క్రమంలో ఈరోజు హాస్టల్ బిల్డింగ్ పై నుంచి అతడు దూకగా శబ్దం విన్న తోటి విద్యార్థులు వెంటనే వచ్చి రవిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. తలకు గాయమైందని, పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రేమ వ్యవహారమే కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
HYD ఖైరతాబాద్‌లోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం ఈనెల 17న ఉండదని GHMC ఇన్‌ఛార్జ్ కమిషనర్ ఆమ్రపాలి ఈరోజు తెలిపారు. బక్రీద్ పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించినందున ప్రజావాణి ఉండదని ఆమె స్పష్టం చేశారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ఆమె కోరారు.
తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతి శాఖ సౌజన్యంతో పికాసో ది స్కూల్ ఆఫ్ ఆర్ట్ విద్యార్థుల పెయింటింగ్ ఎగ్జిబిషన్ రేపటి నుంచి మూడు రోజుల పాటు HYD రవీంద్రభారతిలో జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరుకానున్నారని నిర్వాహకులు తెలిపారు. ఆసక్తి గల వారందరూ ఇందులో పాల్గొని ఎగ్జిబిషన్ చూడాలని కోరారు.
HYD ప్రాంతీయ రింగ్ రోడ్డు (RRR) పొడవు పెరిగింది. ఉత్తర భాగంలో 2.95 కి.మీ. మేర పెంచాలని తాజాగా అధికారులు నిర్ణయించారు. కాగా తాజా ఎలైన్‌మెంట్‌తో RRR ఉత్తర, దక్షిణ భాగాలు కలిపి 10.28 కి.మీ. పెరిగింది. దీంతో రెండు భాగాల విస్తీర్ణం 350.79 కి.మీ.కు చేరింది. అయితే గతంలో 340.51 కి.మీ. నిర్ణయించగా ఉత్తర, దక్షిణ భాగాల అనుసంధానం కోసం ఈ మార్పు అవసరమైందని అధికారులు తెలిపారు. ఈ మేరకు భూ సేకరణ చేయనున్నారు.
ఆదాయం పెంపు దిశగా జీహెచ్‌ఎంసీ మరో ముందడుగు వేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలతో మరో 100 రోడ్లకు వాణిజ్య హోదా ఇచ్చేందుకు కసరత్తు ప్రారంభించింది. గత సర్కారు 2021లో జీవో నెం.102 ద్వారా 118 రోడ్లకు వాణిజ్య హోదా ఇచ్చింది. పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న అధికారులు.. మరో వంద రోడ్లకు ఆ హోదా ఇవ్వొచ్చనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి 100 అడుగులు, అంతకన్నా ఎక్కువ వెడల్పున్న రోడ్లకు ఇచ్చారు.
పందేలు ఓ ప్రాణాన్ని బలి తీసుకున్న ఘటన శంకర్‌పల్లి PS పరిధిలో జరిగింది. చెందిప్పకు చెందిన సురేందర్(45) ఈనెల 1న గ్రామానికి చెందిన ఇద్దరు స్నేహితులతో కలిసి సురేందర్ బయటకు వెళ్లారు. ఈ క్రమంలో సరదాగా మాట్లాడుకున్న స్నేహితులు పురుగు మందు తాగితే రూ.లక్ష ఇస్తామని సురేందర్‌తో పందెం కాశారు. దీంతో నిజంగానే పురుగు మందు తాగిన సురేందర్ ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
వికారాబాద్ జిల్లా యాలాల మండల పరిధిలో ఎదురుగా వస్తున్న మినీ డీసీఎం.. బైకును ఢీ కొట్టడంతో జగ్గప్పకు తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే. అయితే గాయాలతో పడి ఉన్న తండ్రికి కొడుకు బ్రూస్లీ ధైర్యం చెప్పాడు. ‘నేనున్న.. నీకేం కాదు నాన్న’ అంటూనే కుటుంబీకులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. స్థానికులతో కలిసి తండ్రిని ఆస్పత్రికి తరలించే సమయంలో జగ్గప్ప తల నుంచి రక్తం రావడంతో బట్టతో అదిమి పట్టుకొని ఆసుపత్రికి తీసుకెళ్లాడు.
Sorry, no posts matched your criteria.