India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYD అల్వాల్‌లో <<13198573>>బావ యుగేంధర్(40)ను<<>> బావమరిది సుబ్రహ్మణ్యం హత్య చేసిన విషయం తెలిసిందే. పోలీసులు తెలిపిన వివరాలు.. స్థానికుడైన ఎం.యుగేంధర్.. గతంలో పలు నేరారోపణలతో జైలుకెళ్లి వచ్చాడు. ఈ క్రమంలో భార్య జానకి, కుమార్తెను వేధిస్తున్నాడు. తాగొచ్చి భార్యపై దాడి చేయడంతో ఆమె తన తమ్ముడు సుబ్రహ్మణ్యానికి చెప్పింది. దీంతో అక్కను నిత్యం వేధిస్తున్నాడని కక్ష పెంచుకున్న బావమరిది బావను బండరాయితో మోది హత్య చేశాడు.
HYDలో కురిసిన వర్షానికి చాలా ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచిపోవడంతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. వర్షం పరిస్థితులపై కమిషనర్ రోనాల్డ్ రాస్ అధికారులతో సమీక్షించారు. రోడ్లపై నిలిచిపోయిన నీటిని చెట్ల కొమ్మలను వెంటనే తొలగించాల్సిందిగా ఆదేశించారు. కంట్రోల్ రూమ్‌కి వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించి చర్యలు చేపట్టాలన్నారు. దాదాపు 75 ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచినట్లు అధికారులు గుర్తించారు.
ఎండలు తీవ్రంగా ఉండటంతో బాటసారులు, పౌరులకు చల్లటి తాగునీరందించేలా నగరవ్యాప్తంగా చలివేంద్రాల సంఖ్య పెంచాలని జలమండలి ఎండీ సుదర్శన్ రెడ్డి అధికారులకు సూచించారు. వేసవి దృష్ట్యా తాగునీటి ఇబ్బందులు, రానున్న వర్షాకాలానికి కార్యాచరణపై అధికారులతో సమీక్షించారు. తాగునీటి సరఫరా, ట్యాంకర్ల నిర్వహణ, వినియోగదారుల ఫిర్యాదులపై ఆరా తీశారు. తాగునీటి సమస్య ఉన్న ప్రాంతాల్లో సిబ్బంది దృష్టి సారించాలన్నారు.
సీఎం రేవంత్ రెడ్డిని గతంలో మర్యాదపూర్వకంగానే కలిశానని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ మరోసారి స్పష్టం చేశారు. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను ఖండించారు. HYD తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ పదేళ్లలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారన్నారు. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తాను BRSలో సంతృప్తిగా ఉన్నాననన్నారు. బీసీలకు ఎక్కువ సంఖ్యలో టికెట్లు ఇచ్చిన BRSను ఆదరించాలన్నారు.
నగరాభివృద్ధి కోసం జీహెచ్ఎంసీ అవలంబిస్తున్న పథకాలను కమిషనర్ రోనాల్డ్ రాస్ శిక్షణ ఐఏఎస్‌లకు వివరించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా డెమోగ్రఫీ, శానిటేషన్, చెత్త సేకరణ, డిస్పోజల్, సీ అండ్ డీ అడ్మినిస్ట్రేషన్, ఆస్తి పన్ను వసూలు తదితర పథకాలను ఆయన వివరించారు. సమావేశంలో ఈఎన్సీ జియాఉద్దీన్, అదనపు కమిషనర్ ఉపేందర్ రెడ్డి, శిక్షణ ఐఏఎస్‌లు పాల్గొన్నారు.
వయోధికుడి నుంచి రూ.91.64 లక్షలు సైబర్ నేరగాళ్లు స్వాహా చేశారు. నగరానికి చెందిన 74 ఏళ్ల వయోధికుడికి ఫెడెక్స్ కొరియర్ నుంచి ఓ వ్యక్తి కాల్ చేశాడు. మీకు వచ్చిన పార్సెల్‌లో మత్తు పదార్థాలు ఉన్నాయని బెదిరించారు. కేసు నుంచి తప్పించాలంటే తమకు డబ్బు బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు భయపడ్డ వయోధికుడు రూ.91.64లక్షలు బదిలీ చేశాడు. ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించారు.
HYD బాచుపల్లి రేణుకా ఎల్లమ్మ కాలనీలో నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఏడుగురు చనిపోవడంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్న సీఎం.. తప్పిదం ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. గాయపడిన వారికి సరైన వైద్య చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. చనిపోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు.
ఓటు వేసి దేశభక్తిని చాటుకోవాలని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని HYD ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ తెలిపారు. GHMC ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆంధ్ర ప్రాంతం వారైనా, ఇతర రాష్ట్రాల వాసులైనా నగరంలో ఓటు ఉన్నవారు, ఇక్కడే ఓటు వేయాలని సూచించారు. రెండు ప్రాంతాల్లో ఓటు హక్కును కలిగి ఉండటం చట్ట విరుద్ధమని, అలాంటి వారిపై కేసు నమోదు చేస్తామని తెలిపారు.
వికారాబాద్ జిల్లా ధారూర్‌లో ఈనెల 2న BRS కార్యకర్తల సమావేశంలో కుక్కింద గ్రామానికి చెందిన మల్లేశం ప్రమాదవశాత్తు చికెన్ కర్రీ, సాంబార్‌లో పడి గాయపడిన విషయం తెలిసిందే. కాగా మెరుగైన వైద్యం నిమిత్తం అతడిని HYDలోని గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ రాత్రి మరణించాడు. మల్లేశం సోదరుడు కృష్ణయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ వేణుగోపాల్ గౌడ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
బీజేపీ మల్కాజిగిరి లోక్‌సభ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు సంబంధించి వైరల్ అవుతున్న మార్ఫింగ్ వీడియోలకు కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీతారెడ్డి కారణమంటూ బీజేపీ నేతలు ఎన్.రామచందర్‌రావు, గోకుల రామారావు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈటల పరువు ప్రతిష్ఠలు దెబ్బతీసేలా వీడియోలు వైరల్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల ప్రధానాధికారిని కోరారు.
Sorry, no posts matched your criteria.