Hyderabad

News April 19, 2024

HYD: రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి

image

బైకును కారు ఢీకొన్న ఘటనలో కానిస్టేబుల్ మృతి చెందారు. స్థానికుల వివరాలు.. సరూర్ నగర్ PSలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ధనుంజయ్ కుటుంబసభ్యులతో కలిసి బైకుపై ఘట్‌కేసర్‌లో ఓ ఫంక్షన్‌కి గురువారం వెళ్లారు. నేడు ఉదయం ఉప్పల్‌లోని తన నివాసానికి భార్య, పిల్లలతో కలిసి బయల్దేరారు. ఈ క్రమంలో పోచారం ఐటీ కారిడార్ వద్ద కారు వారి బైకును ఢీకొంది. ఈ ఘటనలో కానిస్టేబుల్ మృతి చెందగా.. భార్య, పిల్లలకు గాయాలయ్యాయి.

News April 19, 2024

మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల ఆస్తి రూ.54.01 కోట్లు

image

మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు రూ.54.01 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ఎన్నికల అధికారికి ఇచ్చిన తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. రూ.20.43 కోట్ల అప్పులు ఉన్నాయని, తనపై 54 కేసులు ఉన్నట్లు చెప్పారు. చేతిలో రూ. లక్ష నగదు, భార్య జమునకు 1.5 కిలోల బంగారు ఆభరణాలు, వివిధ కంపెనీల్లో పెట్టబడులు ఉన్నాయన్నారు. కుటుంబానికి 72.25 ఎకరాల భూమి, పౌల్ట్రీ ఫారాలు, నివాస, వాణిజ్య భవనాలు ఉన్నాయని వెల్లడించారు.

News April 19, 2024

HYD: మహిళపై రౌడీషీటర్‌ అత్యాచారం.. అరెస్టు

image

భర్త వదిలేయడంతో పిల్లలతో కలిసి ఉపాధి వెదుక్కుంటూ వచ్చిన ఓ మహిళపై రౌడీషీటర్‌ అత్యాచారం చేశారు. పోచారం IT కారిడార్‌ CI రాజు వర్మ వివరాల ప్రకారం.. బిహార్‌కు చెందిన మహిళ (30) అన్నోజిగూడలో అద్దె ఇంట్లో ఉంటూ ఘట్‌కేసర్‌లోని ఓ హోటల్‌లో పని చేస్తోంది. ఆమెను ఈ నెల 16న రౌడీషీటర్‌ ఉమేశ్ నాయక్‌ (22) బెదిరించి అత్యాచారం చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని గురువారం రిమాండ్‌కు తరలించారు.

News April 19, 2024

HYD: ఇందులో మీ వాహనం ఉందా?

image

HYD బాచుపల్లి పోలీసులు ఓ ప్రకటన చేశారు. తమ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏడాదిగా ద్విచక్ర వాహనాలు పడి ఉన్నాయని, అందులో ఎవరిదైనా దొంగిలించి బడిన వాహనం ఉంటే సంబంధిత డాక్యుమెంట్లు చూపించాలని తెలిపారు. అలా డాక్యుమెంట్లు చూపించిన వారికి వెంటనే వాహనం అందజేస్తామని చెప్పారు. పూర్తి సమాచారం కోసం తమను సంప్రదించాలని కోరారు. నగరమే కాకుండా నిజామాబాద్, సూర్యాపేటకు చెందిన వాహనాలు ఉన్నాయన్నారు.

News April 19, 2024

HYD: మంచు శిఖరాన్ని అధిరోహించిన NCC గ్రూప్

image

తెలంగాణ బెటాలియన్ ఆఫ్ HYD NCC గ్రూప్ సభ్యులు క్యాడేట్ ఉపేందర్, సిద్ధార్థ అరుణాచల్ ప్రదేశ్ వద్ద 16,460 ఫీట్ల ఎత్తులో ఉన్న గోరీచేన్ గ్లిషియర్ మంచు శిఖరాన్ని అధిరోహించినట్లు HYD డిఫెన్స్ మినిస్ట్రీ తెలిపింది. NIMAS ఇన్ స్టిట్యూట్ ఆధ్వర్యంలో NCC క్యాడెట్లకు పర్వతారోహణపై శిక్షణ అందిస్తున్నట్లు పేర్కొంది. క్యాడేట్లు అద్భుత ప్రదర్శన చేశారని ప్రశంసించింది.

News April 19, 2024

సికింద్రాబాద్: రైళ్లను పొడిగించిన SCR

image

సికింద్రాబాద్ సౌత్ సెంట్రల్ రైల్వే డివిజన్ పరిధిలోని కాచిగూడ-మధురై (07191) రైలును జూన్ 24 వరకు, ప్రతి బుధవారం నడుపుతున్న మధురై-కాచిగూడ(07192), జాల్నా-ఛాప్రా(07651) రైళ్లను జూన్ 26వరకు, ప్రతి శుక్రవారం నడుపుతున్న కాచిగూడ-నాగర్సోల్(07435), హెచ్ఎస్ నాందేడ్- ఈరోడ్(07189), ఛాప్రా-జాల్నా(07652) రైళ్లను జూన్ 28 వరకు పొడిగించినట్లు తెలిపారు.

News April 19, 2024

మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌లో శంకర్పల్లి వాసి

image

శంకర్పల్లి మున్సిపాలిటీ వివేకానంద నగర్ కాలనీకి చెందిన దండుగుల వెంకటేష్ నేపాల్‌లోని ఖుంజంగ్ మౌంట్ ఎవరెస్టు సమ్మిట్ బేస్ క్యాంపు పాల్గొని 5364 మీటర్ల ఎత్తు గల పర్వతాన్ని అధిరోహించారు. తన మిత్రుడు నరేష్ రెడ్డితో కలిసి సుమారు వారం రోజులపాటు సాగిన ఈ ట్రెక్కింగ్‌లో ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను ముగించుకున్నారు. ఎత్తైన పర్వతంపై భారతదేశపు మువ్వన్నెల జెండాను ఎగరవేయడం గర్వంగా అనిపించిందని పేర్కొన్నారు.

News April 18, 2024

హైదరాబాద్ జిల్లాలో నేటి TOP NEWS

image

> వారసిగూడ పీఎస్ పరిధిలో బాలుడి మిస్సింగ్
> జూబ్లీ బస్ స్టేషన్లో అగ్నిమాపక అవగాహన డ్రిల్
> పాతబస్తీ హత్య కేసులో ఆరుగురు అరెస్ట్
> ఈతకు వెళ్లి ఇద్దరు మృతి
> కాచిగూడ రైలు మ్యూజియంలో ప్రపంచ వారసత్వ దినోత్సవ వేడుకలు
> గాంధీ ఆస్పత్రిలో గుర్తుతెలియని డెడ్ బాడీ లభ్యం
> సెంట్రల్ యూనివర్సిటీలో ABVP, SFI విద్యార్థుల మధ్య ఘర్షణ
> రామంతపూర్‌లో BRS మీటింగ్

News April 18, 2024

HYD: JNTUHలో సైబర్ కోర్సులు

image

కూకట్పల్లిలోని JNTUHలో సైబర్ కోర్సులను అందిస్తున్నట్లు సైబర్ భద్రతా కేంద్రం ఆర్.శ్రీదేవి తెలిపారు. విద్యార్థులు, ఆచార్యులు, పరిశోధకులు సైబర్ భద్రత అంశాల పై అవగాహన పెంచుకుని నిపుణులవ్వాలనే లక్ష్యంతో ప్రత్యేక కోర్సును అందుబాటులోకి తీసుకువచ్చామని అన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల అధికారులు, ఉద్యోగులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నారు.

News April 18, 2024

HYD: రాజాసింగ్‌పై కేసు నమోదు

image

HYD నగరం గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కేసు నమోదు చేసినట్లు అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్ SHO లింగేశ్వర రావు తెలిపారు. గౌలిగూడ సమీపాన బాణసంచా కాల్చారని, ర్యాలీని ఆపి, భక్తులు, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించినట్లు పేర్కొన్నారు. మరోవైపు రాజాసింగ్ సహా జోగేందర్ సింగ్ బిట్టు పై కేసు నమోదు చేశారు. అనుమతులు లేకుండా భారీగా భక్తులతో శోభయాత్ర నిర్వహించారని సుమోటోగా కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు.