Hyderabad

News May 16, 2024

HYD: రైల్వేస్టేషన్ నుంచి మెట్రో, ఆర్టీసీ అనుసంధానం!

image

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దిగి సామగ్రితో మెట్రో స్టేషన్‌కు వెళ్లడం గగనంగా మారింది. కానీ ఇప్పుడు.. ప్రతి ప్లాట్‌ ఫారం నుంచి సులభంగా మెట్రో స్టేషన్ చేరుకునేలా నిర్మాణాలు చేపడుతున్నారు. ఆర్టీసీ బస్ స్టేషన్లకు కూడా నేరుగా స్టేషన్ నుంచి వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నారు. సికింద్రాబాద్ స్టేషన్ ఇరువైపులా ప్రజలు తిరిగేలా 12 మీటర్ల వెడల్పుతో పాదచారుల వంతెన అందుబాటులోకి రానున్నట్లు అధికారులు తెలిపారు.

News May 16, 2024

18 నుంచి బంద్‌కు పిలుపునిచ్చిన జీహెచ్‌ఎంసీ కాంట్రాక్టర్లు

image

జీహెచ్‌ఎంసీతో కాంట్రాక్టర్లు పోరుకు సిద్ధమయ్యారు. బకాయిలు చెల్లిస్తేనే పనులు జరుపుతామని, కొత్తగా వచ్చే ఏ పనులను చేపట్టబోమని, ఈ నెల 18 నుంచి కాంట్రాక్టర్లు మూకుమ్మడిగా బంద్‌లోకి వెళ్తున్నట్లు అల్టిమేటం జారీ చేశారు. ఇప్పటికే పూర్తి చేసిన పనులకు సంబంధించి రూ.1,350 కోట్ల బిల్లులు రావాల్సి ఉన్నదని, వాటిని వెంటనే రిలీజ్‌ చేయాలని జీహెచ్‌ఎంసీ కాంట్రాక్టర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు డిమాండ్‌ చేశారు.

News May 16, 2024

REWIND-2019: హైదరాబాద్‌లో BJP ఓటమి!

image

HYD లోక్‌సభ‌పై అందరి దృష్టి పడింది. దశాబ్దాలుగా‌ ఇక్కడ MIM‌దే హవా. 2019‌ ఎన్నికల్లోనూ వార్‌ వన్‌సైడ్ అయింది. భగవంతరావు(BJP)పై అసదుద్దీన్(MIM) 2,82,186 ఓట్ల భారీ మెజార్టీతో‌ గెలుపొందారు. కానీ, ప్రస్తుత రాజకీయాలు మారాయి. ఎన్నికల‌కు ముందు MIM, BJP, INC, BRS నువ్వానేనా అన్నట్లు ప్రచారం చేశాయి. పోలింగ్ ముగిశాక ఎవరికి వారు‌ మాదే గెలుపు అంటున్నారు. ఈసారి HYDలో టగ్ ఆఫ్ వార్‌ అని‌ టాక్. దీనిపై మీకామెంట్?

News May 16, 2024

HYD: వ్యాస రచన పోటీల్లో పాల్గొనండి..!

image

HYD కొంపల్లి సమీపంలోని దూలపల్లి ICFRE సెంట్రల్ ఫారెస్ట్ విద్యాసంస్థలో అంతర్జాతీయ జీవవైవిద్య దినోత్సవంలో భాగంగా వ్యాసరచన పోటీలను నిర్వహిస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. మే 20వ తేదీన కాంటెస్ట్ ఉంటుందని, ఆసక్తి గలవారు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. ప్రథమ స్థానంలోని ముగ్గురికి సర్టిఫికెట్ అందించడంతోపాటు, వారి పేర్లను విద్యాసంస్థ బోర్డుపై ప్రదర్శిస్తామని పేర్కొన్నారు.

News May 15, 2024

HYD: అప్పుడే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలి: R.కృష్ణయ్య 

image

తెలంగాణలో బీసీ కులగణన చేసి పంచాయతీరాజ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ రిజర్వేషన్లు 50 శాతానికి పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఆర్.కృష్ణయ్య సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. 50 శాతం రిజర్వేషన్లు పెంచకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే బీసీలు ఉద్యమిస్తారని ఆయన హెచ్చరించారు.

News May 15, 2024

HYD: మ్యూల్ బ్యాంక్ ఖాతాల కేసులో మరొకరు అరెస్ట్

image

మ్యూల్ బ్యాంక్ ఖాతాల కేసులో మరొకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. HYD కీసరలో కేశవరెడ్డి అనే వ్యక్తిని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు అరెస్ట్ చేశామని తెలిపారు. నిందితుడు ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు గుర్తించామని, 125 మ్యూల్ బ్యాంక్ ఖాతాలను తెరిచినట్లు విచారణలో తేల్చామని చెప్పారు. 2023లో నమోదైన కేసు ఆధారంగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు దర్యాప్తు చేశారు. 

News May 15, 2024

మన హైదరాబాద్‌లో హోర్డింగులు భద్రమేనా?

image

ముంబైలో భారీ హోర్డింగ్ కుప్పకూలి
14 మంది మరణించడంతో పాటు 70 మందికి పైగా తీవ్రగాయాలైన ఘటనతో హైదరాబాద్ నగర ప్రజల్లో ఆందోళన మొదలైంది. నగరంలో అడ్డగోలుగా వెలసిన అక్రమ హోర్డింగులెన్నో ఉన్నాయి. రానున్నది వర్షాకాలం ఏ క్షణాన ఈదురు గాలులు వీస్తే కూలుతాయో తెలియని పరిస్థితిలో ఎన్నో ఉన్నాయి. HYDలో అక్రమ హోర్డింగులను కూల్చేస్తామని ప్రకటించిన GHMC ఆ పనిని పూర్తి చేయలేకపోయింది. దీనిపై మీ కామెంట్?

News May 15, 2024

HYD: విద్యాశాఖ మంత్రిని నియమించాలని డిమాండ్

image

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు కావస్తున్నా ఇంత వరకు విద్యాశాఖ మంత్రి లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ HYDలో ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే సీఎం రేవంత్ రెడ్డి స్పందించి విద్యాశాఖ మంత్రిని నియమించాలని, విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.మంత్రి లేక అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు.

News May 15, 2024

HYD: సాలార్జంగ్ మ్యూజియంలో సమ్మర్ క్యాంప్

image

HYDలోని సాలార్జంగ్ మ్యూజియంలో సమ్మర్ ఆర్ట్ క్యాంపు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. ఉదయం యోగా, మధ్యాహ్నం ఆర్ట్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తిగల విద్యార్థులు, నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకోవడం కోసం క్యాంపులో పాల్గొనవచ్చని మ్యూజియం అధికారులు పేర్కొన్నారు. విద్యార్థులు వివిధ కళాకృతులను ప్రదర్శిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు.

News May 15, 2024

HYDలో జేసీ ప్రభాకర్ రెడ్డికి చికిత్స

image

TDP ఆంధ్రప్రదేశ్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నిన్న తాడిపత్రిలో జరిగిన గొడవల్లో పోలీసులు ప్రయోగించిన బాష్ప వాయువుతో తీవ్ర అస్వస్థతకు గురైనట్లుగా కుటుంబీకులు తెలిపారు. మెరుగైన చికిత్స కోసం HYD అబిడ్స్ కాంచన హాస్పిటల్ వద్దకు ఆయన్ను తరలించారు.