India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ సేవల విస్తరణ లక్ష్యంగా దక్షిణ మధ్య రైల్వే (SCR)తో గురువారం అవగాహన ఒప్పందం (MOU) కుదుర్చుకుంది. ఈ మేరకు SCR ఉద్యోగులను ఆన్‌బోర్డ్ చేసి, సేవలు అందించేలా MOU పై సంతకం చేశాయి. దీంతో SCR ఉద్యోగులకు బీమా, రుణాలు, క్రెడిట్ కార్డులు, వడ్డీ రాయితీ వంటి ప్రయోజనాలు అందనున్నాయి. ఈ కార్యక్రమంలో రెండు సంస్థల అధికారులు, ట్రేడ్ యూనియన్స్, ఉద్యోగులు పాల్గొన్నారు.
చేవెళ్లలో దారుణం చోటు చేసుకుంది. చేవెళ్లకు చెందిన పదోతరగతి విద్యార్థినిని ఓ వ్యక్తి గర్భవతిని చేశాడు. అబార్షన్ చేయించడంతో గాంధీలో ప్రాణాపాయ స్థితిలో విద్యార్థిని కొట్టుమిట్టాడుతోంది. విద్యార్థిని తండ్రి బుచ్చయ్య పోలీసులకు ఫిర్యాదు చేయగా సుదర్శన్ అనే వ్యక్తిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడు సుదర్శన్‌కు వివాహం కాగా.. ఓ కుమారుడు ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సమాజ నిర్మాణంలో తుమ్మబాల ఎనలేని సేవలు అందించి శాంతి, మతసామరస్యం, విద్యను ప్రజలకు అందించారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ సందర్బంగా సీఎం మాట్లాడుతూ.. వ్యక్తిగతంగా తుమ్మబాలతో నాకు ప్రత్యేక అనుబంధం ఉందని 2019 ఎంపీ ఎన్నికల్లో, 2023 శాసనసభ ఎన్నికల్లో వారు మమ్మల్ని మంచి మనసుతో ఆశీర్వదించారు. ఆయన మరణం వారి అభిమానులకు తీరని దుఃఖాన్ని మిగిల్చిందని పేర్కొన్నారు.
స్పా సెంటర్ల ముసుగులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నా.. నిర్వాహకులు ఏమాత్రం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో బంజారాహిల్స్‌లోని రోడ్ నంబర్ 12లోని ఓ అపార్ట్‌మెంట్లో స్పా ముసుగులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న నలుగురు మహిళలను పోలీసులు రైడ్స్ చేసి అరెస్టు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలియజేశారు.
ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదుల మేరకు ఏసీబీ అధికారులు వివిధ శాఖలపై రైడ్స్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నాంపల్లిలోని నీటిపారుదల శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. అదేవిధంగా రెడ్ హిల్స్‌లో ఉన్న రంగారెడ్డి జిల్లా పర్యవేక్షక ఇంజినీరింగ్ శాఖలో రాత్రి నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బన్సీలాల్, ఇల్లు కార్తీక్, నికేష్ అధికారులకు పట్టుపడ్డారు.
మేడ్చల్ పట్టణంలోని ఆదిత్య హాస్పిటల్ ఆధ్వర్యంలో వచ్చే జూన్ 3, 4వ తేదీల్లో ఉచిత వినికిడి వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నట్టు ఆస్పత్రి డాక్టర్ కిశోర్ తెలిపారు. రెండు రోజుల పాటు ఉదయం 10 నుంచి సాయంత్రం 8 గంటల వరకు వైద్యశిబిరం ఉంటుందన్నారు. వినికిడి
లోపం ఉన్న వారికి అత్యాధునిక పరికరాల తో పరీక్షలు నిర్వహిస్తామని, వినికిడి లోపంతో బాధపడుతున్న వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల రిహార్సల్స్ సందర్భంగా గన్‌పార్క్, పరేడ్ గ్రౌండ్స్, ట్యాంక్‌బండ్ ప్రాంతాల్లో వాహనాల రాకపోకలపై శుక్రవారం ఆంక్షలుంటాయని పోలీస్ అధికారులు తెలిపారు. గన్‌పార్క్ పరిసరాల్లో ఉదయం 9 నుంచి 10 గంటల వరకు, పరేడ్ గ్రౌండ్స్ వద్ద ఉదయం 10నుంచి 11 గంటల వరకు, ట్యాంక్‌బండ్‌పై రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహనాల రాకపోకలపై ఆంక్షలుంటాయన్నారు.
ప్రజల బలిదానాలు, అనేక మంది పోరాటాల ఫలితంగా 2014 జూన్ 2న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. రాష్ట్రం ఏర్పడి పదేళ్లయినా ఇప్పటికీ నగరంలోని పలు ప్రాంతాలు ఆనాటి ఘటనలను గుర్తుచేస్తుంటాయి. 2009నవంబర్ 9న LBనగర్ చౌరస్తాలో శ్రీకాంతచారి బలిదానం, 2010జనవరి 3న OUలో విద్యార్థి మహాగర్జన, 2011మార్చి 10న HYDలో మిలియన్ మార్చ్, 2011సెప్టెంబర్ 13న ప్రారంభించిన సకలజనుల సమ్మె మలిదశోద్యమంలో ఓ మైలురాయిగా నిలిచింది.
తెలంగాణ రాజముద్రపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని BRS మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆరోపించారు. మల్కాజిగిరిలో ఆయన గురువారం మాట్లాడుతూ.. కాకతీయ తోరణం, చార్మినార్ రాచరిక గుర్తులు కాదని, అవి మన తెలంగాణ చరిత్రకు గుర్తులన్నారు. రాష్ట్ర అధికార చిహ్నం నుంచి కాకతీయ తోరణం, చార్మినార్ తొలగిస్తే సహించేది లేదని హెచ్చరించారు. సంకుచిత నిర్ణయాలపై సమర శంఖం పూరించి ప్రజా ఉద్యమం చేస్తామన్నారు.
HYD రెడ్‌హిల్స్‌లోని రంగారెడ్డి జిల్లా పర్యవేక్షణ ఇంజినీర్ ఆఫీసులో ఈరోజు ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అవినీతికి పాల్పడిన ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ బన్సీలాల్, ఏఈలు నటాశ్, క్రాంతి తమకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కారని ఏసీబీ అధికారులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.