India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYDలో తిరిగే ఎలక్ట్రిక్ గ్రీన్ మెట్రో లగ్జరీ AC బస్సుల నెలవారీ బస్ పాస్‌ను TGSRTC ఇక రూ.1,900కే అందించనుంది. గతంలో రూ.2,530 ఉండగా ప్రయాణికుల కోసం రూ.630 తగ్గించినట్లు MDసజ్జనార్ తెలిపారు. అంతేకాదు ఈబస్ పాస్‌తో ఈ-మెట్రో ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్సుల్లో వెళ్లొచ్చని, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్ పాస్ కలిగిన వారు రూ.20కాంబినేషన్ టికెట్ తీసుకుని గ్రీన్ మెట్రో బస్సుల్లో ఒక ట్రిప్ వెళ్లొచ్చని తెలిపారు.
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 8, 9 తేదీల్లో చేప ప్రసాదం పంపిణీ జరగనుంది. ఈ నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల నుంచి నాంపల్లికి ప్రత్యేక బస్సులు నడపాలని టీజీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది. ప్రధానంగా రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ఎయిర్‌పోర్టు నుంచి బస్సులు అధిక సంఖ్యలో అందుబాటులో ఉండనున్నాయి. SHARE IT
HYD, రంగారెడ్డి జిల్లాల్లో గత రెండ్రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ‘వర్షం కురుస్తున్న సమయంలో కరెంట్ స్తంభాలను తాకొద్దు. మ్యాన్‌హోల్స్ ఓపెన్ చేయొద్దు. వరద ఉధృతిలో రోడ్డు దాటే సాహసం చేయొద్దు. శిథిలావస్థ భవనాలు ఖాళీ చేయాలి.’ అని సూచించారు. ఈ ఏడాది HYDలో వేరు వేరు ఘటన(వర్షం, వరదలు)ల్లో 15 మంది చనిపోయారు. బీ కేర్ ఫుల్. SHARE IT
వర్షాకాల నేపథ్యంలో నగరంలో వరద నీటి నివారణపై ప్రత్యేక దృష్టి సారించి, అవసరమైన చర్యలు చేపట్టినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. శేరిలింగంపల్లి జోన్ మాదాపూర్ సర్కిల్లోని బాటా షోరూం, యశోద హాస్పిటల్, శిల్పారామం, తదితర ప్రాంతాలలో వాటర్ స్టాగ్నేషన్ పాయింట్లను జోనల్ కమిషనర్ స్నేహ శబరీష్‌తో కలిసి పరిశీలించారు. వరద నీరు నిలువకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు కమిషనర్ సూచించారు.
Blinkit వేర్‌హౌస్‌లో తాజాగా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. సరుకులు నిల్వ చేసే గోదాంలో నిబంధనలు పాటించనట్లు గుర్తించారు. ఇక్కడి స్టాఫ్ గ్లౌస్‌లు, యాప్రాన్ ధరించడం లేదన్నారు. భారీగా ఆహార, సౌందర్య ఉత్పత్తులు నిల్వ చేయబడ్డాయని @cfs_telangana ట్వీట్ చేసింది. ఎక్సైరీ అయిన ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయని, నోటీసులు జారీ చేసి తదనుగుణంగా చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.
SHARE IT
గత అసెంబ్లీ ఎన్నికల్లో నగరంలో BRSకు పోలైన ఓట్లు ఈ సారి BJP వైపు మొగ్గుచూపడంతో చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్‌లో ఓటమి పాలైనట్లు INC శ్రేణులు పేర్కొంటున్నాయి. సికింద్రాబాద్‌లో పద్మారావుకు ఓట్లు తగ్గడంతోనే BJP గట్టెక్కిందంటున్నారు. చేవెళ్ల లోక్‌సభ పరిధిలో ముగ్గురు BRS MLAలు కొండాకి ఓట్లు వేయిస్తే, మల్కాజిగిరిలోనూ నలుగురు MLAలు ఇదే పని చేశారని INC నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై మీ కామెంట్?
జూపార్క్‌కు ప్రవేశ టిక్కెట్లను ఎక్కువ ధరకు విక్రయించటం లేదని నెహ్రూ జూలాజికల్ పార్కు క్యూరేటర్ సునీల్ హీరామత్ తెలిపారు. జూపార్కు ప్రవేశ టిక్కెట్లు రూ.70కు బదులుగా రూ.100కు విక్రయిస్తున్నట్లు సోషల్ మీడియాలో వ్యాపించిన విషయం అవాస్తవమని ఆయన తెలియజేశారు. జూపార్కు ప్రవేశ టికెట్ పెద్దలకు రూ.70 , చిన్నారులకు రూ.45కు టికెట్లను అమ్ముతున్నామని క్యూరేటర్ చెప్పారు.
HYD శివారు కడ్తాల్ శివారులో దారుణం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరు యువకులను దారుణ హత్య చేశారు. ఈ విషయం తెలుసుకున్న కడ్తాల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్న విచారణ చేపట్టారు. మృతులు కడ్తాల్ మండలం గోవిందాయిపల్లికి చెందినవారిగా గుర్తించారు.
భర్తను బెదిరించేందుకు ఓ మహిళ పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. రాజేంద్రనగర్ PS పరిధి కిస్మత్పూర్‌లో సామెల్, గోవిందమ్మ నివాసం ఉంటున్నారు. సామెల్ మరో స్త్రీతో కనిపించినట్లు గోవిందమ్మతో ఓ మహిళ చెప్పింది. దీంతో గోవిందమ్మ ఆత్మహత్యాయత్నం చేయగా సామెల్ ఆసుపత్రికి తరలించాడు. కాగా సామెల్ గోవిందమ్మతో మాట్లాడిన మహిళపై దాడి చేశాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది.
మృగశిర కార్తెను పురస్కరించుకొని ఆస్తమా వ్యాధిగ్రస్తులకు బత్తిని కుటుంబం ఈ నెల 8న అందించే చేప మందు ప్రసాదం పంపిణీకి ఆర్‌అండ్‌బీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో కౌంటర్లు ఏర్పాటు చేసి వాటి ద్వారా చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో క్యూలైన్‌ల కోసం బారికేడ్‌లు, విద్యుద్దీపాలు, సీసీ కెమెరాల ఏర్పాటు వంటి పనులను చేపట్టారు.
Sorry, no posts matched your criteria.