India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
హైదరాబాద్ నగరంలో రికార్డు స్థాయిలో డూప్లికేట్ ఓట్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం గుర్తించింది. గత రెండేళ్లలో దాదాపు 60.6 లక్షల మంది కొత్త ఓటర్లు చేరినట్లు సీఈఓ వికాస్ రాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ జిల్లాలో 5 లక్షల డూప్లికేట్ ఓట్లు తొలగించినట్లు ఈసీ పేర్కొంది. చాంద్రాయణగుట్టలో 59,289 ఓట్లు, యాకుత్‌పురాలో 48,296 డూప్లికేట్ ఓట్లు గుర్తించామని ఎన్నికల సంఘం వెల్లడించింది.
హిందువుల ఆరాధ్య దైవం ఆంజనేయ స్వామి జన్మోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ డిమాండ్ చేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో మాట్లాడుతూ.. భాగ్యనగర్ కేంద్రంగా వీర హనుమాన్ విజయ యాత్ర పేరుతో ఈనెల 23న హనుమాన్ జన్మోత్సవం కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. ర్యాలీలో దాదాపు 3 లక్షల మంది బజరంగ్ దళ్ కార్యకర్తలు పాల్గొంటారని తెలిపారు.
బ్లాక్‌లో IPL టికెట్లను అమ్ముతున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగులను సైబరాబాద్ SOT పోలీసులు అరెస్ట్ చేశారు. కొండాపూర్ ప్రాంతంలో ఐపీఎల్ టికెట్లను బ్లాక్‌లో విక్రయిస్తున్నారన్న సమాచారంతో ముగ్గురు యువకులను పట్టుకుని వారి నుంచి 15 ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సన్ రైజర్స్ V/s రాయల్ ఛాలెంజర్ టిక్కెట్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో టికెట్ రూ.10వేలకు విక్రయిస్తున్నట్లు తెలిపారు.
బీజేపీకి భారీ షాక్ తగిలింది. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో మాజీ ఎంపీ రవీందర్ నాయక్ కాంగ్రెస్‌లో చేరారు. నాటి ప్రధాని ఇందిరమ్మ కుటుంబానికి అత్యంత సన్నిహితుల్లో రవీందర్ నాయక్ ఒకరు. రాష్ట్రంలో గిరిజనులను ప్రభావితం చేసే నాయకుడు కావడంతో పార్లమెంట్ ఎన్నికల ముందు ఈ పరిణామం చోటు చేసుకోవడం కాంగ్రేస్‌కు మరింతగా కలిసి రానుంది.
సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా కిషన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల అధికారులకు నామినేషన్ పత్రాలు అందజేశారు. కిషన్ రెడ్డి వెంట రాజ్యసభ సభ్యులు కే.లక్ష్మణ్ ఉన్నారు. తనకు ఎంపీగా అవకాశం ఇచ్చిన బీజేపీ అధిష్టానానికి కిషన్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మరోసారి ప్రజల ఆశీర్వాదం తనపై ఉందని నమ్ముతున్నట్లు తెలిపారు. మరోసారి ఎంపీగా గెలిచి ప్రజలకు సేవ చేస్తానని అన్నారు.
మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వంశీచంద్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే ఎన్నెం శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ హాజరయ్యారు. ఉదయం వంశీ చంద్ రెడ్డికి మద్దతుగా సీఎం రేవంత్ రెడ్డి ర్యాలీ నిర్వహించారు.
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ పీజీ డిప్లొమా ఇన్ లా కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సుల మొదటి, రెండో సెమిస్టర్ బ్యాక్లాగ్ పరీక్షలను ఈనెల 25 నుంచి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూసుకోవచ్చని సూచించారు.
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంబీఏ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు ఒక ప్రకటనలో తెలిపారు. ఎంబీఏ (సీబీసీఎస్) మొదటి సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.in లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.
తల్లి, చెల్లిని పోషించలేకపోతున్నానని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన శామీర్‌పేట పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. బాబాగూడకు చెందిన సంపత్ గౌడ్ (23) హైటెక్ సిటీలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. కాగా చేసిన పనికి 2 నెలలుగా జీతాలు రాకపోవడంతో చేతిలో డబ్బులు లేకపోవడంతో తల్లితో చెప్పుకోలేకపోయాడు. బయటకు వెళ్తున్నట్లు చెల్లికి చెప్పి ఓ పాఠశాల సమీపంలో ఉరేసుకున్నట్లు పోలీసులు చెప్పారు.
HYD మాదాపూర్‌లోని NAC లో బీఈ, బీటెక్ సివిల్, బీఆర్క్, ఎంటెక్ పూర్తి చేసిన విద్యార్థుల కోసం ప్రత్యేకంగా పీజీ డిప్లొమో కోర్సులను అందిస్తున్నట్లు తెలిపారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమో ఇన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమో ఇన్ క్వాంటిటీ సర్వేయింగ్ అండ్ కాంట్రాక్ట్ మేనేజ్మెంట్ కోర్సులున్నాయని, డిప్లొమో చేసిన వారికి కన్ స్ట్రక్షన్ సేఫ్టీ కోర్సులో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.