India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. ఈ కోర్సు సెమిస్టర్ పరీక్షా ఫలితాలను విడుదల చేశామన్నారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్‌సైట్ www.osmania.ac.inలో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.

TGలో కాంగ్రెస్ సంస్థాగత పునర్నిర్మాణం దిశగా కీలక అడుగు వేసింది. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీ బలోపేతానికి చర్యలు చేపట్టింది. AICC TG ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆమోదంతో జిల్లాలకు కొత్త ఇన్‌ఛార్జ్‌లను నియమించారు. HYD జిల్లాకు జగ్గారెడ్డి, ఉమ్మడి RRకు శివసేనా రెడ్డిని నియమించారు. వీరి నియామకంతో అధికార పార్టీకి సిటీ, శివారులో పట్టు దొరుకుతుందని శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

పురాణాపూల్‌లోని విఠలేశ్వర స్వామి ఆలయంలో సోమవారం జరిగిన కళ్యాణోత్సవంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో జరిగిన ఈ వేడుకలో ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆలయ నిర్వహణపై ఆలయ పూజారులతో ఆమె చర్చించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, స్థానికులు, నాయకులు పాల్గొన్నారు.

లక్డికాపూల్‌లోని హైదరాబాద్ కలెక్టరేట్‌లో ప్రజావాణి నిర్వహించి, ప్రజల నుంచి అందిన అర్జీలను కలెక్టర్ హరిచందన దాసరి సమీక్షించారు. కలెక్టర్ అధికారులను ఉద్దేశించి అన్ని సమస్యలు వేగంగా పరిష్కరించాలని, పెండింగ్‌లో లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పాక్షికంగా కాకుండా పూర్తి స్థాయిలో పరిష్కరించాలని ఆమె సూచించారు.

గాంధీ ఉస్మానియా ఆస్పత్రులపై హైదరాబాద్ కలెక్టర్ హరిచందన దృష్టి సారించారు. ప్రభుత్వ ఆస్పత్రులలో మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేసి నివేదిక ఇవ్వాలని వైద్య అధికారులను సూచించారు. కలెక్టరేట్లో ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల వైద్యాధికారులతో మెడికల్ కాలేజీల మానిటరింగ్ కమీటి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఉస్మానియా ఆస్పత్రిలోని సమస్యలను వెంటనే పరిష్కరిస్తామన్నారు.

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ఏర్పాట్లను ఈవో గుత్తా మనోహర్‌రెడ్డితో కలిసి DCP రష్మీ పెరుమాళ్ పరిశీలించారు. ఆలయం లోపల క్యూ లైన్‌లను బోనాలతో వచ్చే మహిళా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. DCPతో పాటు ఏసీపీ సుబ్బయ్య, రామేశ్వర్, కృష్ణ, ప్రకాశ్ తదితరులు ఉన్నారు.

కేంద్ర క్రీడలశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయను సీఎం రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. ఖేలో ఇండియా, 40వ నేషనల్ గేమ్స్ వంటి జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీలు తెలంగాణకు వచ్చేలా అవకాశాలు కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఖేలో ఇండియా పథకం కింద శిక్షణ, వసతుల అభివృద్ధికి నిధులు కేటాయించాలన్నారు. జాతీయ క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులకు రైల్వే ఛార్జీల్లో రాయితీ మళ్లీ అందించాలని కోరారు.

కాచిగూడ- యశ్వంత్‌పర వందే భారత్ కోచుల సంఖ్యను రైల్వే శాఖ పెంచింది. ప్రస్తుతం 8 కోచ్‌లు 530 సీటింగ్ కెపాసిటీతో నడుస్తున్న ఈ ట్రైన్ జూలై 10 నుంచి 16 కోచ్‌లు 1,128 సీటింగ్ కెపాసిటీతో పరుగులు పెట్టబోతోంది. ప్రస్తుతం 7 చైర్‌కార్, 1 ఎగ్జిక్యూటివ్ క్లాస్‌తో నడుస్తుండగా ఇకపై 14 చైర్‌కార్, 2 ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి.

అమెరికాలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం సిల్వర్ జూబ్లీ వేడుకలకు CM రేవంత్‌రెడ్డికి TDF ప్రతినిధులు ఆహ్వానించారు. కాలిఫోర్నియాలో ఆగస్టు 8, 9,10 తేదీల్లో జరిగే 25 ఏళ్ల వేడుకల పోస్టర్‌ను CM ఆవిష్కరించారు. ప్రత్యేక రాష్ట్ర సాధనకు ఆ తర్వాత తెలంగాణలో TDF చేస్తున్న నిరంతర అభివృద్ధి పనులను CM ప్రశంసించారు. TDF ఇండియా ప్రెసిడెంట్ మట్ట రాజేశ్వర్‌రెడ్డి, EX ప్రెసిడెంట్ కవిత చల్ల, సెక్రటరీ వినీల్ ఉన్నారు.

నటుడు ఫిష్ వెంకట్ చికిత్సకు అయ్యే ఆస్పత్రి ఖర్చులు ప్రభుత్వం భరిస్తుందని మంత్రి వాకాటి శ్రీహరి అన్నారు. బోడుప్పల్‌లోని ఆర్బీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నటుడిని మంత్రి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. చికిత్సకు అయ్యే ఖర్చు ప్రభుత్వం భరిస్తుందని ఆయన కుటుంబానికి హామీ ఇచ్చారు.
Sorry, no posts matched your criteria.