Hyderabad

News June 6, 2024

HYD: జానీ మాస్టర్‌పై ఫిర్యాదు

image

జానీ మాస్టర్‌పై రాయదుర్గం PSలో బుధవారం ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. తనను తెలుగు ఫిలిం అండ్ టీవీ డాన్సర్ అండ్ డాన్స్ డైరెక్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు జానీ మాస్టర్ వేధిస్తున్నారని, షూటింగ్‌లకు పిలవడం లేదని సతీశ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. 4 నెలలుగా ఉపాధి లేకుండా ఇబ్బంది పడుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు షూటింగ్ చెప్పిన కో-ఆర్డినేటర్లను సైతం బెదిరిస్తూ, జరిమానాలు విధించేలా చేస్తున్నారని ఆరోపించారు.

News June 5, 2024

మల్కాజిగిరిలో BRSకు విచిత్ర పరిస్థితి..!

image

మల్కాజిగిరి MP స్థానంలో BRSకు విచిత్ర పరిస్థితి ఎదురవుతోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 6సీట్లు, 2023లో 7కు 7 BRS క్లీన్ స్వీప్ చేసినప్పటికీ MPఎన్నికల్లో మాత్రం ఒక్కసారీ గెలవలేదు. ఇక్కడి ప్రజలు అసెంబ్లీకి BRSవైపే ఉంటున్నా MPకి మాత్రం వేరే పార్టీ వైపు చూస్తున్నారు. 2014 MPఎన్నికల్లో BRSఅభ్యర్థి మైనంపల్లి, 2019లో మర్రి రాజశేఖర్ రెడ్డి సెకెండ్ ప్లేస్‌లో ఉండగా ఈసారి రాగిడి థర్డ్ ప్లేస్‌లో ఉన్నారు.

News June 5, 2024

HYD: అందెశ్రీని సన్మానించిన సీఎస్ శాంతికుమారి

image

ప్రముఖ కవి, తెలంగాణ రాష్ట్ర గీతం రచయిత డా.అందెశ్రీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని HYDలోని రాష్ట్ర సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డా.అందెశ్రీని శాలువా కప్పి, పుష్పగుచ్ఛంతో సీఎస్ సత్కరించారు. ఈ సందర్భంగా తాను రచించిన పలు పుస్తకాలను సీఎస్ శాంతి కుమారికి అందెశ్రీ అందజేశారు.

News June 5, 2024

BREAKING: HYD: యువతిని కత్తితో పొడిచిన యువకుడు

image

HYD దుండిగల్ PS పరిధిలోని గండిమైసమ్మ వద్ద ఈరోజు దారుణం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. ఓ యువతి కడుపులో యువకుడు కత్తితో పొడిచాడు. దీంతో ఆమె పరిస్థితి విషమంగా మారడంతో స్థానికులు చికిత్స నిమిత్తం మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. ఆమెపై కత్తితో దాడి చేయడమే కాకుండా అతడు ఆత్మహత్యకు యత్నించాడు. దీంతో యువకుడిని స్థానిక అరుంధతి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News June 5, 2024

HYD: కాంగ్రెస్‌లో చేరిన నేతలకు పరాజయం

image

TGలో INC అధికారంలోకి వచ్చిన తర్వాత BRSను వీడిన దానం నాగేందర్, రంజిత్ రెడ్డి, పట్నం సునీత MP ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. చేవెళ్లలో రంజిత్ రెడ్డి 1,72,897 తేడాతో ఓడిపోయారు. మల్కాజిగిరి సిట్టింగ్‌ స్థానంలో INC గట్టి పోటీ ఇవ్వలేకపోయినా.. డిపాజిట్ దక్కించుకుంది. ఇక సికింద్రాబాద్‌ MP స్థానంలో దానం మెరుగైన ఓట్లనే రాబట్టి 2వ స్థానంలో నిలిచారు. ఎన్నికల ముందు INCలో చేరిన నేతలను రాజధాని ప్రజలు ఆదరించలేదు.

News June 5, 2024

సికింద్రాబాద్: ఆ పార్టీల కుట్రలు తిప్పికొట్టారు: కిషన్ రెడ్డి

image

సికింద్రాబాద్ లోక్‌సభ పరిధిలోని ప్రజలు కాంగ్రెస్, మజ్లిస్ పార్టీల కుట్రలను తిప్పి కొట్టారని కిషన్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ పరిధిలో ఎంపీగా గెలిచిన కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. త్వరలో ఢిల్లీకి వెళ్తున్నానని, అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరిని కలుస్తానని అన్నారు. ఈ దఫా మహిళలతోపాటు యువ, దళిత పలు మోర్చాల కార్యకర్తలు విశేష కృషి చేశారన్నారు.

News June 5, 2024

HYD: MIM మెజార్టీని టచ్ చేయని మాధవీ లత

image

MIM కంచుకోట హైదరాబాద్‌ లోక్‌సభ‌లో BJP ఘోర పరాజయం పాలైంది. కమలం పువ్వు గుర్తు మీద 3,23,894 (29.98%) ఓట్లు సాధించిన మాధవీ లత 2వ స్థానంలో నిలిచారు. 3,38,087 ఓట్ల భారీ మెజార్టీతో‌ ఆమెపై అసదుద్దీన్ ఒవైసీ ఘన విజయం సాధించారు. కనీసం MIMకు వచ్చిన మెజార్టీ ఓట్లను సైతం BJP ఢీ కొట్టలేకపోయింది. పతంగి గుర్తు మీద ఎన్నడూ లేని విధంగా ఈ ఎన్నికల్లో 6,61,981(61.28) ఓట్లు పోలవడం విశేషం.

News June 5, 2024

చేవెళ్ల: ఇదే స్థానం నుంచి రెండో సారి గెలుపు

image

చేవెళ్లలో బీజేపీ తరఫున బరిలో దిగిన కొండా విశ్వేశ్వర్ రెడ్డికి ఈ స్థానం నుంచి రెండో సారి విజయం లభించింది. 2014లో ఆయన BRS నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ పార్టీ నాయకత్వంతో పొసగక బయటకొచ్చిన ఆయన 2019లో కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీ నుంచి పోటీ చేసి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి రంజిత్‌రెడ్డి చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. కొండా బీజేపీలో చేరి 2024లో ఎన్నికల్లో విజయం సాధించారు.

News June 5, 2024

మల్కాజిగిరి: కాంగ్రెస్ కొంపముంచిన అభ్యర్థుల ఎంపిక

image

అధికార కాంగ్రెస్‌ పార్టీకి లోక్‌సభ ఎన్నికల ఫలితాలు తీవ్ర నిరాశకు గురిచేశాయి. BJP చేతిలో పరాజయాన్ని చవిచూడడానికి అభ్యర్థుల ఎంపికే దీనికి ప్రధాన కారణమని విశ్లేషకులు అంటున్నారు. మల్కాజిగిరి పార్లమెంట్‌ నుంచి పోటీకి కాంగ్రెస్‌ సీనియర్లు KLRతో పాటు మరికొందరు ఆసక్తి చూపినప్పటికీ టికెట్ ఇవ్వలేదు. చేవెళ్ల నుంచి సునీతారెడ్డి పోటీ చేసి ఉంటే ఇక్కడ గెలిచే అవకాశాలు మెరుగ్గా ఉండేవని పార్టీ నాయకులు అంటున్నారు.

News June 5, 2024

HYD: అంతా BRS.. అయినా BJP..!

image

అసెంబ్లీ ఎన్నికల్లో రాజధానిలోని దాదాపు అన్ని సీట్లలో BRS గెలిచినా ఎంపీ ఎన్నికల్లో మాత్రం BJP గెలిచింది. BRS పార్టీకి చెందిన 18 మంది ఎమ్మెల్యేలు, బలమైన క్యాడర్ ఉన్నా సరే ప్రజలు BJP వైపే మొగ్గు చూపారు. కాగా BRS నేతలు, శ్రేణులు కూడా BJPకి ఓటేశారని.. BRS, BJP ఒక్కటే అని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. లోపాయికారి ఒప్పందంతో అసెంబ్లీలో BRS, లోక్‌సభ ఎన్నికల్లో BJPని గెలిపించుకున్నారని చెబుతున్నారు.