India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYD ఉప్పల్ పరిధి బ్యాంక్ కాలనీలో ఈరోజు దారుణ ఘటన వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాలు.. జనగామకు చెందిన రమేశ్, కమల(29) దంపతులు ఉప్పల్‌లో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో భార్యపై అనుమానం పెంచుకున్న రమేశ్ ఆమెను అర్ధరాత్రి చంపి PSలో లొంగిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) సోమవారం ప్రారంభమైంది. నగరంలోని పరీక్ష కేంద్రాల వద్దకు అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో రావడంతో సందడి కనిపించింది. తాగునీరు ఇతరత్రా సౌకర్యాలు కల్పించడంతో పరీక్ష ప్రశాంతంగా కొనసాగింది. హైదరాబాద్‌లో మొత్తం 387 మందికి 260 మంది పరీక్ష రాశారని విద్యాశాఖ అధికారులు తెలిపారు.
నగరంలో చేపట్టే వివిధ ఇంజినీరింగ్ పనుల కోసం గతేడాది మే నెలకు సంబంధించిన రూ.57.23 కోట్ల బిల్లులను జీహెచ్ఎంసీ సోమవారం విడుదల చేసింది. మొత్తం రూ.1,300 కోట్ల బిల్లులను చెల్లించాల్సి ఉందని గుత్తేదారులు ఆందోళనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు గుత్తేదారులతో చర్చించి మరికొంత సమయం కోరారు. తాత్కాలిక ఉపశమనంగా కొంత మొత్తాన్ని విడుదల చేశారు.
భర్తను వేధిస్తూ టార్చర్ చేస్తున్న భార్యపై కేసు నమోదైంది. పోలీసులు, బాధితుడు తెలిపిన వివరాలు.. APఅమలాపురం వాసి టెమూజియన్ కుముజకు రాజోలు వాసి లక్ష్మీగౌతమితో ఏడేళ్ల క్రితం వివాహమైంది. వారు HYDఅల్వాల్‌లో వచ్చి ఉంటున్నారు. వీరికి ఐదేళ్ల కుమారుడు. భర్త మల్లారెడ్డి కాలేజీలో సహాయ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు. అత్తింటి ఆస్తుల కోసం ఆమె.. భర్త, అత్తమామలను వేధిస్తోంది. కత్తితో భర్తపై దాడి చేయగా కేసు నమోదైంది.
రాజ్యాంగం గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్‌కు లేదని బీజేపీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. ఢిల్లీలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో సోమవారం కొండా మాట్లాడుతూ.. 31 శాతం దళితులే ఉన్న రాయ్‌బరేలి నియోజకర్గంలో స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఆ వర్గానికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేదన్నారు. దేశ రాజధాని ప్రజలంతా బీజేపీకే మరోసారి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.
HYDలోని పర్యాటక ప్రదేశాలకు ఇటీవల ప్రజలు పోటెత్తుతున్నారు. ఆదివారం ఒక్కరోజే జూపార్కుకు 25,600 మంది వచ్చిన విషయం తెలిసిందే. ఇక అదే రోజు ట్యాంక్ బండ్‌కు లక్ష మందికిపైగా రాగా 13,350 మంది బోటు షికారు చేసి గత రికార్డులన్నీ బద్దలుకొట్టారు. ఆ రోజు రూ.13.52 లక్షల ఆదాయం వచ్చిందని జి.ప్రభుదాస్ తెలిపారు. కొవిడ్ తర్వాత ఇంత ఆదాయం రావడం ఇదే ప్రథమమన్నారు. సోమవారం సాయంత్రం సైతం భారీగా జనం వచ్చారు.
HYD నగరంలో అధిక వడ్డీ ఆశ చూపి ప్రత్యేక స్కీముల పేరిట పెట్టుబడులను స్వీకరించి స్కాములతో ప్రజలను మోసం చేసే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని రాచకొండ కమిషనరేట్ సీపీ తరుణ్ జోషీ ప్రజలను హెచ్చరించారు. పలు సంస్థలలో పెట్టుబడులు పెడితే అధిక వడ్డీతో పాటు, తక్కువ సమయంలో భారీగా లాభాలు పొందవచ్చని మాయమాటలు చెప్పే వారిని నమ్మొద్దన్నారు.
బంగాళాఖాతంలో ఈనెల 22 నాటికి ఓ అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది వాయువ్య దిశలో కదిలి ఈనెల 24 నాటికి మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30-40కి.మీ ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు.
హీరో ఎన్టీఆర్‌కు జనసేనాని పవన్ కల్యాణ్ బర్త్ డే విషెస్ తెలిపారు. ‘ప్రముఖ కథానాయకుడు ఎన్టీఆర్‌కు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆస్కార్ పురస్కారం అందుకున్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో సినీ ప్రియుల మెప్పు పొందారు. తనదైన అభినయం, నృత్యంతో ప్రేక్షకుల అభిమానాన్ని దక్కించుకున్న ఎన్టీఆర్ మరిన్ని విజయాలు అందుకోవాలి’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.
నగర శివారు శంషాబాద్ మండలం నానాజీపూర్‌లో ఓ ఇంటి నిర్మాణ అనుమతుల కోసం రూ.35వేలు లంచం తీసుకుంటూ గ్రామపంచాయతీ సెక్రెటరీ రాధిక ఏసీబీ అధికారులకు చిక్కారు. దీంతో 111 జీవో పేరుతో గ్రామపంచాయతీ కార్యదర్శులు అందినకాడికి దోచుకుంటున్నారని ఇదే నిదర్శనమని జనం ఆరోపిస్తున్నారు. శంషాబాద్‌లో ఎలాంటి నిర్మాణాలకు అనుమతులు లేకపోవడంతో ఇదే అదునుగా అనుమతుల పేరుతో రాధిక అవినీతికి పాల్పడిందని ఏసీబీ అధికారులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.