India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. RR జిల్లా రాజేంద్రనగర్ ఎమ్మార్వో కార్యాలయంలో నామినేషన్ వేశారు. నామినేషన్ వేయడానికి ముందు ఆరే మైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. మహేశ్వరం బీజేపీ ఇన్‌ఛార్జి శ్రీరాములు యాదవ్ ప్రపోజల్ సంతకం చేసినట్లు పేర్కొన్నారు. చేవెళ్ల అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తానని విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు.
హైదరాబాద్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి మాధవీలతపై బేగంబజార్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైంది. ప్రచారంలో భాగంగా ఆమె వ్యవహరించిన తీరుపై ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. తమ మనోభావాలు కించపరిచేలా ఆమె వ్యవహరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
సోషల్ మీడియాలో ప్రకటనలు చేసే ముందు మీడియా సర్టిఫికేషన్ & మానిటరింగ్ కమిటీ ఎంసీఎంసీ నుంచి అనుమతి పొందాలని జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ రాజకీయ నాయకులను ఆదేశించారు. ఎంసీఎంసీ ఆఫీసు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ కార్యాలయంలో ఉందని తెలిపారు. ఏదైనా ప్రకటనలను ప్రసారం చేయడానికి కనీసం 24 గంటల ముందు నాయకులు తమ దరఖాస్తులను ఎంసీఎంసీకి సమర్పించాలని ఆదేశించారు.
హనుమాన్ జయంతి సందర్భంగా ఈనెల 23న శోభాయాత్ర వైభవంగా నిర్వహించనున్నారు. కావున హనుమాన్ జయంతిని పురస్కరించుకొని మంగళవారం ఉదయం 6 నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలను మూసివేయాలని నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. బార్ అండ్ రెస్టారెంట్లు, మద్యం దుకాణాలు మూసి వేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
కొందరు ప్రశ్నించినంత మాత్రాన ఆ పార్టీలకు జవాబు చెప్పే అవసరం లేదని ప్రజలకు, మీడియాకే చెప్తానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దేశ ప్రధాని రాష్ట్రానికి వస్తే రాలేని వారు మాట్లాడే అర్హత బీఆర్ఎస్కు లేదన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం రాత్రి వారసిగూడలో బీజేపీ పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. సీతాఫల్ మండి మీదుగా జీప్ ప్రచార యాత్రను కిషన్ రెడ్డి చేపట్టారు.
ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఆదివారం పలు ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో రూ.5.88 లక్షలు పట్టుబడినట్టు జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ తెలిపారు. లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి ఇప్పటివరకు రూ.14.63 కోట్ల నగదు, రూ.6.90 కోట్ల విలువైన వివిధ వస్తువులు, 20,920 లీటర్ల మద్యం పట్టుకున్నారు. 208 మందిపై కేసులు నమోదు కాగా..
206 మందిని అరెస్టు చేశామని పేర్కొన్నారు.
> రామంతపూర్ కట్టమైసమ్మ ఆలయంలో చోరీ
> లాలాపేటలో ఇంటింటికి BJP బొట్టు కార్యక్రమం
> కీసరలో స్తంభాన్ని ఢీకొని పల్టీ కొట్టిన కారు
> జీపు యాత్రలో పాల్గొన్న కిషన్ రెడ్డి
> ఉప్పల్ శిల్పారామంలో నృత్య ప్రదర్శన
> నగర వ్యాప్తంగా జోరుగా ఎన్నికల ప్రచారం
> ఆసిఫ్‌నగర్‌లో పోలీసులు కార్డెన్ సెర్చ్
> లాలాపేటలో ఇంటింటికి BJP బొట్టు కార్యక్రమం
> ప్రశాంతంగా ముగిసిన TSRJC ఎంట్రెన్స్ పరీక్ష
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన షాద్‌నగర్ పట్టణ కేంద్రంలోని బైపాస్ రోడ్డులో చోటుచేసుకుంది. నందిగామ మండల కేంద్రానికి చెందిన గోవు మల్లేశ్ ద్విచక్ర వాహనంపై కేశంపేట బైపాస్ రోడ్డు దాటుతున్నాడు. ఇంతలోనే గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అతని శరీరం రెండు భాగాలుగా విడిపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్‌లో దారుణఘటన వెలుగుచూసింది. ఆదివారం కూకట్పల్లి PS పరిధి AR పైప్ వర్క్ షాప్ సెల్లార్లో మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. విష్ణు ప్రియ లాడ్జి సమీపంలో గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేసి, హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీం ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. మృతురాలికి 45 ఏళ్లు ఉంటాయని సమాచారం.
నారాయణగూడ CI మానవత్వం చాటుకున్నారు. ఆదివారం TSRJC పరీక్ష రాయడానికి నల్గొండ నుంచి విద్యార్థిని వైష్ణవి నారాయణగూడకు చేరుకుంది. తీరా ఇక్కడికి వచ్చాక పరీక్షా సెంటర్ అంబర్‌పేటలోని ప్రభుత్వం బాయ్స్ స్కూల్ అని తేలియడంతో రోడ్డు వెంబడి కంగారుగా బయల్దేరింది. ఇది గమనించిన CI చంద్రశేఖర్ పోలీస్ వాహనంలో ఎక్కించుకొని 2 నిముషాల ముందే సెంటర్ వద్దకు చేర్చి, ఆదర్శంగా నిలిచారు.
Sorry, no posts matched your criteria.