Hyderabad

News March 31, 2024

HYD: BJPదే విజయం: కిషన్‌రెడ్డి

image

రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో దేశంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. HYD కాచిగూడ డివిజన్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు దేశాన్ని ప్రగతి పథంలోకి తీసుకెళ్లాయన్నారు. కార్పొరేటర్ కన్నె ఉమా రమేశ్ యాదవ్ పాల్గొన్నారు.

News March 31, 2024

HYD: బీసీలకు భిక్షం వద్దు.. హక్కులు కావాలి: R.కృష్ణయ్య

image

లోక్‌సభ ఎన్నికల్లో BRS, కాంగ్రెస్, బీజేపీ.. బీసీలకు జనాభా ప్రాతిపదికన టికెట్లు కేటాయించకుండా తీవ్ర అన్యాయం చేశాయని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. జాతీయ బీసీ యువజన సంఘం అధ్యక్షుడు గవ్వల భరత్ కుమార్, గుజ్జ కృష్ణ అధ్యక్షతన ఆదివారం కాచిగూడలో నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. బీసీలకు భిక్షం వద్దని.. రాజ్యాంగబద్ధమైన హక్కులు కావాలని అన్నారు.

News March 31, 2024

BREAKING: HYD: ఫ్రెండ్‌ ఛాతిలో కత్తితో పొడిచారు..!

image

HYD అత్తాపూర్‌లో స్నేహితుల మధ్య వివాదం చెలరేగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. సయ్యద్ ముస్తఫా అలీ అనే యువకుడిపై అతడి ఫ్రెండ్స్ అమాన్, అఫాన్ కలిసి దాడి చేశారు. బీర్ బాటిల్‌తో తల పగలగొట్టి, అంతటితో ఆగకుండా కత్తితో ఛాతిలో పొడిచి పరారయ్యారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు వచ్చి బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 31, 2024

HYD: భారీగా నగదు కట్టలు పట్టివేత

image

ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో భాగంగా హైదరాబాద్‌లో గడిచిన 24 గంటల వ్యవధిలో రూ.25,66,380 నగదు, రూ.56,39,223 విలువ గల ఇతర వస్తువులను వివిధ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాలు పట్టుకుని సీజ్ చేసినట్లు HYD ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ తెలిపారు. ఫ్లయింగ్, ఎస్ఎస్‌టీ బృందాలతో పాటు పోలీస్ శాఖ ముమ్మర తనిఖీలతో పెద్ద మొత్తంలో నగదు, ఇతర వస్తువులు పట్టుకున్నట్లు ఆయన వెల్లడించారు.

News March 31, 2024

ఉప్పల్ స్టేడియంలో దేవేందర్ గౌడ్ గేట్ ఉందని తెలుసా..?

image

HYD ఉప్పల్ స్టేడియంలో తూళ్ల దేవేందర్ గౌడ్ గేట్ ఉందన్న సంగతి మీకు తెలుసా..? తూళ్ల దేవేందర్ గౌడ్ మేడ్చల్ అసెంబ్లీ నుంచి టీడీపీ తరఫున వరుసగా మూడుసార్లు 1994, 1999, 2004లో గెలిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హోమ్ అండ్ సినిమాటోగ్రఫీ మంత్రిగానూ వ్యవహరించారు. 2003లో స్టేడియం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఆయన చేసిన సేవలకు గుర్తుగా ఓ గేటుకు ఆయన పేరు పెట్టారు.

News March 31, 2024

HYD: హత్య చేసి మృతదేహాన్ని పడేసే యత్నం..!

image

HYD శివారు చేవెళ్లలో దారుణ ఘటన వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన వివరాలు.. షాద్‌నగర్‌‌ వాసి మహమ్మద్(50) చేవెళ్లలోని CPI కాలనీలో ఉంటున్నాడు. అతడిని కొందరు హత్య చేసి, కాళ్లను కట్టేసి, ఓ మూటలో చుట్టి నిర్మానుష్య ప్రాంతంలో పడేసే ప్రయత్నం చేశారు. స్థానికులు వారిని గమనించి పెద్దగా అరిచారు. దీంతో మృతదేహాన్ని వదిలేసి వారు పరారయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు వచ్చి పరిశీలించారు. కేసు నమోదు చేశారు.

News March 31, 2024

చర్లపల్లికి రవాణా సదుపాయాలు ఎలా?

image

చర్లపల్లిలో కేంద్ర ప్రభుత్వం దాదాపుగా రూ.430 కోట్లు వెచ్చించి రైల్వే టర్మినల్ నిర్మిస్తోంది. చర్లపల్లికి మెట్రో లేకపోవడం, రోడ్లు సైతం సరిగా లేకపోవడం, రాత్రి వేళల్లో చర్లపల్లికి రవాణా సదుపాయం లేకపోవడంతో అటువైపు చూసే వారి సంఖ్య తగ్గొచ్చని ప్రజలు చెబుతున్నారు. టర్మినల్ ఏర్పాటుకు తగ్గట్టుగా మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు.

News March 31, 2024

HYD: భార్య చూస్తుండగానే చెరువులో మునిగి భర్త మృతి

image

భార్య చూస్తుండగానే చెరువులో మునిగి భర్త మృతి చెందిన ఘటన బాచుపల్లి పీఎస్ పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. బాచుపల్లి పెట్రోల్ బంకు సమీపంలో హన్మంత్, కల్పన దంపతులు ఉంటున్నారు. శనివారం వారు భైరుని చెరువుకి వెళ్లారు. కల్పన ఒడ్డున నిల్చోగా.. హన్మంత్ స్నానానికి నీటిలోకి దిగి ఎంతకీ తిరిగి రాలేదు. సాయంత్రం మృతదేహం లభ్యమైంది.

News March 31, 2024

ఎన్నికల విధులు పూర్తి అవగాహనతో నిర్వర్తించాలి: రోనాల్డ్‌ రోస్‌

image

ఎన్నికల విధులు పూర్తి అవగాహనతో నిర్వర్తించినప్పుడే ఎలాంటి పొరపాట్లు జరగవని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రోనాల్డ్‌ రోస్‌ అన్నారు. బంజారాభవన్‌లో శనివారం సెక్టర్‌ ఆఫీసర్లు, జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి మాస్టర్‌ ట్రైనర్స్‌కు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రోనాల్డ్‌ రాస్‌ మాట్లాడుతూ.. ప్రశాంత వాతావరణంలో ఓటర్లు ఓటు వేసేలా అన్ని సదుపాయాలు కల్పించాలన్నారు.

News March 31, 2024

HYD: నేటితో ముగియనున్న ఓటీఎస్

image

ప్రాపర్టీ టాక్స్ చెల్లింపులకు వన్‌ టైం సెటిల్‌మెంట్ స్కీం రాయితీ నేటితో ముగియనున్నందున దీనిని సద్వినియోగం చేసుకోవాలని GHMC కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. ఆదివారం రాత్రి 12 గంటల లోపు తమ ప్రాపర్టీ టాక్స్ చెల్లించి వడ్డీ పై 90% రాయితీ పొందవచ్చని తెలిపారు. శనివారం BSNL కంపెనీ తమ 140 ప్రాపర్టీలకు సంబంధించిన రూ.13,01,15,464 బకాయిలు ఆన్ లైన్లో చెల్లించినట్లు తెలిపారు.

error: Content is protected !!