India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నేడు, రేపు పలు MMTS, 4 డెమూ సర్వీసులు రద్దు చేస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే(SCR) ప్రకటించింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనులు, ఫుట్ ఓవర్ బ్రిడ్జి(FOB)ల నిర్మాణం నేపథ్యంలో సికింద్రాబాద్-ఫలక్‌నుమా, మేడ్చల్- సికింద్రాబాద్, లింగంపల్లి-మేడ్చల్, హైదరాబాద్- మేడ్చల్ మధ్య సేవలందించే 22 MMTS సర్వీసులను రద్దు చేస్తున్నట్లు చీఫ్ పీఆర్వో సీహెచ్.రాకేశ్ తెలిపారు. SHARE IT
చార్మినార్ శ్రీ భాగ్యలక్ష్మి దేవాలయాన్ని శుక్రవారం రాత్రి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ దంపతులు సందర్శించారు. మోహన్ యాదవ్, ఆయన సతీమణి సీమా యాదవ్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయాన్ని సందర్శించిన సందర్భంగా దంపతులకు ఆలయ ట్రస్టీ ఛైర్మన్ శశికళ శాలువా, మెమెంటోతో ఘనంగా సత్కరించారు.
> బిగ్ బాస్కెట్ గోడౌన్‌లో డేట్ అయిపోయిన వస్తువులు
> మద్యంమత్తులో హల్‌చల్ చేసిన యువతీ యువకుడు అరెస్ట్
> గాంధీ ఆస్పత్రి ఆవరణలో గుర్తు తెలియని డెడ్‌బాడీ లభ్యం
> శామీర్‌పేటలో దొంగల బీభత్సం
> మలక్‌పేట్‌లో ఇద్దరు పిల్లలతో గృహిణి MISSING
> భార్యను చంపేసి పరారీ.. చివరికి అరెస్ట్
> గండిపేటలో డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీలు
> ఓయూలో కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం
హైదరాబాద్‌లో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధి సాయి అనురాగ్ కాలనీలో కుటుంబ కలహాలతో భర్త నాగేంద్ర భరద్వాజ.. భార్య మధులత(సాఫ్ట్‌వేర్ ఉద్యోగి)ను హత్య చేశాడు. ముక్కలు ముక్కలుగా నరకడానికి ప్రయత్నించినట్లు మృతురాలి తండ్రి రంగనాయకులు PSలో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుడిని తాజాగా అరెస్ట్ చేశారు.
తమకు పూర్తి వేతనం చెల్లించి ఆదుకోవాలని రాష్ట్ర మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం HYDలో వారు మాట్లాడుతూ.. కేవలం 10 నెలలకే జీతం ఇవ్వడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఇతర గురుకుల సంస్థల్లో ఇచ్చినట్లు తమకు 12 నెలలపాటు వేతనాలు చెల్లించాలన్నారు. గత నెలలో 4వేల మంది సిబ్బందిని 2 నెలలపాటు తొలగించడంతో వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయని వాపోయారు.
త్వరలో అమల్లోకి రానున్న నూతన చట్టాలు మన దేశ శాంతి భద్రతల పరిరక్షణలో ఒక మైలురాయిగా నిలుస్తాయని రాచకొండ CP తరుణ్ జోషి అన్నారు. జులై 1 నుంచి భారత ప్రభుత్వ నూతన నేర న్యాయ చట్టాలు అమలులోకి రానున్న నేపథ్యంలో పలు కేసుల దర్యాప్తు, విచారణలో పాటించాల్సిన నూతన విధానాలపై సిబ్బందికి RCIలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. నూతన చట్టాలతో కేసుల దర్యాప్తు విధానాలు, విచారణ పద్ధతుల్లో మార్పు వస్తుందన్నారు.
గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షలు చేసే బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రఘునాథ స్వామి హెచ్చరించారు. కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి సలహా కమిటీ సమావేశం నిర్వహించారు. గర్భధారణ, లింగ నిర్ధారణ ప్రక్రియ నిషేధ చట్టం అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా సలహా కమిటీ సభ్యులకు సూచించారు.
ఆస్ట్రేలియాలో HYD శివారు షాద్‌నగర్ వాసి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. BJP దివంగత నేత కృష్ణ కుమారుడు అరవింద్ యాదవ్(30) 12ఏళ్లుగా ఉద్యోగం చేస్తూ AUSలోని సిడ్నీలో స్థిరపడ్డారు. సోమవారం ఇంటి నుంచి బయలుదేరి వెళ్లిన అరవింద్ కనిపించకపోవడంతో అక్కడ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. సముద్రంలో అరవింద్ మృతదేహం ఈరోజు లభించడంతో హత్యా, ఆత్మహత్యా అనే కోణంలో విచారణ చేపట్టారు.
గగనతలంలో విమానం తలుపు తీసేందుకు యత్నించిన వ్యక్తికి ఆర్జీఐఏ పోలీసులు 41 సీఆర్‌పీ నోటీసులు ఇచ్చారు. పోలీసులు తెలిపిన వివరాలు.. HYD గాజులరామారం ప్రాంతానికి చెందిన జిమ్ ట్రైనర్ అనిల్ మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నుంచి శంషాబాద్‌కు వస్తున్నాడు. ఈ క్రమంలో గగనతలంలో విమానం తలుపు తెరిచేందుకు యత్నించాడు. దీంతో భద్రతాధికారులకు ఫిర్యాదు చేయగా వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనిల్‌పై కేసు నమోదు చేశారు.
స్టాక్ మార్కెట్ పేరుతో సైబర్ నేరగాళ్లు రూ.5.60 లక్షలు టోకరా వేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. సికింద్రాబాద్‌కు చెందిన ఓ వ్యాపారి.. స్టాక్ మార్కెట్‌లో లాభాలు వచ్చేలా పెట్టుబడి పెట్టిస్తామని ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ప్రకటన చూశాడు. లింక్‌పై క్లిక్ చేయగా ఓ టెలిగ్రామ్ గ్రూప్‌లో యాడ్ అయ్యాడు. మొదట కొంత పెట్టుబడి పెట్టగా..లాభాలు వచ్చాయి. దీంతో విడతలవారీగా రూ.5.60 లక్షలు పెట్టి మోసపోయి CCSలో ఫిర్యాదు చేశాడు.
Sorry, no posts matched your criteria.