Hyderabad

News June 4, 2024

HYD: మహిళ దారుణ హత్య.. కేసు నమోదు

image

ఓ మహిళ దారుణ హత్యకు గురైన ఘటన HYD బాలాపూర్ సమీపంలోని మీర్‌పేట్ PS పరిధి వినాయక హిల్స్‌లో కాసేపటి క్రితం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. స్థానికంగా నివాసం ఉంటున్న జటావత్ ప్రభు(45) అనే మహిళను ఆమె కూతురి అత్త సుత్తితో తలపై కొట్టి చంపేసింది. పోలీసులు వచ్చి పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. కాగా ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌ చేయడం గమనార్హం.

News June 4, 2024

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన MLA శ్రీ గణేశ్ బృందం

image

కంటోన్మెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందిన శ్రీగణేశ్ బృందం CM రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. వారికి CM అభినందనలు తెలిపారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజలకు సేవ చేయాలని ఈ సందర్భంగా శ్రీ గణేశ్‌కు సూచించారు. సీఎంను కలిసిన వారిలో జంపన ప్రతాప్, పల్లె లక్ష్మణ్ గౌడ్, ముప్పడి మధుకర్, సంకీ రవీందర్, ఇటుక రాజు, బద్రీనాథ్ ఉన్నారు

News June 4, 2024

HYD: డిపాజిట్లు కోల్పోయిన కాంగ్రెస్, BRS

image

HYD ఎంపీ స్థానంలో కాంగ్రెస్, BRS డిపాజిట్లు కోల్పోయాయి.ఇక్కడ పోలైన మొత్తం ఓట్లలో MIM అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ 61.28% ఓట్లతో గెలుపొందారు. BJP అభ్యర్థి మాధవీలతకు 29.98% ఓట్లు వచ్చాయి. ఇక కాంగ్రెస్ అభ్యర్థి మహమ్మద్ సమీర్‌కు 5.83%, BRS అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్‌కు 1.73% ఓట్లు రాగా డిపాజిట్లు కోల్పోయారు. ఒవైసీకి 6,61,981, మాధవీలతకు 3,23,894, సమీర్‌కు 62,962, శ్రీనివాస్‌కు 18,641 ఓట్లు వచ్చాయి.

News June 4, 2024

HYD: సీఎం రేవంత్ రెడ్డికి గట్టి దెబ్బ

image

CM రేవంత్ రెడ్డికి గట్టి దెబ్బ తగిలింది. ఆయన సిట్టింగ్ స్థానమైన మల్కాజిగిరి MP స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థి సునీతామహేందర్ రెడ్డిపై BJP అభ్యర్థి ఈటల రాజేందర్ భారీ మెజార్టీతో గెలుపొందారు. మల్కాజిగిరి స్థానంలో గెలవాలని CM ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినా కలిసిరాలేదు. ఇక CM సొంత జిల్లా వికారాబాద్‌లోనూ BJP చేవెళ్ల అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కొడంగల్‌లో BJP MBNR అభ్యర్థి DKఅరుణ సత్తా చాటి గెలుపొందారు.

News June 4, 2024

కంటోన్మెంట్‌ ఉప ఎన్నికలో‌ BRS ఓటమి

image

కంటోన్మెంట్‌ ఉప ఎన్నికలో‌ BRS పార్టీ ఘోర పరాజయం చవిచూసింది. సిట్టింగ్‌ స్థానంలో సాయన్న కుమార్తె నివేదిత ఇక్కడ 3వ స్థానానికి పరిమితం కావడం శ్రేణులను మరింత నిరాశ పర్చింది. BJP అభ్యర్థి వంశ తిలక్‌పై శ్రీ గణేశ్(INC) 13,206 ఓట్ల మెజార్టీతో‌ గెలుపొందారు. కాంగ్రెస్‌కు 53651 మంది ఓటేసి గెలిపించారు. వంశ తిలక్‌కు 40445, నివేదితకు 34462 మంది ఓటేశారు.

News June 4, 2024

సమస్యలు పరిష్కరిస్తా: ఈటల రాజేందర్

image

భారీ మెజార్టీతో గెలిపించిన మల్కాజిగిరి పార్లమెంటు ప్రజలందరికీ రుణపడి ఉంటానని ఈటల రాజేందర్ అన్నారు. మేడ్చల్ జిల్లా కీసర మండల పరిధి హోలీ మేరీ కళాశాలలో ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఆయనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఎలాంటి సమస్య ఉన్నా నిత్యం అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు పరిష్కరిస్తానని అన్నారు. మూడోసారి మోదీ అధికారంలోకి వస్తారని ధీమా వ్యక్తం చేశారు.

News June 4, 2024

HYD: కేంద్రంలో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం: కిషన్ రెడ్డి

image

ప్రజల ఆశీర్వాదం భాజపాకు ఉంది.. కేంద్రంలో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆయన చార్మినార్ వద్ద భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. అమ్మవారి ఆశీస్సులతో భాజపా భారీ విజయం సాధించబోతుందన్నారు. జూన్‌ రెండో వారంలో ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని తెలిపారు.

News June 4, 2024

BREAKING: HYD: కార్పొరేటర్ మృతి

image

HYD ఎర్రగడ్డ కార్పొరేటర్, MIM మహిళా నేత షాహిన్ బేగం ఈరోజు మృతిచెందారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె చికిత్స పొందుతూ మృతిచెందారు. కాగా 2020లో జరిగిన GHMC ఎన్నికల్లో ఎర్రగడ్డ నుంచి MIM పార్టీ తరఫున ఆమె గెలిచారు. ఆమె మృతికి పలు పార్టీల నాయకులు సంతాపం తెలిపారు.

News June 4, 2024

HYD: మొదటి రౌండ్ నుంచే ఆధిక్యత కనబరుస్తాం: ఈటల

image

బీజేపీ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థిగా ఈటల రాజేందర్ బరిలో ఉన్నారు. ఈ సందర్భంగా కుత్బుల్లాపూర్ సహా పలు నియోజకవర్గాల్లో ఉన్న పోలింగ్ ఏజెంట్లు, స్థానిక నేతలందరినీ ఆయన కలిశారు. కీసర ప్రాంతంలోనూ ఆయన పర్యటించారు. అనంతరం మాట్లాడిన ఈటల మొదటి రౌండ్ నుంచే ఆధిక్యత కనబరుస్తామని నమ్మకం ఉన్నట్లుగా చెప్పుకొచ్చారు. కచ్చితంగా బీజేపీ గెలుస్తుందన్నారు.

News June 4, 2024

HYD: రౌండ్ల వారీగా ఓట్లను ప్రకటిస్తాం : రోనాల్డ్ రాస్

image

హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయినట్లు ఆయా జిల్లాల కలెక్టర్లు అనుదీప్ దురిశెట్టి, శశాంక, గౌతమ్ పేర్కొన్నారు. ఫలితాలు వేగంగా అందించేలా యంత్రాంగానికి శిక్షణ ఇచ్చామని, సాంకేతికతను ఉపయోగించుకొని ఎప్పటికప్పుడు రౌండ్ల వారీగా ఓట్లు ప్రకటిస్తామని హైదరాబాద్ ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ పేర్కొన్నారు.