India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYD నుంచి ఇతర ప్రాంతాలకు, దేశంలోని వివిధ రైళ్లలో ప్రయాణించే వారికి సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు పలు సూచనలు చేశారు. ఏదైనా ప్రయాణానికి సంబంధించి తికమకపడినా, ఆందోళనకు గురైనా, రూటు తెలియకపోయినా, దొంగలను గుర్తించినా, ఎవరైనా వేధించినా, ఇతర ఏదైనా సమాచారం కోసం 139కు కాల్ చేయవచ్చని అధికారులు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ ఈ సేవలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. SHARE IT
HYDలో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న వేళ విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతోంది. దీనికి తగ్గట్లుగా TSSPDCL అధికారులు తగు చర్యలు తీసుకుంటున్నారు. బుధవారం మేడిపల్లి నారపల్లి 5MVA కెపాసిటీ గల సబ్ స్టేషనును రూ.1.26 కోట్లతో 8MVA కెపాసిటీ కలిగిన సబ్ స్టేషన్‌గా అప్ గ్రేడ్ చేసినట్లుగా వెల్లడించారు. రాబోయే రోజుల్లో విద్యుత్ డిమాండును దృష్టిలో ఉంచుకొని అనేక చోట్ల ఇలాంటి చర్యలు చేపడతామన్నారు.
తెలంగాణ భవన్‌లో ఇవాళ జరిగిన ఇఫ్తార్ విందు వేడుకల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాజీ హోంమంత్రి మహమూద్ అలీ, మాజీ ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్‌తో కలిసి ఇఫ్తార్‌ను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేశ్, ముఠాగోపాల్, పలువురు బీఆర్ఎస్ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.
2023 ఎలక్షన్‌లో నవరంగ్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన ఆసియాతస్నిం సుల్తానా గంజాయి అమ్ముతుండగా ఈరోజు అరెస్ట్ చేశామని HYD కంచన్‌బాగ్ పోలీసులు తెలిపారు. పాతబస్తీలోని హాఫీజ్ బాబానగర్ సి బ్లాక్‌లో నివసించే ఆసియాతస్నిం సుల్తానా గత ఎలక్షన్‌లో చాంద్రాయణగుట్టలో అక్బరుద్దీన్ ఒవైసీపై పోటీ చేశారు. ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు రెండున్నర కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
HYD మెట్రో సూపర్ సేవర్ హాలిడే కార్డును తీసుకొచ్చి సెలవు దినాల్లో కేవలం రూ.59 రీఛార్జ్ ద్వారా అన్ లిమిటెడ్ ప్రయాణం చేయవచ్చని తెలిపింది. అయితే ఇటీవల కొందరు కార్డు కోసం వెళ్లగా ప్రయాణికులకు మెట్రో BIG షాక్ ఇచ్చింది. మెట్రో ప్రవేశపెట్టిన సూపర్ సేవర్ హాలిడే కార్డు, సూపర్ ఆఫ్ పీక్ హవర్ కార్డు సేవలు 2024 మార్చి 31 నాటికి ముగిశాయని తెలిపింది. ఆఫర్లు వర్తించవని తేల్చి చెప్పింది.
లాంగ్ డ్రైవ్‌లో అద్దెకు కార్లు తీసుకొని వాటిని అమ్ముతున్న ముఠాను HYD మాదాపూర్ పోలీసులు ఈరోజు అరెస్ట్ చేశారు. మాదాపూర్ ఏసీపీ మాట్లాడుతూ.. ఆదిలాబాద్‌లో ఉంటున్న హరీశ్ కుందారపు అనే వ్యక్తికి, సదరు వ్యక్తులు కార్లు ఇవ్వడంతో వీరికి కొంత కమిషన్ రూపంలో హరీశ్ అనే వ్యక్తి ఇస్తున్నట్లు తెలిపారు. వీరి వద్ద నుంచి రూ.కోటి విలువ చేసే 6 కార్లును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
HYDతో పాటు RR, MDCL,VKB జిల్లాల్లోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల ప్రజలకు ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తి పన్నును ఏప్రిల్ 30వ తేదీలోపు చెల్లిస్తే 5 శాతం రాయితీ పొందవచ్చని తెలియజేసింది. కావున ఆయా ప్రాంతాల్లో ఉంటున్న ప్రజలు ఈ ఆఫర్ సద్వినియోగం చేసుకోవాలని, ఈ లింక్ https://cdma.cgg.gov.in/cdma_arbs/CDMA_PG/PTMenu ద్వారా చెల్లించవచ్చని తెలిపింది. SHARE IT
HYD కస్టమ్స్ అధికారులు 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రిపోర్టు విడుదల చేశారు. ఆర్థిక సంవత్సరంలో 132 కిలోల బంగారాన్ని సీజ్ చేసినట్లుగా పేర్కొన్నారు. చెప్పుల లోపల, శరీర భాగాలలో, లో దుస్తులలో, డబ్బాలు, ప్యాకెట్లలో వివిధ రూపాల్లో బంగారాన్ని అక్రమంగా తరలించడానికి ప్రయత్నించినట్లు గుర్తించారు. 247 కేసులు బుక్ చేయగా.. 31 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు.
HYDలో వివిధ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాల ద్వారా మంగళవారం ఉదయం 6 గంటల నుంచి బుధవారం ఉ.6 గంటల వరకు రూ.1,72,21,300 నగదు, రూ.49,90,477 విలువ గల వస్తువులు, 91.17 లీటర్ల లిక్కర్‌ను సీజ్ చేసినట్లు HYD ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ తెలిపారు. నగదు, ఇతర వస్తువులపై 20 ఫిర్యాదులు రాగా వాటిని పరిశీలించి పరిష్కరించినట్లు చెప్పారు. 4 కేసులు నమోదు కాగా ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు వివరించారు.
పార్లమెంట్‌లో తెలంగాణ రాష్ట్ర ప్రజల గొంతును BRS పార్టీ నేతలు వినిపిస్తారని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. HYD చింతల్‌లోని ఎమ్మెల్యే కార్యాలయంలో పార్లమెంట్ ఎన్నికల సమావేశంలో భాగంగా రంగారెడ్డి నగర్ డివిజన్ నాయకులు, కార్యకర్తలతో సమావేశం జరిగింది. కార్యకర్తలు, ప్రజలందరూ తోడుగా ఉంటే న్యాయం కోసం ఎంతవరకైనా పోరాడుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ఉన్నారు.
Sorry, no posts matched your criteria.