India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
శంషాబాద్ విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది. ఐదు రోజులుగా చిరుత కోసం అటవీ శాఖ అధికారులు గాలింపు చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. దీన్ని పట్టుకోవడానికి 5 బోన్లు, 20 కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ చిరుతను నెహ్రూ జూ పార్కుకు తరలించనున్నారు. జూలో చిరుత ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌కు తరలించనున్నారు. కాగా, 5 రోజులుగా అధికారులను చిరుత ఉక్కిరిబిక్కిరి చేసింది.
ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి
చెందిన ఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం పాతబస్తీ ఉప్పుగూడకు చెందిన రమేశ్(70) ఉప్పల్ ఆదిత్య ఆస్పత్రి వెనకాల లేట్ మిషన్‌ను నడిపిస్తున్నాడు. ఉప్పల్ నుంచి బోడుప్పల్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
చికెన్ కర్రీలో పడి BRS కార్యకర్తకు తీవ్ర గాయాలైన ఘటన ధారూరు మండలంలో చోటుచేసుకుంది. ధారూరులోని ఓ ఫంక్షన్ హాల్‌లో బీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం భోజనానికి వెళ్లగా.. కుక్కింద గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ కార్యకర్త మల్లయ్య.. కార్యకర్తల తోపులాటలో అదుపు తప్పి పక్కనే ఉన్న చికెన్ బోగాణలో పడిపోయాడు. ఈ ప్రమాదంలో మల్లయ్యకు తీవ్రగాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు.
పోలీసులు నిర్వహిస్తున్న తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడుతుంది. వికారాబాద్ జిల్లాలో ఇప్పటివరకు పోలీసులు ఇతర శాఖల అధికారులు సంయుక్త తనిఖీల్లో రూ.2,62,96,691 పట్టుబడింది. ఇందుకు సంబంధించి 95 కేసులు నమోదయ్యాయి. మద్యం సరఫరాకు సంబంధించి 148 కేసులు నమోదు కాగా.. రూ.10.83 లక్షల విలువచేసే 3,359 లీటర్ల మద్యాన్ని సీజ్ చేశారు. వీటితో పాటు 338 గ్రాముల బంగారం, 5.12 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారు.
భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందామంటూ సచివాలయం సమీపంలోని 125 అడుగుల డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం ముందు ఈనెల 4న ‘ఛలో నెక్లెస్‌రోడ్ ” పేరిట ఓ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ నిర్వహించనుందని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈనెల 4న నిర్వహించే కార్యక్రమం విజయవంతం అయ్యేలా చూడాలని ఈ సందర్భంగా సిఎం రేవంత్ పార్టీ నేతలను కోరారు.
HYD దిల్‌సుఖ్‌నగర్ వద్ద ఉన్న నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ విద్యాసంస్థలు డిప్లొమా ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫ్యాషన్ డిజైనింగ్, ఎంబ్రాయిడరీ, పెయింటింగ్, మేకింగ్ కోర్సులు చేసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. డిప్లొమా కోర్సుల్లో చేరేందుకు స్కాలర్‌షిప్ పరీక్ష మే 19న జరుగుతుందని, ఆసక్తి గలవారు, విద్యాసంస్థలో సంప్రదించాలని సూచించారు.
HYD సిటీ సివిల్ కోర్టులో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. కోర్టులో పనిచేసే ఉద్యోగులు రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. బెయిల్‌కు సంబంధించిన పేపర్లు ఇవ్వడానికి లంచం డిమాండ్ చేయడంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. ఇద్దరు ఉద్యోగులను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
గ్రేటర్ HYDలో పిల్లల ఆరోగ్య రక్షణ కోసం వ్యాక్సినేషన్ చేస్తున్నట్లు వైద్య అధికారులు తెలిపారు. గ్రేటర్ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రతి బుధవారం చిన్నారులకు వ్యాక్సిన్లను ఉచితంగా పంపిణీ చేస్తారు. ప్రతి శనివారం అంగన్వాడీ కేంద్రాలు, నిలోఫర్ వంటి ప్రసూతి, చిన్నపిల్లల దవాఖానల్లో ప్రతిరోజు వ్యాక్సిన్లు, టీకాలను ఉచితంగా ఇస్తున్నట్లు పేర్కొన్నారు.
HYD, ఉమ్మడి RRలో సామాజిక మాధ్యమాల్లో ప్రచార కార్యక్రమాలను అణువణువు పరిశీలించడానికి మీడియా మానిటరింగ్ బృందాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఇందులో కలెక్టర్, అదనపు కలెక్టర్, పోలీస్ సిబ్బంది, సామాజిక మాధ్యమాల నిపుణుడు, మీడియా రిపోర్టర్, సీనియర్ సిటిజన్,జిల్లా పౌరసంబంధాల శాఖ అధికారి సభ్యులుగా ఉంటారు. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్‌కు, రెచ్చగొట్టే పోస్టులు పెట్టిన వ్యక్తికి నోటీసులు జారీచేసి చర్యలు తీసుకుంటారు.
ఉద్యమకారుడు, బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్‌ఛార్జి మన్నె క్రిశాంక్ అరెస్ట్ అక్రమమని, కాంగ్రెస్ ప్రభుత్వ అణచివేత ధోరణికి ఇది నిదర్శనమని మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. HYD బోయిన్‌పల్లిలో జరిగిన సమావేశంలో పాల్గొన్న తలసాని.. కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదితను గెలిపించాలని కోరారు. BRS మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.