Hyderabad

News April 25, 2024

HYD: వర్షాకాలం కోసం 166 అత్యవసర బృందాలు

image

HYD నగరంలో వర్షాకాలంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు 166 అత్యవసర బృందాలను రంగంలోకి దింపనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందులో 64 మొబైల్, 104 మినీ మొబైల్ బృందాలు ఉండగా, 160 స్టాటిక్ లేబర్స్ టీమ్స్ ఉంటాయి.మొబైల్, మినీ మొబైల్ ఎమర్జెన్సీ టీముల్లో షిఫ్టుల వారీగా ప్రతి టీంలో నలుగురు కార్మికులు ఉంటారు. వివిధ సాధనాలతో నీటిని తొలగించడం లాంటి పనులు నిర్వహిస్తారు.

News April 25, 2024

HYD: ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

image

ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో ఓ సబ్జెక్టులో ఫెయిల్ అయ్యానని మనస్తాపం చెంది విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజేంద్రనగర్‌ పరిధిలో జరిగింది. హైదర్‌గూడకు చెందిన విద్యార్థి(16)ని ఇంట్లో క్షణికావేశంలో ఉరేసుకుంది. దీంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 25, 2024

HYD: బాలికపై ఆటో డ్రైవర్ లైంగిక దాడి

image

బాలికపై ఆటో డ్రైవర్ లైంగిక దాడికి పాల్పడిన ఘటన బషీరాబాద్‌ PS పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు.. ఓ గ్రామానికి చెందిన బాలిక(16)పై అదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ నరేశ్(24) కన్నేశాడు. రోజూ బాలిక చదువుతున్న పాఠశాల వద్ద ప్రయాణికులను ఎక్కించుకునేందుకు వచ్చి మాటలు కలిపి ప్రేమ పేరుతో నమ్మించాడు. పలుమార్లు బాలికపై లైంగిక దాడికి పాల్పడగా గర్భం దాల్చింది. పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.

News April 25, 2024

శంషాబాద్ విమానాశ్రయానికి నేరుగా ఆర్టీసీ బస్సులు

image

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే పుష్పక్ బస్సులు నేటి నుంచి రూట్ మారనున్నాయి. ప్రస్తుతం మెహిదీపట్నం నుంచి PVNR ఎక్స్‌ప్రెస్ వే మీదుగా వెళ్లే బస్సులు ఫ్లైఓవర్ కింద ఉన్న రోడ్డు నుంచి రాకపోకలు సాగిస్తాయని మెహదీపట్నం డిపో మేనేజర్ మూర్తి తెలిపారు. ఈ పుష్పక్ బస్సు సౌకర్యం నేటి అర్ధరాత్రి నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు.

News April 25, 2024

HYD: బెంగళూరు వెళ్లే వారికి ఆర్టీసీ GOOD NEWS

image

హైదరాబాద్-బెంగళూరు మార్గంలో వెళ్లే వారికి ఆర్టీసీ శుభవార్త తెలిపింది. ముందస్తు రిజర్వేషన్ చేసుకునే ప్రయాణికులకు తిరుగు ప్రయాణంపై 10 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు. HYD నుంచి బెంగళూరుకు వెళ్లే అన్ని హైఎండ్ సర్వీసుల్లోనూ ఈ రాయితీ వర్తిస్తుంది. ఈ రూట్‌లో వెళ్లే ప్రయాణికులు 10 శాతం రాయితీని వినియోగించుకుని, సంక్షేమంగా ప్రయాణించాలని కోరారు. SHARE IT

News April 25, 2024

హైదరాబాద్ జిల్లాలో నేటి TOP NEWS

image

> ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి
> జగద్గిరిగుట్టలో రౌడీషీటర్‌ అరెస్ట్
> మాదాపూర్‌లో డీజిల్ స్మగ్లింగ్
> ఓయూ PHD కోర్స్ వర్క్ పరీక్షలు వాయిదా
> నగరంలో జోరుగా ఎన్నికల ప్రచారం
> ఇంటర్ ఫెయిల్.. పలువురు విద్యార్థులు ఆత్మహత్య
> బాలికపై బైక్‌ మెకానిక్ అత్యాచారం
> నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన దానం, మాధవి లత, రాగిడి

News April 25, 2024

HYD: ఇంటర్‌ FAIL.. అమ్మాయి సూసైడ్

image

HYDలో ఇంటర్ స్టూడెంట్‌ సూసైడ్ చేసుకొంది. స్థానికుల వివరాల ప్రకారం.. హైదర్‌గూడ శివనగర్‌ వాసి శ్రీనివాసరెడ్డి కూతురు హరిణి (16) మెహదీపట్నం‌లోని ఓ కాలేజీ‌‌లో ఇంటర్‌ చదువుతోంది. నేడు విడుదలైన ఫలితాల్లో మాథ్స్‌ సబ్జెక్ట్‌లో ఫెయిల్ అయ్యింది. ఈ విషయాన్ని శుభకార్యానికి వెళ్ళిన తల్లికి ఫోన్ చేసి చెప్పింది. తల్లి ఇంటికొచ్చే లోపే ఉరేసుకొంది. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు.

News April 25, 2024

IPL: హైదరాబాదీలకు గుడ్‌న్యూస్

image

రేపు ఉప్పల్ స్టేడియం వేదికగా SRH VS RCB ఐపీఎల్‌ మ్యాచ్ జరగనుంది. ఫ్యాన్స్ కోసం మెట్రో, TSRTC అధికారులు‌ అదనపు సర్వీసులు నడుపుతున్నారు. రేపు అర్ధరాత్రి 12:15 వరకు మెట్రో రైళ్లు నడుస్తాయి. మెహదీపట్నం, హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం, కోఠి, అఫ్జల్‌గంజ్, లక్డీకపూల్, దిల్‌సుఖ్‌నగర్, జీడిమెట్ల, JBS, పాతబస్తీ తదితర ఏరియాల నుంచి స్టేడియానికి మొత్తం 24 రూట్‌లలో RTC సర్వీసులు ఉంటాయి. సద్వినియోగం చేసుకోండి.
SHARE IT

News April 25, 2024

పద్మారావు మంచోడే: CM రేవంత్ రెడ్డి

image

సికింద్రాబాద్‌ MLA పద్మారావు మంచోడే అని CM రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం సికింద్రాబాద్ కార్నర్ మీటింగ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్‌తో కలిసి పాల్గొన్నారు. ‘పద్మారావు పరువు తీసేందుకే కేసీఆర్ ఆయన్ని పోటీకి దింపారు. పజ్జన్న నామినేషన్‌కు కేసీఆర్, కేటీఆర్ ఎందుకు రాలేదు? దీన్ని చూసి అర్థం చేసుకోవచ్చు. సికింద్రాబాద్ సీటును కేసీఆర్ బీజేపీకి తాకట్టు పెట్టారు’ అంటూ రేవంత్ రెడ్డి ఆరోపించారు.

News April 25, 2024

HYD: గృహ జ్యోతి పథకంపై BIG UPDATE

image

HYD నగరం సహా అనేక చోట్ల 30 రోజుల తర్వాత కరెంటు బిల్లు జనరేట్ చేయడం ద్వారా 200 యూనిట్లకు ఎక్కువగా వచ్చి గృహజ్యోతి పథకాన్ని పొందలేకపోతున్నామని పలువురు వాపోయారు. దీని పై స్పందించిన TSSPDCL అధికారులు, గృహ జ్యోతి పథకానికి కరెంటు బిల్లింగ్ తేదీతో సంబంధం లేదని, నెలసరి సగటు యూనిట్లకే (RED BOX) పథకం లెక్కించబడుతుందని తెలిపింది.కాగా ప్రభుత్వం నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు అందిస్తున్న సంగతి తెలిసిందే.