Hyderabad

News May 12, 2024

WOW.. HYDలో సొరంగ మార్గం..!

image

HYDలో సొరంగ మార్గ నిర్మాణంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఎన్నికల తర్వాత నిపుణులతో సాయిల్, రూట్ ఇన్వెస్టిగేషన్ జరుగనుంది. ITC కోహినూర్ నుంచి ఖాజాగూడ, నానక్‌రాంగూడ మీదుగా విప్రో సర్కిల్‌ వరకు.. ITC నుంచి JNTUH, ITC నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45, GVK మాల్ నుంచి నానల్‌నగర్ వరకు.. నాంపల్లి నుంచి చాంద్రాయణగుట్ట,చార్మినార్ నుంచి ఫలక్‌నుమా వరకు ఆయా మార్గాల్లో సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని నిర్ణయించారు.

News May 12, 2024

HYD: 500 చెట్లను తిరిగి నాటేలా చర్యలు

image

HYD చర్లపల్లి రైల్వే టర్మినల్ సంబంధించి అధికారులు ఓ ఇంట్రెస్టింగ్ ఫాక్ట్ తెలిపారు. స్టేషన్ పునరుద్ధరణ సమయంలో దాదాపుగా 500 చెట్లను తొలగించి, నార్త్ లాలాగూడ, మౌలాలి, ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్ పరిసరాల్లో వాటిని మళ్లీ నాటినట్లుగా పేర్కొన్నారు. పర్యావరణంపై ఉన్న ప్రేమతో చెట్లను నరికి వేయకుండా, ఈ విధంగా చేసినట్లు వెల్లడించారు. మరోవైపు చర్లపల్లి రైల్వే స్టేషన్లో 5,500 మొక్కల పెంపునకు శ్రీకారం చుట్టారు.

News May 12, 2024

HYD: ఎన్నికలకు భారీ బందోబస్తు ఏర్పాటు: సీపీ

image

శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించేందుకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రాచకొండ కమిషనర్ తరుణ్ జోషి తెలిపారు. HYD నేరేడ్‌మెట్‌లోని రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి పౌరుడు తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని, డబ్బు, మద్యం అక్రమ రవాణాను అడ్డుకుంటామన్నారు. ఇప్పటి వరకు రూ.2 కోట్లు స్వాధీనం చేసుకుని ఎన్నికల అధికారులకు అందించామని పేర్కొన్నారు.

News May 11, 2024

HYD: ఓటేసిన వారికి ఆఫర్ అంటూ ఫ్లెక్సీ

image

HYD కుత్బుల్లాపూర్ పరిధి సూరారంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని, పోలింగ్ శాతాన్ని పెంచాలని కోరుతూ సామాజిక కార్యకర్త రవీందర్ ముదిరాజ్ శనివారం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మే 13న ఎన్నికల్లో ఓటు వేసిన వారు.. తమ షాప్‌కు వచ్చి వారి చేతికున్న సిరా గుర్తు, ఓటర్ ఐడీ, ఆధార్ కార్డు చూపిస్తే కూరగాయలు 10 శాతం, జిరాక్స్ 25 శాతం తక్కువ ధరకు ఇస్తానని బ్యానర్ ఏర్పాటు చేశారు.

News May 11, 2024

HYD: రైల్వే పట్టాలు దాటేటప్పుడు జర జాగ్రత్త!

image

రైల్వే పట్టాలను దాటేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా ప్రాణాలు పోతాయని పోలీసులు హెచ్చరించారు. ఈరోజు హైటెక్ సిటీ-హఫీజ్‌పేట్ మధ్యలో ఓ గుర్తుతెలియని వ్యక్తి(35) రైలు ఢీకొని మృతిచెందాడని రైల్వే హెడ్ కానిస్టేబుల్ బి.శ్రీనివాసులు తెలిపారు. ఉందానగర్-బుద్వేల్ లైన్‌లో మరో వ్యక్తి(25) ఇలాగే చనిపోయాడని హెడ్ కానిస్టేబుల్ చిమ్నా తెలిపారు. మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

News May 11, 2024

HYD: రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్

image

HYD బాచుపల్లిలో ఇటీవల గోడ కూలి మృతిచెందిన కూలీలకు ఒక్కొక్కరికి రూ.50 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని జన్‌ సేవా సంఘ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌పీ సింగ్‌ డిమాండ్‌ చేశారు. శనివారం బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బాచ్‌పల్లిలో ఈనెల 10న గోడ కూలి ఏడుగురు కార్మికులు మృతిచెందారని, పలువురు గాయపడ్డారని, వారికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

News May 11, 2024

HYD: గడిచిన 24 గంటల్లో రూ.6,89,05,563 సొత్తు సీజ్

image

ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో భాగంగా HYDలో ఏర్పాటు చేసిన వివిధ ఎన్ఫోర్స్‌మెంట్ బృందాల ద్వారా గడిచిన 24 గంటల్లో రూ.34,28,500 నగదు సీజ్ చేసినట్లు HYD ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ తెలిపారు. రూ.6,54,77,063 విలువ గల ఇతర వస్తువులు, 126.70 లీటర్ల మద్యాన్ని పట్టుకుని సీజ్ చేసి, 9 మందిపై కేసులు నమోదు చేసి ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

News May 11, 2024

HYD: యజమాని మృతి.. విశ్వాసం చాటుకున్న పెంపుడు కుక్క

image

ఓ పెంపుడు కుక్క తన విశ్వాసం చాటుకుంది. HYD మేడ్చల్ పరిధి కిష్టాపూర్‌లో ఉండే కొడతల వెంకటేశ్ (45) శుక్రవారం గుండెపోటుతో మరణించాడు. అయితే యజమాని చనిపోవడంతో పెంపుడు కుక్క వెంకటేశ్ అంత్యక్రియల్లో పాల్గొని అక్కడే ఉండిపోయింది. అంత్యక్రియలు చేసిన చోట తిరుగుతూ స్థానికులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ శునకాన్ని చూసిన కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.

News May 11, 2024

HYD: BRSను లేకుండా చేయాలని కాంగ్రెస్, BJP ప్లాన్: KTR

image

తెలంగాణ గొంతుకైనా BRSను లేకుండా చేయాలని కాంగ్రెస్, BJP కలిసి ప్లాన్ వేశాయని మాజీ మంత్రి KTR ఆరోపించారు. HYD యూసుఫ్‌గూడలో ఈరోజు నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్, BJP కలిసి ముందు BRSను లేకుండా చేయాలని, ఆ తర్వాత మనం గొడవపడదామని బండి సంజయ్ అన్న ఓ వీడియోను ఆయన సభలో చూపించారు. ఆ పార్టీలు తెలంగాణకు చేసిందేమీ లేదని, కానీ ఎన్నికలు రాగానే ఢిల్లీ, గుజరాత్ నుంచి నేతలు వస్తున్నారన్నారు.

News May 11, 2024

రంగారెడ్డి: పోలింగ్ నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు: కలెక్టర్

image

ఈసీ మార్గదర్శకాల ప్రకారం పోలింగ్ నిర్వహణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక శనివారం ఆదేశించారు. చేవెళ్ల పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మహిళలు, యువత, దివ్యాంగులను పోలింగ్‌లో భాగస్వామ్యం చేసేలా, ఆ సందేశం స్పష్టంగా తెలిసేలా మోడల్ పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి సదుపాయాలను సరిచూసుకోవాలన్నారు.