India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYD శివారు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ రన్ వే పక్కన చిరుత ఉన్నట్లు తెలుస్తోంది. ఆదివారం తెల్లవారుజామున చిరుతను పెట్రోలింగ్ సిబ్బంది గుర్తించారని, ఇంకా రన్ వే పరిసర ప్రాంతంలోనే ఉన్నట్లు వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఎయిర్‌పోర్ట్ అథారిటీ సిబ్బంది వైల్డ్ లైఫ్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో చిరుతను పట్టుకునేందుకు చర్యలు చేపట్టినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
MMTS రైలులో వెళుతున్న CRPF SIను బెదిరించిన ఆగంతకులు గొలుసు లాక్కెళ్లిన సంఘటన కాచిగూడ రైల్వే PS పరిధిలో జరిగింది. రైల్వే ఇన్‌స్పెక్టర్ ఎల్లప్ప కథనం ప్రకారం.. మైలార్‌దేవ్‌పల్లి వాసి ప్రసాద్(CRPF SI) శుక్రవారం రాత్రి MMTSలో ప్రయాణించారు. యాకుత్‌పుర-ఉప్పుగూడ స్టేషన్ల మధ్యన ముగ్గురు ఆగంతకులు కత్తితో బెదిరించి ఆయన మెడలోని 15 గ్రాముల బంగారు గొలుసు, రెండు సెల్ ఫోన్లు దొంగిలించారు. కేసు నమోదైంది.
డబుల్ పేర్లు ప్రధాన పార్టీ అభ్యర్థులకు గుబులు రేపుతున్నాయి. చేవెళ్ల మండలం ధర్మసాగర్‌కు చెందిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. AIFB నుంచి కర్మన్‌ఘాట్‌కు చెందిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి నామినేషన్ వేశారు. కాంగ్రెస్ అభ్యర్థిగా గడ్డం రంజిత్ రెడ్డి నామినేషన్ వేయగా.. ఇదే పేరుతో దుండిగల్‌కు చెందిన రంజిత్‌రెడ్డి గాదె రెవెల్యూషనరీ సోషలిస్టు పార్టీ నుంచి నామినేషన్ వేశారు.
చెరువులో దూకి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన శామీర్‌పేట పరిధిలో జరిగింది. పోలీసుల వివరాలు.. వెస్ట్ మారేడ్‌పల్లికి చెందిన బత్తుల కుమార్(45) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం మధ్యాహ్నం ఇంట్లో నుంచి వెళ్లిన కుమార్ తన భార్య మంజులకు ఫోన్‌చేసి తాను బొల్లారం చెరువు వద్ద ఉన్నానని, చెరువులో దూకి చనిపోతున్నానని చెప్పాడు. దీంతో అక్కడ వెతకగా కనిపించలేదు. శామీర్‌పేట చెరువు వద్ద మృతదేహం లభ్యమైంది.
భార్యతో గొడవపడిన భర్త ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన కీసర PS పరిధిలో జరిగింది. పోలీసుల వివరాలు.. బీబీనగర్ మండలానికి చెందిన మహేశ్(38) భార్య భవాని తన ఫోన్ ద్వారా ఓ వ్యక్తికి ఫోన్‌పే ద్వారా డబ్బులు పంపింది. ఇది గమనించిన మహేశ్ తన భార్యను నిలదీయగా.. పుట్టింటికి వెళ్లింది. దీంతో మహేశ్ తన బావమరిదికి వీడియో కాల్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పి ఉరేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
హైదరాబాద్-విజయవాడ రూట్‌లో వెళ్లే ప్రయాణికుల కోసం ప్రతి 10 నిమిషాలకో బస్సును RTC అందుబాటులో ఉంచిందని MD సజ్జనార్ తెలిపారు. ఆ మార్గంలో ప్రతిరోజు 120కి పైగా బస్సులను సంస్థ నడుపుతోందని, అందులో లహరి ఏసీ స్లీపర్ 2, నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్ 2, ఈ-గరుడ 10, గరుడ ప్లస్ 9, రాజధాని 41, సూపర్ లగ్జరీ 62 బస్సులున్నాయి. ఈ బస్సుల్లో tsrtconline.in రిజర్వేషన్ చేసుకునే వారికి 10 శాతం రాయితీని సంస్థ కల్పించింది.
మాజీ CM KCRపై సీనియర్ న్యాయవాది అరుణ్ కుమార్ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల ఓ ఛానల్ ఇంటర్వ్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకొని కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో KCRతో పాటు అప్పటి కేబినెట్‌లోని 39 మంది MLAలపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్నారు.
ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వ్యక్తిని కుల్సుంపుర పోలీసులు అరెస్టు చేశారు. ఇన్స్పెక్టర్ రామస్వామి వివరాలు.. కార్వాన్ బంజావాడి ప్రాంతానికి చెందిన అంబటి శ్రీకాంత్ (36) కొంతకాలంగా ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు ఆకస్మిక దాడి చేసి బెట్టింగ్ కు సంబంధించిన రూ.22,900 స్వాధీనం చేసుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
HYD నగరంలో డిజిటల్ డోర్ నంబరింగ్ కోసం ఇంటింటికీ సర్వే జరిపి ఇంటి పాత నంబర్, బస్తీ పేరు, ప్రాంతం, ఇంటి ఫొటో, యజమాని ఫోన్ నంబర్ సేకరిస్తారు. ఆంగ్ల అక్షరాలు, అంకెల కలయికతో ప్రతి ఇంటికి నంబర్లను కేటాయిస్తారు. డిజిటల్ డోర్ నంబర్ ఉపయోగించి గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ GPS సాయంతో ఇంటిని గుర్తించి, నేరుగా అక్కడికి చేరుకునే వెసులుబాటు ఉంటుందన్నారు.
ఢిల్లీ లాంటి నగరాల మాదిరిగా HYD వ్యాప్తంగా డిజిటల్ డోర్ నంబరింగ్ (DDN) చేయడంపై GHMC కసరత్తు చేస్తోంది. 2018లో మూసాపేటలో పైలట్ ప్రాజెక్టుగా ఆధార్ అనుసంధానంతో 7 అంకెలతో కూడిన డిజిటల్ డోర్ నంబర్ కేటాయించే కార్యక్రమం ప్రారంభించింది. కానీ అప్పుడు పూర్తి స్థాయిలో అమలు కాలేదు. DDN కేటాయించడం వల్ల ఇంటి అడ్రస్ తెలుసుకోవడం సులభతరం అవుతుంది. DDN కేటాయిస్తామని GHMC కమిషనర్ రోనాల్డ్ రాస్ గతంలోనూ చెప్పారు.
Sorry, no posts matched your criteria.